Hero Vishwak Sen interview about ‘Ashoka Vanam lo Arjuna Kalyanam’

ఫ‌ల‌క్‌నుమా దాస్’ నుంచి పాగ‌ల్ వ‌రకు వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో మెప్పిస్తున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ క‌థా నాయ‌కుడిగా న‌టించిన తాజా చిత్రం ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’ ప్ర‌ముఖ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ స‌మర్ఫ‌ణ‌లో ఎస్‌వీసీసీ డిజిట‌ల్ పతాకంపై బాపినీడు, సుధీర్ ఈద‌ర‌లు సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న చిత్రానికి విద్యా సాగ‌ర్ చింతా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు జై క్రిష్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌తో పాటు పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప‌వి కె.ప‌వ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని మే6 విడుద‌ల చేస్తున్న‌ సందర్భంగా హీరో విశ్వక్ సేన్ పాత్రికేయ మిత్రులతో  ముచ్చటించారు…

‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’సినిమా ప్ర‌మోష‌న్స్‌ చాలా డిఫ‌రెంట్‌గా ఉండాలని ఫ్రాంక్ వీడియోలు చేశాము.అది వేరే విధంగా స్ప్రెడ్ అయ్యి ఇంత చర్చ అవుతుందని ఊహించలేదు.ఈ విషయంలో మా అమ్మ ఎంతో టెన్షన్ పడింది. అందుకే అమ్మకు ధైర్యం చెప్పాలని ప్రెస్ మీట్ లో  ఫ్యాన్స్ సపోర్ట్ ఉన్నంత వరకు నన్నెవరూ ఏమి చేయలేరని చెప్పడం జరిగింది.ఇప్పుడు సద్దుమణిగింది అనుకుంటున్నాను .అందుకే ఈ రోజు మీడియాతో మాట్లాడుతున్నాను.

దర్శకుడు విద్యా సాగర్ తో గతంలో ‘వెళ్లి పోమాకే’ సినిమాకు పని చేశాను.తను నాకు ఈ కథ చెప్పినప్పుడు చాలా డిఫ్రెంట్ గా అనిపించింది.కథ చెప్పినప్పుడే ఈ టైటిల్ కూడా చెప్పడం జరిగింది.”అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం  టైటిల్ ఎందుకు పెట్టాము అనేది తెలియాలంటే  సినిమా చూడవలసిందే..

ఇప్ప‌టి వ‌ర‌కు నేను చేసిన సినిమాల‌కు భిన్న‌మైన అల్లం అర్జున్ కుమార్ పాత్రలో క‌నిపించ‌ బోతున్నాను.  నా కెరియర్ లో బెస్ట్ సినిమా అవుతుంది. ఎందుకంటే ఇందులో పెరఫార్మెన్స్ కు ఎక్కువ స్కోప్ ఉన్న చిత్రమిది. కథలో భాగంగా దర్శకుడు నన్ను 10 కిలోలు బరువు పెరగమని చెప్పడంతో క్యారెక్టర్ కొరకు ఏడు కేజీల బరువు పెరగడం జరిగింది.

అల్లం కుమార్ అనే అబ్బాయికి 30 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాలేదని అందరూ అంటుండడంతో సడన్ గా తన కులం కానీ, రాష్ట్రం కానీ అమ్మాయి అర్జున్ జీవితంలో ఎంట్రీ అయిన తరువాత వీరిద్దరి జీవితాల్లో ఎం జరిగింది అనేదే ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’ కథ.ఈ చిత్రం యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుంది.

తెలంగాణ అబ్బాయి, ఆంధ్ర అమ్మాయి బ్యాక్ డ్రాప్ లో లవ్,  మ్యారేజ్ ను  ఏంటర్టైనింగ్ లో చూపిస్తూ కొన్ని  సెన్సిటివ్ పాయింట్స్ ను చాలా లేయర్స్ లో డిస్కస్ చేయడం జరిగింది. ఈ సినిమా లో లవ్ & మ్యారేజ్ అనేది కొత్తగా చూయించాము.

ఇందులో రెండు మూడు మాటల వల్ల U/A ఇచ్చారు. లేకపోతే క్లీన్ U సర్టిఫికేట్ సినిమా .నిన్నే పెళ్ళాడుతా, మురారి,మల్లీశ్వరి వంటి సినిమాలా ఈ  సినిమా కూడా అందరికీ నచ్చే సినిమా. పదేళ్ళలో ఇటువంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా రాలేదు. ఇప్పుడు వస్తున్న ఈ సినిమా పెళ్లి కానీ వారందరికీ ఈ సినిమా కనెక్ట్ అవుతుంది.

నటుడిగా నన్ను నేను ప్రూవ్ చేసుకివడానికి అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. ప్రస్తుతం ఓరి దేవుడా సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ధమ్కీ చిత్రం షూటింగ్ దశలో ఉంది.మరియు దర్శకుడు సాహిత్ మోత్కురి తో ఒక సినిమా చేస్తున్నాను.అలాగే ఫలక్ నుమా దాస్ కు సీక్వెల్ గా  “మాస్ కా దాస్” అనే టైటిల్ తో పాన్ ఇండియ సినిమా చేయాలని ఉంది.ఈ ప్రాజెక్ట్ నెక్స్ట్ నా బర్త్ డే టైం కు రెడీ అవ్వచ్చు.

“అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’’ సినిమా చాలా హిలేరియ‌స్‌ గా క్లీన్ ఫ్యామిలీ ఏంటర్ టైనర్ గా మే 6 న  ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ ‘సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది అని ముగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here