HH Sri Sri Sri Devanatha Ramanuja Jeeyar Swamiji opened the first branch of ‘KATAN HOUSE’ in Hyderabad

దేశంలోనే నాణ్యమైన వస్త్రాలను పంపిణీ చేయాలనే లక్ష్యంతో వినియోగదారుల ప్రశంశలు అందుకోవాలన్న ధృడ సంకల్పంతో ‘కాటన్ హౌస్’ మొదలైంది. భారతదేశం యొక్క సుసంపన్నమైన వస్త్ర వారసత్వాన్ని కాపాడాలనే అభిరుచితో స్థాపించబడిన కాటన్ హౌస్ సంస్థ తొలిసారిగా హైదరాబాద్ లో వస్త్రాలను పంపిణీ చేయడానికి సిద్ధమైంది. బెనారసి, కంజీవరం, కోట మరియు చందేరి చీరల యొక్క ఎంపికలను ఈ బ్రాంచ్ ద్వారా వినియోగించనున్నారు.హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లో ఉన్న ఈ తొలి బ్రాంచ్ ను హెచ్ హెచ్ శ్రీ శ్రీ శ్రీ దేవనాథ రామానుజ జీయర్ స్వామి జీ స్వయంగా ఆవిష్కరించారు. కాగా ఈ కార్యక్రమానికి నిజాం రాజవంశీయుడైన నవాబ్ రౌనాక్ యార్ ఖాన్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ‘కాటన్ హౌస్’ ఫౌండర్ అరుణ గౌడ్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇక ఈ ప్రారంభోత్సవ వేడుకలో హెచ్ హెచ్ శ్రీ శ్రీ శ్రీ దేవనాథ రామానుజ జీయర్ స్వామి జీ మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మక కాటన్ హౌస్ తొలి బ్రాంచ్ ను నా చేతుల మీదుగా ప్రారంభించినందుకు సంతోషంగా ఉంది. ఇక్కడి ప్రజలకు శ్రేష్టమైన, నాణ్యమైన వస్త్రాలు కాటన్ హౌస్ ద్వారా అందుతాయని విశ్వసిస్తున్నాను. ఈ కార్యక్రమానికి నన్ను అతిధిగా పిలిచినందుకు కాటన్ హౌస్ ఫౌండర్ అరుణ గౌడ్ గారికి ధన్యవాదాలు అన్నారు.

కాటన్ హౌస్ ఫౌండర్ అరుణ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజలందరికి తక్కువధరలో నాణ్యమైన వస్త్రాలు అందించాలనే లక్ష్యంతో ‘కాటన్ హౌస్’ మొదలైంది. ఆ లక్ష్యంతో ముందుకు సాగుతూ అందరి ప్రసంశలు అందుకోవాలనేదే మా కోరిక. హైదరాబాద్ లో తొలి బ్రాంచ్ ప్రారంభోత్సవం కోసం విచ్చేసిన హెచ్ హెచ్ శ్రీ శ్రీ శ్రీ దేవనాథ రామానుజ జీయర్ స్వామి జీ గారికి ధన్యవాదాలు. ఈ కార్యాక్రమాన్ని వచ్చి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here