Hero Viswak Sen’s ‘Ashoka Vanam Lo Arjuna Kalyanam’ Pre Release Event

ప్ర‌ముఖ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ స‌మర్ఫ‌ణ‌లో ఎస్‌వీసీసీ డిజిట‌ల్ పతాకంపై విష్వ‌క్ సేన్‌, రుక్స‌ర్ థిల్లాన్ జంటగా విద్యా సాగ‌ర్ చింతా దర్శకత్వంలో బాపినీడు, సుధీర్ ఈద‌ర‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనర్ చిత్రం “అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’’.ఈ సినిమాకు జై క్రిష్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌తో పాటు పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.ప‌వి కె.ప‌వ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని మే6 విడుద‌ల చేస్తున్న‌ సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం

హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ఇంతకుముందు చేసిన సినిమాల కంటే ఇది చాలా డీఫ్రెంట్ సినిమా. నా కెరియర్ లో బెస్ట్ సినిమా అవుతుంది. ఎందుకంటే ఇందులో పెరఫార్మెన్స్ కు ఎక్కువ స్కోప్ ఉన్న చిత్రమిది.ఈ సినిమా లో క్యారెక్టర్ కొరకు ఏడు కేజీలు పెరగడం జరిగింది.ఈ సినిమా ద్వారా హ్యూమన్ రిలేషన్స్ ఏంత ముఖ్యమో  తెలుసుకున్నాను.ఈ సినిమా ప్రమోషన్స్ కోసం చాలా ఊర్లు, కాలేజ్ లకు తిరిగాను.సినిమా ప్రమోషన్ లో భాగంగానే  ఫ్రాంక్ వీడియోలు చేశాము.దానికి కొనసాగింపుగా మీడియాలో జరిగిన పరిణామాలు దురదృష్టకరం.మీడియా లేనిదే మేము లేము.ఫలకనుమా దాస్ కు మీడియా ఇచ్చిన ప్రోత్సాహం ఎన్నటికీ మరవను.మనకు దెబ్బ తగిలినప్పుడు అసంకల్పితంగా అమ్మా.. అంటాం. ఈ రోజు నేను టివి కార్యక్రమంలో నేను చేసిన పద ప్రయోగం కూడా అలా అనుకోకుండా.. జరిగిందే.. కావాలని అనలేదు. అలాంటి పద ప్రయోగం చేసి ఉండాల్సింది కాదు అందుకు క్షమాపణ చెపుతున్నా..ఇదొక్కటి తప్ప నేనేమి తప్పు చేయలేదు.వివాదం సృష్టించి జనం దృస్టిని ఆకర్షించాలని ఎప్పుడూ అనుకోలేదు.ఈ సినిమాకు ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ అందరూ బాగా సెట్ అయ్యారు. అందుకే సినిమా చాలా బాగా వచ్చింది.మే 6 న వస్తున్న ఈ చిత్రం అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. ప్రేక్షకులందరూ థియేటర్స్ కు వచ్చి మా సినిమాను ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

చిత్ర దర్శకుడు విద్యా సాగర్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు రవిగారే బ్యాక్ బోన్. పవి అద్భుతమైన డైలాగ్స్ ఇవ్వగా, జై ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు.ఇలా ఈ సినిమాకు ప్రతి ఒక్కరూ ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేశారు. విశ్వక్ తో గతంలో ‘వెళ్లి పోమాకే’ సినిమాకు పని చేశాను.ఐతే విశ్వక్ ఎలాంటి పాత్రనైనా ఈజీగా చేయగలడు.ఈ సినిమాలో విశ్వక్ కనిపించడు. అల్లం అర్జున్ కుమార్ మాత్రమే ప్రేక్షకులకు కనిపిస్తాడు. ఇప్పుడున్న జనరేషన్ లో ఈ సినిమా ను ఒక్క విశ్వక్ మాత్రమే చేయగలడు అనేలా అద్భుతంగా నటించాడు.మే 6 న వస్తున్న మా సినిమా ప్రేక్షకులకు మంచి బంతి భోజనం అవుతుందని ఆశిస్తున్నాను అన్నారు.

హీరోయిన్ రుక్స‌ర్ థిల్లాన్ మాట్లాడుతూ.. ఇందులో మాధవి క్యారెక్టర్ గా నటిస్తున్నాను.దర్శక,నిర్మాత లు నా పాత్రను చాలా చక్కగా డిజైన్ చేశారు.ఈ సినిమా చూసిన గర్ల్స్ అందరూ కచ్చితంగా ఎమోషన్ అవుతారు. విశ్వక్ మంచి కో స్టార్ తనతో పని చేయడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.

ఎడిటర్ విప్లవ్ మాట్లాడుతూ..అందరూ ఎంతో కష్టపడి వర్క్ చేయడం వలన సినిమా చాలా బాగా వచ్చింది. ఇలాంటి మంచి సినిమాలో నేను పార్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది.మే 6 న వస్తున్న మూవీ ని ప్రేక్షకులందరికి కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అన్నారు.

సంగీత దర్శకుడు జై మాట్లాడుతూ.. మా సాంగ్స్ ను ప్రేక్షకులందరూ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా వచ్చింది. ‘రాజావారు రాణిగారు’ సినిమా తర్వాత అదే టీమ్‌తో మ‌ళ్లీ సినిమా చేయ‌డం చాలా హ్యాపీగా అనిపించింది. అన్నారు.

డిఓపి ప‌వి కె.ప‌వ‌న్‌  మాట్లాడుతూ.. ఈ సినిమాకు వండర్ ఫుల్ టీం సెట్ అయ్యారు.ఇలాంటి మంచి సినిమాకు డిఓపి చేసే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. మే 6 న అందరూ ఫ్యామిలీ తో వచ్చి చూడాలని కోరుతున్నాను అన్నారు.

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌  ప్ర‌వ‌ల్య దుడ్డిపూడి మాట్లాడుతూ..ఈ సినిమా కోసం మేము చాలా క్యూరియసిటీ గా వెయిట్ చేస్తున్నాను అన్నారు.

న‌టీన‌టులు:
విష్వ‌క్ సేన్‌, రుక్స‌ర్ థిల్లాన్ త‌దిత‌రులు
సాంకేతిక నిపుణులు:
ద‌ర్శ‌క‌త్వం:  విద్యాసాగ‌ర్ చింతా
స‌మ‌ర్ప‌ణ‌:  బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌
కథ, మాటలు, స్క్రీన్ ప్లే : ర‌వి కిర‌ణ్ కోలా
బ్యాన‌ర్‌: ఎస్‌.వి.సి.సి.డిజిట‌ల్‌
నిర్మాత‌లు:  బాపినీడు, సుధీర్ ఈద‌ర‌
సినిమాటోగ్ర‌ఫీ:  ప‌వి కె.ప‌వ‌న్‌
సంగీతం:  జై క్రిష్‌
ర‌చ‌న‌:  ర‌వికిర‌ణ్ కోలా
ఎడిట‌ర్‌:  విప్ల‌వ్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌:  ప్ర‌వ‌ల్య దుడ్డిపూడి
పి.ఆర్‌.ఓ :  వంశీ కాకా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here