Hero Nandamuri Kalyanram interview about ‘Bimbisara’ Movie

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న తాజా చిత్రం ‘బింబిసార’. ఏ టైమ్ ట్రావెల్ ఫ్ర‌మ్ ఈవిల్ టు గుడ్ క్యాప్ష‌న్. వ‌శిష్ట్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై హ‌రికృష్ణ .కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఆగ‌స్ట్ 5న ఈ మూవీ గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర హీరో కళ్యాణ్ రామ్ పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ..

ఈ ప్రాజెక్టు ఎలా స్టార్ట్ అయ్యింది?

ఈ ప్రాజెక్ట్ గురించి వశిష్ట నాకు 2018 డిసెంబర్ లో కథ చెపుతాను అని అప్రోచ్ అయ్యాడు.అపుడు నేను మహానాయకుడుకు షూటింగ్ లో ఉన్నాను. అయితే షూటింగ్ అయిపోయిన తరువాత వింటాను అన్నాను. అయితే తను కథ చెపుతాను కానీ లాజిక్ అడగొద్దు. ఇందులో మ్యాజిక్ ఉంటుంది అన్నారు.అయితే బాగా తెలిసిన కుర్రాడు 2015 నుండి నాకు అప్పుడప్పుడు వచ్చి కథలు చెప్పేవాడు అవ్వడంతో సరే అన్నాను.తను చెప్పినప్పుడు ఇందులో క్రూరత్వం అనే క్యారెక్టర్ లేదు.అయితే ఒక చిన్న టైం ట్రావెల్ , ఫాంటసీ ఎలిమెంట్స్ తో కూడుకున్న కథ ఇది. బేసిక్ టాపిక్ చాలా కొత్తగా అనిపించింది.మనం ఇలాంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని వశిష్ఠ కు ఎస్ చెప్పాను.ఆ తరువాత ప్రతి క్యారెక్టర్ ఎలా ఉండాలి , గెటప్ ఎలా ఉండాలి అని డిస్కస్ చేసుకుంటూ బింబిసార టైటిల్ అనుకున్నాం.

మీరు చాలా మంది డైరెక్టర్స్ కు అవకాశం కల్పించారు అయితే ఇంత పెద్ద స్పాన్ ఉన్న సినిమాకు కొత్త డైరెక్టర్ కు అవకాశం ఇవ్వడానికి కారణమేంటి?

నేను అప్పుడప్పుడూ తీసిన సినిమాలు స్పాన్ ఉన్న సినిమాలు అవుతాయి. అంతకుముందు నేను తీసిన రెండు సినిమాలు లవ్ స్టోరీస్ ఫెయిల్యూర్స్.ఆ రోజు అతనొక్కడే సినిమా చేసే ముందు సురేందర్ రెడ్డి కొత్తవాడే తను తీసిన యాక్షన్ బేస్డ్ సినిమా స్క్రీన్ ప్లే , టేకింగ్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాయి.కాబట్టి కథే ముఖ్యం. మనం కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చి మంచి ప్యాడింగ్ ఇచ్చి వారితో మనం కూర్చొని డిస్కర్షన్ చేసి వారిని ప్రోత్సహిస్తూ వాళ్లకి టైం ఇస్తూ మనం బెస్ట్ తీసుకోగలగాలి. అప్పుడు వారినుండి కచ్చితంగా మంచి సినిమాలు వస్తాయని నేను నమ్ముతాను. ఇప్పుడు వశిష్ఠ కూడా అంతే

ఈ మీకోవర్ ను ఎలా ఎంజాయ్ చేశారు ?

హోల్ మీకోవర్ ప్రాసెస్ చాలా ఎంజాయ్ చేశాను. ఎంతమంచి వాడవురా లో కళ్యాణ్ రామ్ ఎంతో మంచివాడు ఇందులో అగ్రేసివ్ నేచర్ ఉంటుంది.అయితే ఈ ఫిలిం లో అది నేను ఎక్సపోజ్ చేయగలిగాను.కొత్త క్యారెక్టర్ ను చేయగలిగాను ఫెంటాస్టిక్ గా. రాజుగా చెయ్యాలి అనుకున్నప్పుడు నాకు మెనీ డౌట్స్ ఉండేవి.అద్భుతమైన కథ ఉన్నప్పటికీ రాజుగా నేను సెట్ అవుతానా ? అనే డౌట్ ఉండేది.అయితే నేను రాజుగా ఇప్పటి వరకు చేయలేదు. కానీ కొన్ని రిఫరెన్స్ లు ఉన్నాయి మనకి .అప్పట్లో తాత గారు తరువాత బాబాయ్, రీసెంట్ గా ప్రభాస్ ఒక మార్క్ క్రియేట్ చేసి రాజు అంటే ఇలా ఉండాలి అనే స్టాండ్ పెట్టేశాడు.కాబట్టి నేను కూడా ఆ ఎక్స్ పెక్టేషన్స్ ని లుక్స్ తో రీచ్ అవ్వడానికి నా హైట్ కు బాడీ ఎలా ఉండాలి అని మార్చుకుంటూ స్పెషల్ కేర్ తీసుకొని రెండు నెలలు వర్క్ చేసి రాజులా ఉండడానికి చాలా ట్రై చేయడం జరిగింది.

ఇలాంటి సినిమాలకు యాక్షన్ ఎపిసోడ్స్ చాలా ముఖ్యం కాబట్టి మీరు ఈ సినిమాకు ఎలాంటి కేర్ తీసుకున్నారు?

అందరికీ ఒకటే చెపుతున్నా మాది బాహుబలి సినిమా రిఫరెన్స్ కాదు. వాళ్లకున్న వార్ ఎపిసోడ్స్ మా సినిమాలో ఉండవు.ఇట్ ఈజ్ అల్ అబౌట్ కింగ్.మేము ఎక్కువగా సోషియల్ ఫ్యాంటసీ మీద ఎక్కువ డిపెండ్ అయ్యాము.ఇది ఒక బింబిసారుడి కథ మాత్రమే. కాకపోతే జానపద చిత్రాల్లోని విటలాచార్య గారి సినిమాల్లో కనిపించే దెయ్యాలు , భూతాలు వంటి కొన్ని ఫాంటసీ ఎలిమెంట్స్ ఉంటాయి.

ఈ చిత్రాన్ని ఎన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు?

నా బేస్ తెలుగు. నాకున్న బడ్జెట్ కి రేంజ్ కి తెలుగు సినిమా చేయగలను. తెలుగు నుండి బయటికి వచ్చేసి మిగతా బాషల్లో రిలీజ్ అంటే చాలా ఖర్చవుతుంది. అందుకే కేవలం తెలుగు మీదే ఫోకస్ పెట్టి సినిమా కంప్లీట్ చేశాం. తెలుగులో పెద్ద సక్సెస్ అయ్యిన తరువాత మిగతా భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తాం.

ఈ సినిమా చేస్తున్నపుడు మీరు ఎలాంటి డైట్ పాటించారు?
బయట ఫుడ్ తినకుండా ఇంట్లో చేసిన ఫ్రైడ్ చికెన్, చిప్స్ లాంటి వాటికి దూరంగా ఉంటూ ఓన్లీ ఇంట్లో చేసిన కూరలు, బాస్మతి రైస్ ఇలా చాలా బ్యాలెన్స్డ్ గా డైట్ పాటించడం జరిగింది

ఈ క్యారెక్టర్ చేస్తున్నపుడు తాత గారి రిఫరెన్స్ ఏమైనా తీసుకున్నారా?

మా తాత గారి గెటప్స్ కానీ మేనరిజమ్స్ గానీ ఎలాంటి రిఫరెన్స్ తీసుకోలేదు.నాకు ఆ ఆలోచనే రాలేదు. ఆయన ఒక లివింగ్ లెజెండ్. ఎవరూ ఆయన్ను రీచ్ అవ్వలేరు. .నా లిమిట్స్ నాకు తెలుసు ఆయనకు సంబంధించి ఏదైనా రిఫరెన్స్ ఉంది అనుకుంటే నేను భయంగా దూరంగా వెళ్ళిపోతా.

ఈ సినిమాను దిల్ రాజు, యన్టీఆర్ కు చూయించారు. మీరు కూడా వెరీ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు.ఈ సినిమా ద్వారా కళ్యాణ్ రామ్ ను 2.1 గా చూడచ్చా ?

డెఫినెట్ గా చూడచ్చు.

టైమ్ ట్రావెల్ ను ఎంత కన్విన్సింగ్ చెప్పగలిగారు?

అది సినిమా చూస్తేనే మీకు అర్థమవుతుంది.

ఫ్యూచర్ లో ఇలాంటి సినిమాలు చేస్తారా?

అసలు నేను బింబిసార సినిమా చేస్తాను అనే అనుకోలేదు.కానీ చేస్తున్నాను. అంటే నిజానికి కొన్ని కథలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి.అది నేను నమ్ముతాను. అతనొక్కడే కథ చాలా మంది హీరోలు విన్నారు. కానీ నేను చేశాను. ఎందుకంటే ఆ కథ నాకు రాసుంది కాబట్టి. అలాగే బింబిసార వంటి మంచి కథ కూడా నన్ను వెతుక్కుంటూ వచ్చిందని భావిస్తున్నాను.

ఈ కథలో ఎలాంటి మార్పులు చేశారు ?

ఏ కథకయినా మార్పులు సహజమే. ఎంత బౌండెడ్ స్క్రిప్ట్ తో వచ్చినా కొన్ని మార్పులు చేయడం సహజమే. బింబిసార కథలో కూడా కొన్ని చిన్న చిన్న మార్పులు చేస్తూ వచ్చాము. తారక్ కూడా తనకి అనిపించిన కొన్ని ఇన్పుట్స్ ఇచ్చాడు.

కాస్ట్ అఫ్ కటింగ్ రీజన్ మీద నిర్మాతలు స్ట్రైక్ చేస్తున్నారు దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి?

ప్రస్తుతం నేను ఈ సినిమా ప్రమోషన్ బిజీలో ఉన్నందున పూర్తిగా తెలియదు. కానీ ఇండస్ట్రీలో స్ట్రైక్ జరుగుతుందని మాత్రమే తెలుసు .ఈ సినిమా రిలీజ్ తర్వాత ఒక హీరోగా నేను చేయబోయే సినిమాల నిర్మాతలతో మాట్లాడి విషయం తెలుసుకుంటాను. ఈ లోపు వాళ్ళను కూడా కలవాలనుకోవడం లేదు. ప్రెజెంట్ నా ఫోకస్ అంతా బింబిసార రిలీజ్ మీదే. మేము రెండేళ్ళు కష్టపడి తీసిన సినిమా ఇది.

ఇప్పుడున్న క్లిష్ట పరిస్తుతుల్లో జనాలు థియేటర్స్ కు రావడం లేదు అనే అయోమయం నెలకొంది. ఈ సినిమా ట్రైలర్ తరువాత ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది..అయితే కచ్చితంగా థియేటర్స్ కి జనాలు వస్తారా రారా అనే టెన్షన్ ఏమైనా మీలో ఉందా ?

థియేటర్స్ కి జనాలు రావడం లేదు. సినిమాలు చూడట్లేదు అంటే నేను నమ్మను.మంచి సినిమాలు తీస్తే మేము వేసిన ట్రైలర్ కు కన్విన్స్ అయితే థియేటర్ కు వచ్చిన ప్రేక్షకులకు కంటెంట్ బాగుండి, మౌత్ టాక్ స్ప్రెడ్ అయితే సినిమాలు కచ్చితంగా ఆడతాయి.మనకు అమెరికా లో లాగా డిస్నీ, యూనివర్షల్ స్టూడియోస్ లేవు. మన తెలుగు ప్రేక్షకులు థియేటర్స్ లో సినిమాలు చూసేందుకు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటారు. వాళ్లకి నచ్చే సినిమా వస్తే తప్పకుండా థియేటర్స్ కి వచ్చి చూస్తారు. ఇటివలే మన తెలుగు సినిమా మేజర్,చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన కమల్ గారి విక్రమ్, విక్రాంత్ రోన సినిమాలు మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా మంచి కలెక్షన్స్ తెచ్చుకున్నాయి.. పెద్దల కాలం నుండి థియేటర్స్ లో సినిమా చూడటం అనేది మన నేచర్ లో భాగం.. ఆ తరువాత టివి లో వస్తే చూసి ఎంజాయ్ చేస్తాం.

చిత్ర దర్శకుడు బింబిసార పార్ట్ 2,3,4 కూడా ఉంది అన్నారు?

మేము చూయించేవి అన్నీ ఫ్యాంటసీ ఎలిమెంట్స్.ఈ సినిమాకు సంబంధించి ఇంకా సీక్వెల్స్ ఉంటాయి.కానీ ఫ్రాంచైజీలు ఉంటాయి.ప్రస్తుతానికి రెండో భాగానికి కథ రెడీ గా ఉంది. ఈ సినిమా రిలీజ్ తరువాత ప్లాన్ చేస్తాము.

ప్రేక్షకులలో బింబి సార కు హై ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి., మరో పక్క మీ ఫ్యాన్స్ కూడా ఈ చిత్రం హిట్ అవ్వాలని అనుకుంటారు. దీనిపై మీ ఫీలింగ్స్ ఏంటి?

అందరూ మా సినిమా హిట్ అవ్వాలని బ్లెస్సింగ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.సినిమా రిలీజ్ కు ముందే ఒక యాక్టర్ కు ఇలాంటి బ్లెస్సింగ్ రావడం చాలా గ్రేట్. అలాగే ఈ సినిమా లో ఉన్న విజువల్స్ సినిమా చాలా బాగుంటుంది.. ఆడియన్స్ కు ఈ సినిమా పై ఉన్న ఎక్సపెక్టేషన్స్ కు మాత్రం కచ్చితంగా రీచ్ అవుతుంది.

ఈ సినిమాలో మీరు రొమాంటిక్ సీన్స్ లో బాగా ఎంజాయ్ చేశారా?

అయ్య బాబోయ్ (నవ్వుతూ..)నేను రొమాంటిక్ సినిమాలకు సెట్ అవ్వను. అందుకే నాకు రొమాంటిక్ సీన్స్ నాకు సూట్ అవ్వవు అని తెలుసు. అందుకే నేను ఎక్కువగా రొమాంటిక్ సినిమాలు చేయను.ఈ సినిమాలో కూడా ఎక్కువ రొమాంటిక్ ఉండదు.

 

మల్టీ స్టారర్ సినిమాలు చేసే ఆలోచన ఏమైనా ఉందా?

RRR సినిమా ద్వారా ఇద్దరు స్టార్ హీరోలు కలసి చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది.అది కూడా రాజమౌళి గారి లాంటి డైరెక్టర్ చేసిన స్టోరీ ని చెప్పి కన్విన్స్ చేశాడు.ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంతే వెరీ హై ఎక్సపెక్టేషన్స్ ఉంటాయి. అందులో ఏదైనా చిన్న మిస్టేక్ జరిగితే ఫ్యాన్స్ ఊరుకోరు..కాబట్టి అలాంటి సినిమాలు రావడం అంతే అంత ఈజీ కాదు.

మీ బ్యానర్ లో బాలయ్య బాబుతో సినిమా ఎప్పుడు ఉంటుంది?

100% ఉంటుంది. బాలయ్య బాబాయ్ తో ఓ సినిమా చేయాలని ఎప్పటి నుండో ఉంది. ఆయనకి ఓ కథ కూడా వినిపించడం జరిగింది. కానీ కథ నచ్చలేదు.మంచి కథ వస్తే తప్పకుండా సినిమా చేస్తాను.

యన్టీఆర్ తో సినిమా ఎప్పుడు ఉంటుంది?.
ఆల్రెడీ మేము అనౌన్స్ చేశాము.తను ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా.. గ్లోబల్ యాక్టర్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఒక బిగ్ బ్లాక్ బస్టర్ తర్వాత యాక్టర్ నుండి వచ్చే నెక్స్ట్ సినిమా అంటే కాస్త టైం తీసుకొని ముందుకు వెళ్ళాలి. అలాగే డైరెక్టర్ గారి సైడ్ , ప్రొడక్షన్ సైడ్ అందరికీ ఒక ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రొడక్షన్ మీద చాలా ప్రెజర్ ఉంటుంది.. ఆడియన్స్ అంచనాలను మ్యాచ్ చేసే సినిమాతో రావాలని చూస్తున్నాం. టైం తీసుకోకుండా హరీ బరీ గా తీస్తే మంచి సినిమా తీయలేము.కాబట్టి కొంచెం టైమ్ తీసుకొని చేస్తాం అని ముగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here