Horror Suspense Thriller ‘Kalasa’ Movie Review

Cinemarangam.Com
సినిమా : “కలశ “
విడుదల తేదీ : 15.12.2023
రివ్యూ రేటింగ్ : 3.25 /5
బ్యానర్: చంద్రజ ఆర్ట్‌ క్రియేషన్స్‌
ప్రొడ్యూసర్: రాజేశ్వరి చంద్రజ వాడపల్లి
దర్శకత్వం:కొండా రాంబాబు
నటీనటులు: భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్‌, రోషిణి కామిశెట్టి, జీవా, సమీర్‌, రవివర్మ తదితరులు
సినిమాటోగ్రఫీ:వెంకట్‌ గంగధారి
సంగీతం: విజయ్‌ కురాకుల
ఎడిటర్‌: జునైద్‌ సిద్దిఖీ
పి. ఆర్. ఓ : సతీష్. కె

చంద్రజ ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై బిగ్‌బాస్‌ ఫేమ్‌ భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కలశ’. కొండ రాంబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని డాక్టర్‌ శ్రీమతి రాజేశ్వరి చంద్రజ వాడవల్లి నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 15న గ్రాండ్‌గా .ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన హర్రర్‌, ఎమోషనల్‌ మూవీ “కలశ ’ ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి.

కథ :
కలశం అనేది స్వచ్ఛతకు, పవిత్రతకు మారుపేరు. అలా స్వచ్ఛమైన, పవిత్రమైన క్యారెక్టర్‌ చుట్టూ అల్లుకున్న కథే ‘కలశ’ చిత్రం. అటువంటి పవిత్రమైన కలశాని(బ్రెయిన్‌)కి దుమ్ముపడితే మళ్లీ స్వచ్ఛమైన స్థితికి రావాలంటే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలి అన్నది ‘కలశ’ కథ. ఈ పాయింట్‌కు ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌కు అనుగుణంగా మలుచుకుని ఓ అమ్మాయి జీవితంలోకి ఒక మారు తల్లి, తండ్రి వస్తే ఎలాంటి పరిస్థితులు వస్తాయి. అప్పటి వరకూ నాన్నను చూసుకున్న ‘కలశ’ అనే అమ్మాయి సడన్‌గా తండ్రి స్థానంలోకి మారు తండ్రి వస్తే ఆ అమ్మాయి మెంటల్‌గా ఎలా డిస్ట్రబ్‌ అయ్యింది.. పెరిగి పెద్దయిన తర్వాత అలాంటి పరిస్థితే మళ్లీ ఎదురైతే ఆమె దాన్ని ఎలా రిసీవ్‌ చేసుకుంది? అనే దాన్ని హర్రర్‌ టచ్‌తో గ్రిప్పింగ్‌ అండ్‌ థ్రిల్లింగ్‌ స్క్రీన్‌ప్లేతో క్లైమాక్స్‌ వరకూ సస్పెన్స్‌ను మెయిటైన్‌ చేస్తూ నడిపించారు దర్శకుడు. సహజంగా సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాల్లో సస్పెన్స్‌ వీడిపోయిన తర్వాత.. క్యారెక్టర్స్‌ రివీల్‌ అయిపోవడంతోనే సినిమా అయిపోతుంది. కానీ ‘కలశ’లో మాత్రం సస్పెన్స్‌, క్యారెక్టర్స్‌, అసలు విలన్‌ ఎవరు అనేది రివీల్‌ అయిన తర్వాత కూడా దాదాపు 40 నిముషాలు కథ సాగడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక్కడే దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు అని చెప్పాలి.

నటీ నటుల పనితీరు :
బిగ్‌బాస్‌ ఫేం నటి భానుశ్రీ ఇప్పటి వరకూ చేసిన రోల్స్‌కు భిన్నంగా స్టైలిష్‌ లుక్‌తో పాటు, చేతిలో సిగరెట్‌తో సెటిల్డ్‌ ఫెర్ఫార్మెన్స్‌ ఇచ్చింది. మరో నటి సోనాక్షి వర్మ ఓవైపు అందాలు ఆరబోస్తూనే మరోవైపు నెక్ట్స్‌లెవల్‌ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చింది. దయ్యంగా ఆమె నటించిన సన్నివేశాలు భయాన్ని కలిగిస్తాయి. అలాగే పోలీస్‌ అధికారిగా రవివర్మ బాగా సూట్‌ అయ్యాడు. అనురాగ్‌ కొత్త ఆర్టిస్ట్‌ అయినప్పటికీ ప్రతి సీన్‌లోనూ తనదైన ఈజ్‌ను చూపించాడు. సస్పెన్స్‌ థ్రిల్లర్స్‌లో నటీనటుల మొహంలో హావ, భావాలు చాలా ముఖ్యం. ఈ విషయంలో ఆర్టిస్ట్‌లు అందరూ తమ బెస్ట్‌ లెవల్‌ చేశారు. సీనియర్‌ ఆర్టిస్ట్‌ జీవా పాత్ర కథకు ప్రధానమైన టర్నింగ్‌ను ఇస్తుంది. ఈ తరహా పాత్రలు ఆయనకు కొట్టిన పిండి అని మరోసారి రుజువు చేసుకున్నారు.

సాంకేతిక నిపుణుల పనితీరు :
ప్రస్తుతం ఉన్న ఓటీటీ, శాటిలైట్‌ పోటీ ప్రపంచంలో ఓ కొత్త దర్శకుడు నిలదొక్కుకోవాలంటే అతని తొలి సినిమాలో ఖచ్చితంగా అద్భుతమైన కంటెంట్‌ ఉండాలి. ఈ విషయంలో రచయిత, దర్శకుడు అయిన రాంబాబు సొసైటీలో జరుగుతున్న కొన్ని వాస్తవ సంఘటనలను తీసుకుని, వాటికి సినిమాటిక్‌ హంగులు అద్ది తన టాలెంట్‌ నిరూపించుకున్నాడు.

ఇక హర్రర్‌, సస్పెన్స్‌ సినిమాలకు బ్యాక్‌బోన్‌గా నిలిచేవి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, కెమెరా, ఎడిటింగ్‌ ఈ విషయంలో సంగీత దర్శకుడు విజయ్‌ కురాకుల, డీఓపీ వెంకట్‌ గంగధారి, ఎడిటర్‌ జున్కెద్‌ సిద్ధిఖీలు తమ టాలెంట్‌ చూపించి చిత్రాన్ని నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకెళ్లారు.
నిర్మాత డా. రాజేశ్వరి చంద్రజ ఈ సినిమాకు అవసరమైన అన్ని హంగులు సమకూర్చడంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదని సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌ చెప్పకనే చెపుతుంది. ఆమె ఇందులో ముఖ్యమైన పాత్రను కూడా పోషించడం విశేషం. హర్రర్‌Êసస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘కలశ సినిమా చూసిన వారందరికీ ఈ సినిమా బాగా కనెక్ట్ అవ్వడమే కాకుండా సినిమాకు వచ్చిన ప్రతి ఒక్కరూ మంచి అనుభూతితో థియేటర్ నుండి బయటకి వస్తారని కచ్చితంగా చెప్పచ్చు.

Cinemarangam.Com Review Rating .. 3.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here