Heroin Vedika interview about Ruler

2006 లో ‘మద్రాసి’ చిత్రంతో నటిగా మంచి పేరు తెచ్చుకొని 2007 ‘ముని’ చిత్రంతో తమిళ్ తో పాటు తెలుగులోనూ అభిమానులని ఏర్పరచుకుని తెలుగు తమిళ మలయాళం తో పాటు హిందీ భాషలలో సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నారు హీరోయిన్ వేదిక. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ సరసన ‘రూలర్’చిత్రంలో నటిస్తోంది. సి. కల్యాణ్ నిర్మాణంలో కె.ఎస్‌.రవికుమార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 20 న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదలవబోతున్న సందర్భంగా హీరోయిన్ వేదిక ఇంటర్వ్యూ..

చాలా రోజుల తరువాత తెలుగులో నటించడానికి కారణమేంటి?
– అవునండీ! డైరెక్ట్ తెలుగు సినిమాలో నటించి దాదాపు ఎనిమిది సంవత్సరాలు పైనే అయింది. ఇన్నేళ్లు తమిళ్, మలయాళ, కన్నడ సినిమాలతో బిజీ గా ఉన్నాను. అయితే ఈ మధ్య నేను నటించిన ‘కాంచన 3’ తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది. ఆ సినిమాలో నా పెర్ఫామెన్స్ కి మంచి పేరు వచ్చింది. ఆ సినిమా వల్లే.. ఈ వచ్చింది అనుకుంటున్నాను. చాలా కాలం తర్వాత ఇప్పుడు ‘రూలర్’ తో మీ ముందుకు వస్తున్నందుకు హ్యాపీగా ఉంది.

ఈ సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి?
– నా క్యారెక్టర్ లో రెండు వేరియేషన్స్ ఉంటాయి. ట్రేడిషనల్ గా కనిపిస్తాను, అలాగే గ్లామర్ గర్ల్ నటించాను. అదేవిధంగా నా క్యారెక్టర్ లో సీరియస్ యాంగిల్ కూడా ఉంటుంది. నటనకు చాల స్కోప్ ఉన్న క్యారెక్టర్ నాది. నా క్యారెక్టర్ లో మాస్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. అలాగే సప్తిగిరి తో కామెడీ ఎలిమెంట్స్ బాగుంటాయి. మాస్ మసాలా సినిమాలంటే నాకు ఇష్టం. నటులు ఎప్పటికప్పుడు వైవిధ్యమైన పాత్రలు చేయడం అవసరం. ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు చేస్తే బోర్ కొడుతుంది.

లెజెండరీ యాక్టర్ బాలకృష్ణతో కలిసి నటించారు కదా ! ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది?
– తెలుగు ఇండస్ట్రీలోనే బాలకృష్ణ గారు లెంజెండ్ అండ్ గ్రేట్ యాక్టర్, నటనలో ఆయన ఒక యూనివర్సిటీ. రియల్ లైఫ్ లో కూడా ‘రూలర్’ లాంటి వ్యక్తితో కలిసి నటించడం చాల హ్యాపీగా అనిపించింది. ఆయన నుంచి చాల నేర్చుకున్నాను. నటన పట్ల ఆయనకున్న అంకితభావం అమేజింగ్. కొన్ని సీన్స్ చేయలేనప్పుడు కో స్టార్స్ కి కూడా చాలా హెల్ప్ చేస్తారు. అంత పెద్ద స్టార్ ఆయి ఉండి కూడా చాలా సింపుల్ గా ఉంటారు. . ప్రతి సినిమా ని తొలి సినిమాలు భావిస్తుంటారు. ఆయనకి ఎవరైనా నచ్చారంటే చాలు… వాళ్ల గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరణ జరుగుతున్నప్పుడు నా స్టాప్ లో ఒకరికి కాలికి గాయమైంది. వెంటనే అక్కడి కి సమీపంలో ఉన్నతన స్నేహితులకి ఫోన్ చేసి డాక్టర్ అపాయింట్మెంట్ ఇప్పించి
స్వయంగా పర్యవేక్షించారు. సెట్లో అందరినీ ఒకలాగే చూసే పెద్ద మనసు ఆయనది.

ఈ సినిమాలో మీకు ఎన్ని సాంగ్స్ ఉన్నాయి?

— రెండు సాంగ్స్ ఉంటాయి. ఒకటి సంక్రాంతి సాంగ్ మేమందరం సంక్రాంతి పండుగ సెలెబ్రేట్ చేసుకునే సందర్భంలో వస్తుంది. ఇంకోటి ‘యాలయాలా’ రొమాంటిక్ మెలోడీ సాంగ్. అలాగే నా ఫేవరెట్ సాంగ్ కూడా. చిరంతన్ బట్ ఫ్యాబ్యులెస్ మ్యూజిక్ ఇచ్చారు. అలాగే ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ కొత్తగా ఉంది. రెండు సాంగ్స్ కూడా చాల బాగా వచ్చాయి.
కె.ఎస్.రవికుమార్ గురుంచి?
– కె.ఎస్.రవికుమార్ లాంటి సీనియ‌ర్‌ దర్శకుడితో సినిమా అంటే ఏ నటుడికైనా ఒక వరం. త‌న‌కి ఏం కావాలి అనే విష‌యంలో చాలా క్లారిటీగా ఉంటారు. ఎక్క‌డా మేకింగ్ ప‌రంగా నాణ్యత తగ్గకుండా వేగంగా ఈ సినిమాని తీశారు. ఆయ‌న వ‌ల్లే ఈ సినిమా షూటింగ్ ఇంత తొంద‌ర‌గా పూర్త‌య్యింది.
ప్రొడ్యూసర్ సి.క‌ల్యాణ్ గారి గురించి?
– ప్రకాష్ రాజ్, జయసుధ, భూమిక, నాగినీడు, ఝాన్సీ తదితర అనుభవమున్న నటులున్నారు. ఇంత మంది నటులున్నా ఎలాంటి సమస్యలు, అసౌకర్యం ఎదురుకాకుండా సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించిన విధానం నాకు బాగా నచ్చింది. ఆయ‌న చాలా ఫ్యాష‌నేట్ ప్రొడ్యూస‌ర్.
మీ తదుపరి చిత్రాలు?
– తెలుగులో కూడా కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి. ఇకపై తెలుగులో కంటిన్యూగా నటిస్తాను. మంచి కథలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం తమిళ్ మళయాలంలో కూడా మూవీస్ చేస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here