Megastar graced our function we are blessed

యంగ్ హీరో నిఖిల్, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా న‌టిస్తోన్న చిత్రం `అర్జున్ సుర‌వ‌రం`. బి.మ‌ధు స‌మ‌ర్ప‌ణ‌లో మూవీ డైన‌మిక్స్ ఎల్ ఎల్ పి బ్యాన‌ర్‌పై టి.సంతోష్ ద‌ర్శ‌క‌త్వంలో రాజ్‌కుమార్ ఆకెళ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న‌వంబ‌ర్ 29న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో నిఖిల్ ఇంటర్వ్యూ..

అర్జున్ సురవరం మూవీ విడుదల ఇంత ఆలస్యం కావడానికి కారణం?

మే 1న విడుదల కావాల్సిన మూవీ ఇన్ని నెలల తరువాత థియేటర్స్ లోకి వస్తుంది. సినిమా విడుదల ఎప్పుడవుతుందా అనే బాధతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. నిర్మాతలకు దియేటర్స్ ఓనర్స్ కి మధ్య ఉండే వారు మా సినిమాని వాడేసుకున్నారు. ఈ విషయంలో నేను, నిర్మాతలు ఏమి చేయలేకపోయాం. అవన్నీ సాల్వ్ చేసుకుంటూ వచ్చే సరికి ఈ సమయం పట్టింది.

అర్జున్ సురవరం మూవీ దేని గురించి?

లావణ్య, వెన్నెల కిషోర్, సత్య, నేను ఒక యంగ్ టీమ్. ఈ నలుగురు టీమ్ సభ్యులు ఒక సమస్యలో పడాతారు, ఆ సమస్య నుండి వాళ్లు ఎలా బయటపడగలిగారు అనేది ముఖ్య కథ. అలాగే మంచి సోషల్ మెస్సేజ్ ఉన్న చిత్రం ఇది. కొందరి చర్యల వలన గ్రాడ్యుయేట్స్ , వారిపై ఆధారపడ్డ తలిదండ్రులు ఎలా సఫర్ అవుతున్నారు అనే విషయాలు చెప్పడం జరిగింది.

ఈమధ్య కెరీర్ పరంగా వెనుకబడ్డాను అనుకుంటున్నారా?

ప్రతి రోజు నేను పది నుండి పదిహేను స్క్రిప్ట్స్ వింటూ ఉంటాను. అలాగని ప్రతి సినిమా చేసుకుంటూ వెళ్ళలేను. హ్యాపీ డేస్ మూవీ చేసే ముందే మా అమ్మగారు… నీ సినిమా కుటుంబం మొత్తం కూర్చొని చూసేదిలా ఉండాలి అన్నారు. అందుకే సెలెక్టివ్ గా కథలు ఎంచుకుంటున్నాను.

ఇది తమిళ చిత్రానికి రీమేక్ కదా, మరి ఇక్కడి నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు ఏమైనా చేశారా?

మెయిన్ ప్లాట్ మార్చకుండా కొన్ని మార్పులు చేశాం. లావణ్య ,వెన్నెల కిషోర్, సత్య పాత్రలను మరింత స్ట్రాంగ్ గా నా పాత్రకు సమానంగా పెంచడం జరిగింది.

సినిమాలలోకి రావడానికి మీకు చిరంజీవి స్ఫూర్తి అన్నారు, ఎలా?

ఒక సారి స్కూల్ చిల్డ్రన్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్ కి చిరంజీవి గారు వచ్చారు. అప్పుడు నా ప్రదర్శన కూడా ఉంది. అప్పటికే చాలా సమయం కావడం వలన ఆయన నా ప్రదర్శన చూడకుండానే వెళ్లిపోయారు. నా డాన్సులు చూసి ఆయన నన్ను సినిమాలలోకి తీసుకెళతారేమో అనుకొనే వాడిని. అలా చిన్నప్పటి నుండి నాకు హీరో అంటే చిరంజీవి.

దర్శకుడు టి సంతోష్ గురించి చెప్పండి?

ఆయన ఒక రాక్షసుడు, తనకు కావలసినది రాబట్టేవరకు వదిలిపెట్టేవారు కాదు. ప్రమాదాలు, దెబ్బలు తగులుతాయి అనేవి ఆయన పట్టించుకోరు. ఒకే షాట్ ని అనేక టేక్ లు చేయించేవారు. వాళ్ళ నాన్న గారు జర్నలిస్టు, అందుకే ఆయనకు జర్నలిజంపై మంచి అవగాహన ఉంది.

ముద్ర అనే టైటిల్ ఎందుకు మార్చారు?

మేము టైటిల్ ప్రకటించిన తరువాత బుక్ మై షోలో చూస్తే అదే పేరుతో మరో చిత్రం ఉందని తెలిసింది. ఇక అప్పుడు నేనే టైటిల్ మార్చమని సూచించాను.

అర్జున్ సురవరం అని పెట్టడానికి కారణం?

ఈ మూవీలో హీరో పేరు అర్జున్. ఇక సురవరం ప్రతాపరెడ్డి గారు ప్రముఖ జర్నలిస్ట్. ఆయన స్పూర్తితో సురవరం అనే సర్ నేమ్ తీసుకోవడం జరిగింది.

భవిష్యత్తులో ఏమేమి చిత్రాలు చేస్తున్నారు?

కార్తికేయ 2 మూవీ వచ్చే నెల 20 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఇక దర్శకుడు వి ఆనంద్ తో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మూవీ చేస్తున్నాను. అలాగే ‘హనుమాన్’ అనే ఒక మూవీ చర్చల దశలో ఉంది. ప్రస్తుతానికి ఈ మూడు ప్రాజెక్ట్స్ చేస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here