Hero Ram Pothineni’s love Action Entertainer ‘The Warrior’ Movie Review

Cinemarangam. com
రివ్యూ రేటింగ్..3/5
స‌మ‌ర్ప‌ణ : ప‌వ‌న్ కుమార్‌,
బ్యానర్ : శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్,
నిర్మాత‌ : శ్రీ‌నివాసా చిట్టూరి,
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శ‌క‌త్వం: ఎన్‌. లింగుస్వామి.
నటీ నటులు : రామ్, కృతి శెట్టి , ఆది పినిశెట్టి,, అక్షరా గౌడ, నదియా తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్,
కూర్పు : నవీన్ నూలి,
కళ : డి.వై. సత్యనారాయణ,
యాక్షన్ : విజయ్ మాస్టర్ & అన్బు-అరివు,
ఛాయాగ్రహణం : సుజీత్ వాసుదేవ్,
మాటలు : సాయిమాధవ్ బుర్రా – లింగుస్వామి,
పి .ఆర్. ఓ : పులగం చిన్నారాయణ


ప‌వ‌ర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో యువ కథానాయకుడు, ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన సినిమా ‘ది వారియర్’. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. రామ్ సరసన కృతి శెట్టి నటించారు. ఆది పినిశెట్టి విలన్ రోల్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో జూలై 14న భారీ ఎత్తున విడుదలైన సినిమా ప్రేక్షకులను ఎ మాత్రం ఎంటర్టైన్మెంట్ చేసిందో రివ్యూ లో చూద్దాం పదండి


కథ
హోలీ పాటతో కలర్ ఫుల్‌గా సినిమా మొదలవుతుంది.
సత్య (రామ్) ఎంబీబీఎస్ పూర్తి చేసి హైదరాబాద్ నుంచి కర్నూల్ లో డాక్టర్‌గా అడుగుపెడతాడు. డాక్టర్‌గా ప్రాణం విలువ తనకు బాగా తెలుసు. అందుకే… కళ్లముందు ఎవరి ప్రాణాలు పోయినా చూస్తూ ఊరుకోడు.అక్కడే రేడియో జాకీ గా పనిచేసే విజిల్ మహాలక్ష్మి కృతి శెట్టి పరిచయం అవుతుంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు అయితే కర్నూలుని గురు (ఆది పినిశెట్టి) తన గుప్పెట్లో పెట్టుకొని ఏలుతుంటాడు. తన మాటే అక్కడ వేదవాక్కు.పోలీసు స్టేషన్‌లో గురుపై కంప్లైంట్ ఇచ్చేందుకు కూడా ఎవరూ సాహసించరు.నకిలీ మందులు తయారుచేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం లాంటి సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంటాడు.గురు ఆగడాలకు అక్కడ అందరూ ఎంతో ఇబ్బంది పడుతుంటారు. అయితే సత్య కాపాడిన ఓ ప్రాణం.. గురు మనుషుల వల్ల పోతుంది. అది చూసి తట్టుకోలేక పోలీస్ కంప్లైన్ట్ ఇస్తాడు. దీంతో సత్యని నానా రకాలుగా భయపెడుతూ చంపడానికి ప్రయత్నిస్తారు అయితే.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సత్యని…డీన్ (జేపీ) కాపాడతాడు. సత్యని కుటుంబంతో సహా మరో ఊరు పంపించేస్తాడు. అయితే రెండేళ్ల తరవాత అదే ఊరికి… సత్య డీఎస్‌పీగా ఎంట్రీ ఇస్తాడు. ఓ డాక్టర్ పోలీస్ ఎలా అయ్యాడు? డాక్టర్‌గా సాధించలేనిది..పోలీసోడిగా ఎలా సాధించాడు? గురు ఆగడాలకు ఎలా అడ్డుకట్ట వేశాడు..? అనేదే మిగిలిన కథ.

నటీ నటుల పనితీరు
ఒకే సినిమాలో డాక్టర్‌గా, పోలీస్‌గా కనిపించే అవకాశం చాలా తక్కువమందికి వస్తుంది. రామ్ పోలీస్‌గా ఎప్పుడూ నటించలేదు. డాక్టర్‌గానూ కనిపించలేదు. రెండు ఆఫర్స్  ఓ కేసారి రావడంతో రెండు పాత్రలలో జీవించాడు అని చెప్పవచ్చు. డాక్టర్‌గా రామ్ చాలా కూల్ గా, పద్ధతిగా . తన ఎనర్జీ లెవిల్స్ తగ్గించి మరీ నటించాడు. అదే పోలీస్ యూనిఫామ్ వేసేసరికి…. ఫుల్ ఎనర్జీ తో ఆదరగొట్టాడు .విజిల్ మహాలక్ష్మిగా కృతిశెట్టి చాలా చక్కగా నటించింది. ప్రతి పాటలో కృతి శెట్టి ఎక్స్‌ప్రెష‌న్స్‌ బావున్నాయి.ఆది పినిశెట్టి ప్రెజెన్స్ చాలా బాగుంది. గురుగా విలన్ పాత్రలో నూటికి నూరుపాళ్లూ తన పాత్రకు న్యాయం చేశాడు.అలాగే తన మాటలతోనే కాదు, కళ్లతోనూ క్రూరత్వం ప్రదర్శించాడు. నదియా.. అమ్మ పాత్రలో మరోసారి చాలా చక్కగా నటించింది..ఇంకా ఇందులో నటించిన వారంతా వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు.


సాంకేతిక నిపుణులు
లింగుస్వామి తెలుగులో ఫస్ట్ టైమ్ స్ట్రెయిట్ తెలుగు సినిమా చేశాడు.తను ఎలాంటి కథలు ఎంచుకొన్నా.. తన ట్విస్టులతో, స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేస్తుంటాడు. రామ్ ఓ పోలీస్ ఆఫీసర్‌గానే కనిపిస్తాడని ఇప్పటి వరకూ చెబుతూ వచ్చారు చిత్ర దర్శకులు.. రామ్‌ని ఓ పోలీస్ గా చూస్తాం… అనే ఆలోచనతోనే థియేటర్ కు వచ్చిన ప్రేక్షకులకు . … రామ్‌ డాక్టర్‌గా ఎంట్రీ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడు . ఒకే సినిమాలో హీరో డాక్టర్‌గా, పోలీస్‌గా రెండు పాత్రలలలో .. ప్రేక్షకులకు కావల్సిన ఎంటర్‌టైన్‌మెంట్ అందించడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు.దేవిశ్రీ ప్రసాద్ ఆల్బమ్‌లో అన్ని పాటలూ బాగున్నాయి . ఇందులో రెండు పాటలు మాస్‌కి. ఓ మెలోడీ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. బుల్లెట్ పాటతో థియేటర్‌కి కాస్త ఊపొస్తుంది. విజిల్ పాటలో… రామ్ స్టెప్పులు బాగున్నాయి. సుజీత్ వాసుదేవ్, కెమెరా పనితనం రిచ్‌గా ఉంది. తొలి పాటని చాలా కలర్‌ఫుల్‌గా చూపించారు. సెట్లు కూడా రిచ్‌గానే కనిపించాయి.ఎడిటింగ్ పర్వాలేదు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రాన్ని ఖర్చుకు వెనుకడకుండా నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. మాస్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే..ఈ సినిమాను నమ్మి థియేట‌ర్ కు వచ్చిన ప్రతి ప్రేక్షకుడిని నిరుత్సాహ పరచకుండా అందరినీ “ది వారియర్” కచ్చితంగా ఎంట‌ర్ టైన్ చేస్తుంది అని చెప్పగలను.

Cinemarangam. com Review Rating..3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here