“Hot Spot” Movie grand releasing on July 17th

వినుత్నంగా ఉండే కథలను ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. కథలో కొత్తదనం, విభిన్నమైన మలుపులు ఉంటే ఆ సినిమాలను తెలుగు ప్రేక్షకులు విజయ తీరాలవైపు నడిపిస్తారు. ఇక తాజాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న “హాట్ స్పాట్” చిత్రంలో అలాంటి కథాంశాలే ఉన్నాయి. నేటి తరాన్ని ఆలోచింపజేసేలా అద్భుతమైన కథతో పాటు ఒక కొత్త పాయింట్‌తో హాట్ స్పాట్ సినిమా తెరకెక్కింది. అంథాలజీ నేపథ్యంలో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. అవన్ని బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. తాజాగా అదే అంథాలజీ నేపథ్యంలో ఈ కథ సాగుతుందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. ఇంతవరకు ఏ ఎవరు టచ్ చేయని కోణాన్ని ఈ చిత్రంలో చూపించారు దర్శకుడు విఘ్నేష్ కార్తీక్. ఇది కచ్చితంగా అందరి మనుసులు దోచుకుంటుందని ప్రచార చిత్రాలు చూస్తే అర్థం అవుతుంది.

గౌరి కిషన్, అదిత్య భాస్కర్, కలై అరసన్, అమ్ము అభిరమి, స్యాండీ, సోఫియా, జనని, సుభాష్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. విఘ్నేష్ కార్తీక్ ఈ చిత్రానికి రచియితగా, దర్శకుడిగా పనిచేశారు. మోజ్విత్, మొవిహాన్ సమర్పణలో యాంట్స్ టూ ఎలిఫేంట్స్ సినిమాస్ & కో ప్రొడక్షన్‌లో అనీల్ రెడ్డి ఎం, ముని చంద్రా రెడ్డి యన్, ఇందు కుమార్ యం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో స్త్రీల గొప్పతనం గురించి, నేటి సమాజానికి అద్దం పట్టే విధంగా తీర్చిదిద్దారు. ఈ చిత్రం ప్రతీ ఒక్కరిక జీవితాలకు కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుందని మేకర్స్ వెల్లడించారు. కచ్చితంగా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉన్నారు. హాట్ స్పాట్ చిత్రం జూలై 17న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ ప్రకటించారు.

చిత్రం: హాట్ స్పాట్
నటీనటులు: గౌరి కిషన్, అదిత్య భాస్కర్, కలై అరసన్, అమ్ము అభిరమి, స్యాండీ, సోఫియా, జనని, సుభాష్ తదితరులు
సంగీతం: సతీష్, రఘునాథన్, వాన్
సినిమాటోగ్రాఫర్: గోకుల్ బెనోయ్
ఎడిటర్: ముత్తయన్ యు.
రచన, దర్శకత్వం: విఘ్నేష్ కార్తీక్
నిర్మాత: అనీల్ రెడ్డి ఎం, ముని చంద్రా రెడ్డి యన్, ఇందు కుమార్ యం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here