Hero Sravan Reddy Interview about Dirty Hari

శ్రవణ్‌రెడ్డి, సిమ్రత్‌కౌర్‌, రుహాణిశర్మ హీరోహీరోయిన్లుగా ప్ర‌ముఖ నిర్మాత ఎం.ఎస్‌.రాజు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘డర్టీహరి’. గూడూరు సతీష్‌బాబు, గూడూరు సాయిపునీత్‌, కేదార్‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మాతలు. ఈ నెల 18న ఫ్రైడే మూవీస్‌ ఏటీటీ యాప్‌ ద్వారా ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సంద‌ర్భంగా హీరో శ్ర‌వ‌ణ్ రెడ్డి ఇంట‌ర్వ్యూ..

హైద‌రాబాద్ నా జ‌న్మ‌స్ఠ‌లం. బేగంపేట‌లోని హెచ్‌పీఎస్‌లో చ‌దువుకున్నాను. ప‌దమూడేళ్ళ క్రితం ముంబాయి వెళ్లాను. అక్క‌డ దాదాపు అన్ని మెయిన్ స్టీమ్ ఛానెల్స్‌లో వ‌ర్క్‌చేశాను.వాటితో పాటు బాలీవుడ్‌లో రెండు మూడు చిత్రాల‌కి అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేశాను. 2019లో ఎమ్ఎక్స్ ప్లేయ‌ర్‌కి `థింకిస్థాన్` అనే వెబ్ సిరీస్ చేశాను. ఆ సిరీస్ రెండు సీజ‌న్స్‌కి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది.ఆ సిరీస్‌లో నా న‌ట‌న చూసి డ‌ర్టీహ‌రి క్యారెక్ట‌ర్‌కి బాగా సూట్ అవుతాన‌ని ఎంఎస్ రాజుగారు న‌న్ను సంప్ర‌దించ‌డం జరిగింది.

స్క్రిప్ట్ విన‌గానే సర్‌ప్రైజ్ అయ్యాను…

నేను రాజుగారి సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయ‌న నిర్మించిన ఒక్క‌డు, వ‌ర్షం సినిమా విజువ‌ల్స్ నాకు ఇంకా గుర్తున్నాయి. ఈ క‌థ న‌రేష‌న్ అప్పుడు అలాంటి క‌థే అయి ఉంటుంది అనుకున్నాను. కాని ఒక్క‌సారి ఆయన స్క్రిప్ట్ విన‌గానే సర్‌ప్రైజ్ అయ్యాను. ఇప్ప‌టి జ‌న‌రేష‌న్‌కు ప‌క్కాగా క‌నెక్ట్ అయ్యే విధంగా యూత్‌కి సంబందించిన అంశాల‌తో రాజుగారు డిఫ‌రెంట్‌గా ఈ క‌థ రాయ‌డం జ‌రిగింది. యాక్ట్ చేస్తున్న‌ప్పుడు నేను కూడా చాలా సంద‌ర్భాల్లోనా క్యారెక్ట‌ర్‌తో పాటు హీరోయిన్ క్యారెక్ట‌ర్ తో కూడా క‌నెక్ట్ అవ్వ‌డం జ‌రిగింది. ముఖ్యంగా హీరోయిన్ క్యారెక్ట‌ర్‌లో సెంటిమెంట్ చాలా అద్భుతంగా చూపించారు. ప్ర‌తి పాత్ర‌ క‌థ‌లో భాగంగానే ఉంటుంది త‌ప్ప ఏదో ఇరికించాల‌ని పెట్టినట్టు ఉండ‌దు.

అలానే చూపించాలి అనుకున్నారు…

ఈ సినిమాలో హీరోని రాముడిలానో, రావ‌ణాసురిడిగానో చూపించాలి అనుకోలేదు. ఎందుకంటే మ‌నం జ‌న‌ర‌ల్‌గా రాముడు కాదు అలాగే రావ‌ణాసురుడు కాదు మ‌ధ్య‌లో ఎక్క‌డో ఉంటాం దాన్నే సినిమా లాంగ్వేజ్‌లో చెప్పాలంటే గ్రే క్యారెక్ట‌ర్ అంటాం. అది అలానే చూపించాల‌ని రాజుగారు అనుకున్నారు. అందుకే న‌ల‌బైఏళ్లలోపు ప్ర‌తి ఒక్క‌రూ ఈ సినిమాతో క‌నెక్ట్ అవుతార‌నే న‌మ్మ‌కం ఉంది.

థియేట‌ర్ రిలీజ్‌ని మిస్ అవుతున్నాం..

ప్ర‌స్తుతం హిందీలో మేజ‌ర్ ఫ్లాట్ ఫార‌మ్‌ కోసం ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను. టైటిల్ `అబీన‌హీతో క‌బీ నై` అనుకుంటున్నాం. 60% షూటింగ్ పూర్త‌య్యింది. దాంతో పాటు త్వ‌ర‌లో ఒక సినిమా ప్రారంభం కానుంది. ఈ సినిమా థియేట‌ర్ రిలీజ్‌ని త‌ప్ప‌కుండా మిస్ అవుతున్నాం. అయితే ఏటిటిలో రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. నేను ఈ సినిమాలో రాజుగారి ప్యాష‌న్‌తో ఇన్స్‌పైర్ అయ్యాను. ఆయ‌న ఆ ఏజ్‌లో కూడా ఎంతో ఎన‌ర్జీతో సినిమాని తెర‌కెక్కించారు. హీరోగానే కాకుండా మంచి పాత్ర‌లు వ‌స్తే ఇత‌ర సినిమాల్లో కూడా న‌టిస్తాను

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here