Hero kartikeya donates 2 Lakhs to Corona crisis charity

క‌రోనా వైర‌స్ కార‌ణంగా దేశ‌మంత‌టా లాక్ డౌన్‌. సినీ ప‌రిశ్ర‌మంతా స్తంభించిపోయింది. ఈ త‌రుణంలో పేద సినీ కార్మికులను కాపాడ‌టానికి సినీ ప్ర‌ముఖులు ముందుకొచ్చారు. 21 రోజుల లాక్ డౌన్ వలన సినిమా షూటింగులు లేక ఇబ్బంది పడుతున్న రోజు వారీ సినీ కార్మికుల కోసం తన వంతు బాధ్యతగా హీరో  కార్తికేయ ఇప్పుడు రూ.2 ల‌క్ష‌ల విరాళాన్ని సినీ కార్మికుల(’క‌రోనా క్రైసిస్ చారిటీ’(సి.సి.సి)సహాయ నిధికి అంద‌చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.ఈ లాక్ డౌన్ మనకి అత్యంత అవసరం అని, అందరూ ఇంటిలోనే ఉండి విధిగా దాన్ని పాటించాలని పిలుపునిచ్చారు.
 మెగాస్టార్ చిరంజీవి ఆధ్వ‌ర్యంలో ’క‌రోనా క్రైసిస్ చారిటీ’(సి.సి.సి) ను ఏర్పాటు చేశారు. చిరంజీవి ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ సినీ క‌ళాకారుల‌ను ఆదుకోవ‌డానికి ప్ర‌ముఖులు ముందుకు రావాల‌ని సూచించారు. సి.సి.సి ద్వారా చిత్ర ప‌రిశ్ర‌మ కార్మికుల సంక్షేమార్థం ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here