Hero Teja Sajja Interview about ‘Zombie Reddy’

అనేక సినిమాలలో బాల‌న‌టుడిగా నటించి రీసెంట్ గా వచ్చిన ఓ బేబీ చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకొని అందరికీ సుప‌రిచితుడైన తేజ స‌జ్జ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం`జాంబి రెడ్డి`. ‌‘అ!, క‌ల్కి వంటి సినిమాల‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ వైవిధ్యమైన క‌థ‌లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఆనంది – దక్ష న‌గ‌ర్క‌ర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆపిల్ ట్రీ బ్యానర్ పై రాజశేఖర్ వర్మ ‘జాంబి రెడ్డి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 5 గ్రాండ్‌గా విడుద‌ల‌వుతున్న సంద‌ర్భంగా తేజ స‌జ్జ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు..

చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా న‌టించిన మీరు రొమాంటిక్ స్టోరీల వైపు వెళ్లకుండా జాంబీల నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమాతోనే హీరోగా ప‌రిచ‌య‌మ‌వ‌డానికి కారణమేంటి?

ప్ర‌శాంత్ వ‌ర్మ‌గారు అ!, క‌ల్కి సినిమాల ‌త‌ర్వాత ఇద్దరి పెద్ద హీరోలతో చేసే అవకాశం ఉన్నా. నాతో సినిమా చేస్తాన‌ని చెప్పారు. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ ఆల‌స్యం అవ‌డంతో ఏదైనా క్రేజి కాన్సెప్ట్‌తో ఫుల్ ఎంట‌ర్‌టైన్ మెంట్ సినిమా చేద్దాం అని ప్లాన్ చేసి ఈ ఐడియా నాకు చెప్పారు. ఈ ఐడియా నాకు కూడా బాగా న‌చ్చింది అందులోనూ హీరోగా మొద‌టి సినిమా ఒక పెద్ద ద‌ర్శ‌కుడితో చేసే అవ‌కాశం రావ‌డంకంటే సంతోషం ఏముంటుంది అది ఒక కార‌ణం. మ‌రో కార‌ణం ఏంటంటే అందరూ ఇది కొత్త త‌ర‌హా సినిమా అనుకుంటున్నారు.కానీ ఇది కమ‌ర్షియ‌ల్ కామెడికి సినిమా.ఒక ర‌కంగా చెప్పాలంటే హీరోగా లాంచ్ అవుదామ‌ని అనుకునేవారికి ఒక డ్రీమ్ డెబ్యూ సినిమా. యాక్ష‌న్‌, కామెడీ, డ్యాన్స్ ఇలా అన్ని అంశాలు ఉంటూనే కొత్త‌గా జాంబీలు కూడా ఉంటాయి. క‌మ‌ర్షియాలిటీ, కొత్త‌ద‌నం రెండూ ఉండడంతో ఈ సినిమా ఒప్పుకోవ‌డం జ‌రిగింది.

కల్కి తరువాత ప్రశాంత్ గారు మీ కోసం కమర్షియల్ జోనర్ లోకి వచ్చాడు అనుకోవచ్చా?

ఒకరకంగా చెప్పాలంటే కల్కి కూడా కమర్షియల్ సినిమానే కాకపోతే అందులో కామెడీ ఉండదు ఇందులో విపరీతమైన కామెడీ ఉంటుంది.పృద్వీగారు,జబర్దష్ శీను, ఇలా 20 మంది ఆర్టిస్టులు ఉంటారు.ప్రశాంత్ వర్మ చేసిన కమ ర్షియాలిటీ సినిమా ఇది.

కమర్షియల్ మూవీ అనుకొని కామెడీ మూవీ చేసారా?

– ముందు క‌మ‌ర్షియ‌ల్‌వేలో ఈ సినిమా చేద్దాం అనుకుని ఫిబ్ర‌వ‌రిలో షూటింగ్ స్టార్ట్ చేశాం. అయితే అప్ప‌టికి క‌రోనా ఇండియాకి రాలేదు. అది ఇండియాకి రావ‌డం, ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విధించ‌డంతో ఈ టైమ్‌లో ప్రేక్ష‌కులు కామెడీ చిత్రాన్ని ఇష్ట‌ప‌డ‌తార‌ని స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేసి క‌రోనా మీద సెటైర్లు, జోకులు రాసుకొని మ‌రికొంత కామెడీని జోడించాం.సినిమా మేము అనుకున్న‌దాని కంటే ఇంకా బాగా వ‌‌చ్చింది.

ప్ర‌శాంత్ వ‌ర్మ మీరు చాలా రోజుల నుండి ఫ్రెండ్స్ క‌దా ఆ ఫ్రెండ్‌షిప్ ఈ సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుందా?

–100 పెర్సెంట్ అవుతుంది. ఒక ఫ్రెండ్ డైరెక్ట‌ర్ అయితే ఎలా చూపిస్తారు అనేది ఒక పూరి గారు,రవి గారితో గాని,కార్తికేయ కు చందు మొండేటి,నిఖిల్ గారు. ఇలా నేను ఏం చేయ‌గలం,ఎంత వ‌ర‌కు చేయ‌గ‌లం అనే విష‌యాలు దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ రాసుకుంటారు. అలానే ప్ర‌శాంత్ వ‌ర్మ ఈ స్క్రిప్ట్‌ని కూడా రాయ‌డం జ‌రిగింది. మ‌రో విష‌యం ఏంటంటే నేను ఏది చేస్తే ప్రజెంట్ బుల్ గా ఉంటానో, ప్ర‌శాంత్ వ‌ర్మ‌కి ఏం కావాలి అనేది కూడా నాకు చాలా క్లారిటీగా తెలుసు కాబ‌ట్టి ఇద్ద‌రం మంచి అండ‌ర్‌స్టాండింగ్‌తో సినిమా చేశాం.

ఈ సినిమాలో యాక్ష‌న్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి?

– నాకు మొద‌టినుండి ఒక భ‌యం ఉండేది నేను యాక్ష‌న్ ఎపిసోడ్స్ చేస్తే ఆడియ‌న్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అని. అయితే ఆ విష‌యాన్ని ప్ర‌శాంత్ వ‌ర్మ చ‌క్క‌గా హ్యాండిల్ చేశారు. ఈ సినిమాలో యాక్ష‌న్ ఎపిసోడ్స్ అదిరిపోతాయి. ప్ర‌శాంత్ వ‌ర్మ క‌మ‌ర్షియాలిటీ ఎంటో తెలిపేచిత్ర‌మిది.

జాంబీల నేపథ్యంలో చాలా సినిమాలు వ‌చ్చాయి ఇందులో మీరు చేయించే కొత్త‌ద‌నం ఏంటి?

ఇప్ప‌టివ‌ర‌కు జాంబీల జోన‌ర్‌లో దాదాపు 200 చిత్రాలు వ‌చ్చాయి. అయితే ఈ సినిమాలో కొత్త‌ద‌నం ఏంటంటే ఈ జాంబీల‌ను తీసుకువ‌చ్చి మ‌న తెలిసిన ఫ్యాక్ష‌న్ బ్యాక్‌డ్రాప్‌లో క‌డ‌ప‌, క‌ర్నూల్ లోని రెండు ఫ్యాక్ష‌న్ వ‌ర్గాల మ‌ధ్య పెట్ట‌డం అనేది కొత్త పాయంట్‌. ఈ పాయింట్ గురించి స‌మంత‌, ర‌వితేజ గారితో చెప్పిన‌ప్పుడు వారికి కూడా బాగా న‌చ్చింది. అలాగే దాదాపు 20 మంది సీనియ‌ర్ ఆర్టిస్టులు, క‌మెడియ‌న్స్ ఈ సినిమాలో న‌టించారు అన్ని పాత్ర‌లు మిమ్మ‌ల్ని న‌వ్విస్తూనే ఉంటాయి.

ఈ సినిమా తర్వాత మీ నెక్స్ట్ ప్రాజెక్ట్?

– సూప‌ర్‌గుడ్ ఫిలింస్‌లో ఇష్క్ సినిమా మ‌ళ‌యాలం రీమేక్ చేస్తున్నాను. అది కాకుండా మ‌రో ఫాంట‌సి ల‌వ్ జోన‌ర్‌లో ఒక సినిమా చేస్తున్నాను. ఈ సినిమా స‌క్సెస్ అయితే సీక్వెల్ చేసే ఆలోచ‌న కూడా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here