Horror Thriller Political Drama Entertainer “S5 NO EXIT” Movie Review

Cinemarangam. Com
సినిమా : S 5 NO EXIT ”
విడుదల : 30.12.22
రివ్యూ రేటింగ్ : 3/5
బ్యానర్ : శౌరీ ఎంటర్ టైన్ మెంట్స్
నిర్మాత : ఆదూరి ప్రతాప్ రెడ్డి
డైరెక్టర్ : భరత్ కోమలపాటి (సన్నీ కోమలపాటి)
నటీ నటులు : తారకరత్న, సాయి కుమార్ ప్రిన్స్, సునీల్, అలీ, గబ్బర్ సింగ్ బ్యాచ్ తదితరులు
మ్యూజిక్ : మణి శర్మ
డి. ఓ. పి : గరుడవేగ అంజి
ఎడిటర్ : గ్యారీ బి. హెచ్
పి. ఆర్. ఓ : జి. యస్. కె. మీడియా


తారకరత్న, ప్రిన్స్, సునీల్, అలీ, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ఎస్ 5 నో ఎగ్జిట్. భరత్ కోమలపాటి (సన్నీ కోమలపాటి) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శౌరీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఆదూరి ప్రతాప్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హర్రర్ థ్రిల్లర్ సినిమా గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 30 న గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకను ఏ మాత్రం ఎంటర్ టైన్ చేసిందో రివ్యూ లో చూద్దాం పదండి


కథ:
తండ్రి ప్రజాసేవ పార్టీ ముఖ్యమంత్రి (సాయి కుమార్) చెప్పిన మాట ప్రకారం నడుచుకునే సుబ్బు (తారకరత్న) నాన్న చెప్పిందే చేస్తా నాకేం తెలియదు అన్నట్లు ఉంటాడు. తన కొడుకు సుబ్బు పుట్టిన రోజు వేడుకలను హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లే ట్రైన్ లోని ఎస్5 బోగీలో జరుపు కోవాలని తండ్రి సాయి కుమార్ ప్లాన్ చేస్తారు. దాంతో సుబ్బు తన మిత్రులతో కలిసి తన పుట్టినరోజు వేడుకలను ఎస్5 బోగీలో జరుపుకుంటూ.. వైజాగ్ వెళుతుంటే మధ్యలో సన్నీ(ప్రిన్స్) తన డ్యాన్స్ బృందంతో కలిసి అదే బోగీలో ఎక్కుతాడు. ఆ బోగీ లో ఉన్న సుబ్బు బ్యాచ్ కు సన్నీ బ్యాచ్ లు గొడవ పడతారు. ఇంతలో ఉన్నట్టుండి ఆ బోగీ లోని ఉన్న ఒక్కొక్కరూ మాయం అవుతుంటారు. దీంతో ఆ బో గీ లో దెయ్యం ఉందని బయపడి నెక్స్ట్ స్టేషన్ లో దిగడానికి ప్రయత్నం చేయగా …తెరిచుకున్నట్టే తెరుచుకొని సడెన్ గా కోచ్ డోర్స్ క్లోజ్ అవుతాయి. నో ఎగ్జిట్ అన్నమాట. ఆ కోచ్ తలుపులు తెరుచుకోకుండా సుబ్బు అండ్ సన్నీ బ్యాచ్ ని ఆ బోగీ లో ఉండే దెయ్యం హింసిస్తూ ఉంటుంది. అందులో ఉన్న వారంతా ఒక్కొక్కరుగా మాయమవుతూ ఉంటే… చివరకు ఆ బోగీలో వీరు మాత్రమే మిగులుతారు. అయితే అన్ని బో గీలు ఉన్న ఈ ట్రైన్ లో వీరున్న బోగీ కి మాత్రమే మంటలు అంటుకుంటాయి. దీంతో సుబ్బు అతని స్నేహితుడు సంజయ్ తో కలిసి కదులుతున్న ట్రై నుంచి దూకేసి ప్రాణాలు కాపాడుకుంటారు.అసలు వీందరినీ ఎస్5 కోచ్ లో దెయ్యం ఎందుకు ఇబ్బంది పెట్టింది? అసలు అన్ని బో గీలు ఉండగా వీరున్న బోగీ కి మాత్రమే ఎందుకు అగ్నిప్రమాదం జరిగింది?,ఎలా జరిగింది, ఆ తర్వాత ఏమైందనే ఇంట్రెస్టింగ్ కథ, కథనంతో ఊహకందని ట్వస్ట్ & టర్న్స్ తో తెరకెక్కిన ఈ సినిమా చూడాలి అంటే కచ్చితంగా “ఎస్ 5 నో ఎగ్జిట్” సినిమా చూడాల్సిందే..

నటీ నటుల పనితీరు

తండ్రి చెప్పిన మాట వేద వాక్కు గా భావించే సుబ్బు పాత్రలో తారకరత్న చాలా బాగా నటించారు.తను ఇటీవల కాస్త డిఫరెంట్ గా ఉండే పాత్రలను ఎసెలెక్ట్ చేసుకుని సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమాలో కూడా తారకరత్న హెయిర్ స్టైల్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. టీసీ పాత్రలో అలీ చేసే బిగ్ బాస్ కాన్సెప్ట్ డైలాగుల కామెడీ అందరినీ ఆకట్టుకుంటుంది .తను చేసే వీడియోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసే సునీల్ దుబాయ్ నుంచి వచ్చే సులేమాన్ పాత్రలో కనిపించి బాగా నవ్విస్తాడు. ఇస్మార్ట్ శంకర్ లోని ఇస్మార్ట్ శంకర్ పాటకు డ్యాన్స్ చేస్తూ…ఆడియన్స్ అందరినీ నవ్వించాడు. . దొంగతనాలు చేసే బ్యాచ్ కి లీడర్ పాత్రలో ప్రిన్స్ బాగా నటించాడు . గబ్బర్ సింగ్ బ్యాచ్, ఫిష్ వెంకట్, రఘు తదితరులు అంతా తమ కామెడీ ట్రాక్ లతో అలరించడమే కాకుండా వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు.


సాంకేతిక నిపుణుల పనితీరు
దర్శకుడు తన తొలి సినిమాకి ఓ వైవిధ్యమైన హారర్ థ్రిల్లర్ కథను ఎంచుకుని ఓ వైపు భయపెడుతూనే… మరో వైపు వినోదాత్మకంగా మలుస్తూ ఇందులో పొలిటికల్ డ్రామను జోడించి చాలా ఆసక్తికరంగా చాలా చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు భరత్ కోమలపాటి… మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది. సినిమాటోగ్రఫర్ గరుడవేగ అంజి కెమెరా పనితనం ఈ సినిమా కు పెద్ద బలం. గ్యారీ బి. హెచ్ ఎడిటింగ్ కూడా చాలా గ్రిప్పింగ్ గా వుంది. శౌరీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సాయికుమార్, అలీ, సునీల్ వంటి మంచి ప్యాడింగ్ తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కంటెంట్ ను నమ్ముకుని నిర్మాత ఆదూరి ప్రతాప్ రెడ్డి తీసిన నిర్మాణ విలువలు.చాలా బాగున్నాయి. హారర్ థ్రిల్లర్ కి పొలిటికల్ డ్రామా కథలు చూసే ప్రేక్షకులకు “ఎస్ 5 నో ఎగ్జిట్” సినిమా కచ్చితంగా నచ్చుతుంది.

Cinemarangam. Com Review Rating 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here