Heroin & Karnataka Ex Cm Wife Radhika Kumara Swamy Distributing Free Daily Food Needs

క‌రోనా వైర‌స్‌(కోవిడ్ 19) నిర్మూల‌న‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు యుద్ధ ప్ర‌తిపాదిక‌న చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి.కరోనా మహమ్మారిని తరిమికొట్టే నేపథ్యంలో దేశవ్యాప్త లాక్‌డౌన్ అనివార్యం అయింది. దీంతో పేద ప్రజల కష్టాలు ఎక్కువ అయ్యాయి. వలస కార్మికులు, రోజూవారి కూలీల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. పనులు లేక వారు ఇళ్లకే పరిమితం అవడంతో పొట్ట గడవని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో వారిని ఆదుకోవడానికి కొందరు పెద్దమనసుతో ముందుకు వస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా అన్ని పనులు రద్దు కాగా చేతిలో పనులు లేక పేద  అన్ని రకాల కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు.

అలాంటివారిని ఆదుకోవడానికి మేము సైతం అన్నారు హీరోయిన్ & కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య రాధికా కుమారస్వామి.బెంగళూరు సిటీలో పేదలకు నిత్యావసర సరుకులు అందచేశారు.ఈ సందర్భంగా రాధికా కుమారస్వామి మాట్లాడుతూ.పేదవారిని ఆదుకోవడానికి ఇప్పటికే చాలా మంది చాలా రకాలుగా విరాళాలు అందించారు. అయితే ఆ సహాయం మాకు చేసే ఆవకాశం  లభించింది.. ‘ఇలాంటి సంక్షోభ సమయంలో ఒకరికొకరు అండగా నిలవడం ఎంతో అవసరం. భౌతిక దూరాన్ని పాటిస్తూ సామాజిక స్పృహతో సహాయం చేయడం మన కర్తవ్యంగా భావించాలి’ అని, ఈ లాక్ డౌన్ మనకి అత్యంత అవసరం అని, వైద్యులు, పోలీసుల సూచ‌న‌ల‌ను పాటిస్తూ, అంద‌రూ త‌మ ఇళ్ల‌కే ప‌రిమిత‌మై ఆరోగ్యాన్నికాపాడుకోవాల‌నీ  అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here