Hero, producer Vishwajith is taking charge as entertainment head for Raj Music & Vissa TV

దమయంతి అనే రైటర్ కౌసిక్ వర్మను వశం చేసుకోవడానికి ఆమె చేసిన విశ్వ ప్రయత్నం విఫలం అవ్వడంతో తను ఇచ్చిన శాపం ఫలితమే ఈ జన్మలో అనుభవిస్తున్న కథ. “కౌశిక వర్మ దమయంతి”. వియాన్ జీ అంగారిక సమర్పణలో గురు దాత క్రియేటివ్ వర్క్స్ పతాకంపై విశ్వజిత్, అర్చన సింగ్, ఊర్వశి రాయ్, రఘు దీప్ నటీ నటులుగా సుధీర్, విశ్వజిత్ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైంది. అయితే చిత్ర హీరో , నిర్మాత విశ్వజిత్ రాజ్ మ్యూజిక్, విస్సా టీ వి లకు ఎంటర్టైన్మెంట్ హెడ్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్బంగా

చిత్ర హీరో , నిర్మాత విశ్వజిత్ మాట్లాడుతూ..200 ఇయర్స్ బ్యాక్ స్టోరీ, ప్రెజెంట్ స్టోరీ లతో తెరకెక్కిన కౌశిక వర్మ దమయంతి” సినిమా రెండు స్టోరీలను బ్యాలెన్స్ చేస్తూ తీసిన సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మంచి కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాకు ప్రేక్షకుల కచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఇందులో ఉన్న ఫాస్ట్, ప్రెజెంట్ జనరేషన్ సాంగ్స్ అన్నీ కూడా ప్రేక్షకులను అలరిస్తాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న నాకు రాజ్ మ్యూజిక్, విస్సా టీ.వి లకు ఎంటర్టైన్మెంట్ హెడ్ గా అవకాశం రావడం అదృష్టంగా బావిస్తున్నాను. ట్యాలెంట్ ఉన్న వారికి అవకాశం ఎప్పుడు, ఎక్కడ ఏ మూల నుండి వస్తుందో తెలియదు.ట్యాలెంట్ ను నమ్ముకుంటే ఇలాంటి అవకాశాలు తప్పకుండా వస్తాయి.నా కెరియర్ దృష్టిలో పెట్టుకుని నా కెరీర్ తో పాటు ఈ సంస్థలు అప్పగించిన బాధ్యతలు కూడా న్యాయం చేస్తాను. నన్ను నమ్మి నాకిలాంటి పెద్ద బాధ్యతల ను అప్పగించిన రాజ్ మ్యూజిక్, విస్సా టివి ల మేనేజ్మెంట్ లకు ధన్యవాదాలు అన్నారు.

నటీ నటులు
హీరో విశ్వజిత్, అర్చన సింగ్, ఊర్వశి రాయ్, రఘు దీప్, ఆగస్తిన్ తదితరులు

సాంకేతిక నిపుణులు
సమర్పణ : వియాన్ జీ అంగారిక
బ్యానర్ : గురు దాత క్రియేటివ్ వర్క్స్
నిర్మాత : గీతా కౌషిక్
దర్శకత్వం : సుధీర్,
దర్శకత్వ పర్యవేక్షణ : విశ్వజిత్
సంగీతం : యస్ యస్ ఆత్రేయ, ఎలెందర్ మహావీర్
డి. ఓ. పి.: శివకుమార్
ఎడిటర్ : వంశీ రెడ్డి, ఆనంద్ పవన్
కొరియోగ్రాఫర్ : జిన్నా, సాగర్, విశ్వజిత్
లిరిసిస్ట్ ::నందకుమార్, కొకల కృష్ణ, దీప్తి, ప్రవీణ్
మాచవారం
సింగర్స్ : గీత మాధురి, సంపత్, హేమచంద్ర, వైశాలి మాడే, విశ్వజిత్, దీప్తి
పి. ఆర్. ఓ : టి. యస్. యన్.మూర్తి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here