‘Iddari Lokam Okate’ Movie Review

Release date : December 25, 2019
Cinemarangam.com.. Rating : 3/5
Movie name:-”Iddari Lokam Okate”
Banners:-Sri venkateswaracreations
Starring :Raj Tharun,Shalini Pandey.Bharath,Najar,Rohini
Editor :Thammiraju
Cinematography:Sameer Reddy
Music Director :Mickey J Meyar
Director :G.R. Krishna
Producer :Dil Raju,Shirish

ఉయ్యాల జంపాల సినిమాతో కెరీర్ మొదలుపెట్టి ఎనర్జటిక్ హీరో గా పేరు తెచ్చుకున్న రాజ్ తరుణ్ కొన్ని సినిమాలు విజయాలు సాధించినా…గత కొంత కాలంగా సరైన సక్సెస్ లు లేక వెనుకపడిపోయారు. హిట్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణం లో సుధీరబాబుతో ఆడు మగాడ్రా బుజ్జీ సినిమాతో దర్శకుడుగా పరిచయమై మంచిపేరు తెచ్చుకున్న జి. ఆర్.కృష్ణ దర్శకత్వంలో రాజ్ తరుణ్,షాలిని షిండే, హీరో, హీరోయిన్లుగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన  ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమా క్రిస్మస్ సందర్భంగా ఈ రోజు విడుదల అయింది.మరి ఈ మూవీతో రాజ్ తరుణ్‌కు జి.ఆర్.కృష్ణ మంచి సక్సెస్ అందించాడా లేదా అనేది మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ:మహి (రాజ్ తరుణ్) వర్ష (షాలినీ పాండే) ఒకరి కోసం ఒకరు అన్నట్లు ఇద్దరూ ఒకే రోజు ఒకే ఆసుపత్రిలో పుడతారు. చిన్న తనంలోనే ఇద్దరు మధ్య బలమైన స్నేహం ఏర్పడినా.. ఆ తరువాత ఇద్దరూ విడిపోతారు. పెద్దయ్యాక వర్ష హీరోయిన్ కావాలని కలలు కంటుంటుంది. తన ప్రయత్నాలు ఏమాత్రం నిలబడవు. ఎన్ని ఆడిషన్స్‌కి వెళ్లినా. అవమానాలే.ఇటు మహి (రాజ్ తరుణ్) ఫోటోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకుంటాడు.ఇలా సాగుతున్న వీరి జీవితాలు వర్ష చిన్నప్పటి ఫోటో ద్వారా మళ్లీ కలుస్తాయి.ఆ తరువాత ఇద్దరు మధ్య చోటు చేసుకున్న సంఘటనలు ఏమిటి ? వర్ష తన గోల్ ను సాధించడానికి మహి ఎలా సాయ పడ్డాడు ? అప్పటికే వర్ష వేరే వ్యక్తితో పెళ్లికి ఒప్పుకున్నా.. మళ్లీ మహిని ఎలా ప్రేమిస్తోంది ? ఇద్దరూ తమ ప్రేమను వ్యక్తపరుచుకుంటారా ? లేదా ? అంతలో మహికి వచ్చిన సమస్య ఏమిటి ? చివరికీ వీరి ప్రేమ గెలిచిందా ?మరి. మహి తన ప్రేమని వర్ష ముందు వ్యక్తపరిచాడా? విధి వీరిద్దరి జీవితాలతో ఎలాంటి ఆటలు ఆడుకుంది?ఈ జంట కథ సుఖాంతం అయిందా లేదా అనే విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

విశ్లేషణ:ఉయ్యాల జంపాల నుంచి ప్రతి సినిమా నుంచి ప్రతి సినిమాలో సరదా ఆట పట్టించే కుర్రాడి క్యారెక్ట్ చేసే రాజ్ తరుణ్ ఈ సారి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో మెస్మరైజ్ చేయకపోయినా కాస్త కొత్తగానే ప్రయత్నం చేశాడు.తన లుక్స్ అండ్ యాక్టింగ్ పరంగా కూడా ఈ సినిమాలో కొత్తగా కనిపించడానికి బాగానే తాపత్రయ పడ్డాడు. ఇలాంటి సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ రావడంతో ఫ్రెష్ గా అనిపించింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన షాలినీ పాండే తన నటనతో పాటు గ్లామర్ తోనూ బాగా ఆకట్టుకుంది. ప్రేమ సన్నివేశాలతో పాటు, కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో కూడా తన పెర్ఫార్మెన్స్ తో షాలినీ మెప్పించింది. హీరోయిన్ కి మదర్ గా నటించిన రోహిణి ఎప్పటిలాగే తన ఎమోషనల్ నటనతో ఆకట్టుకుంది. అలాగే మరో కీలక పాత్రలో నటించిన నాజర్, మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. సినిమాలో మిక్కీ జె.మేయర్ అందించిన సంగీతం సినిమాకి బాగా ప్లస్ అయింది.దర్శకుడు జి.ఆర్‌.కృష్ణ ప్యూర్ లవ్ కి సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు,మనసుకు హత్తుకునే కథే చెప్పాలనుకున్నాడు. అందుకే ఎలాంటి పక్కదారులు తొక్కకుండా తను అనుకున్నది అనుకున్నట్లు స్క్రీన్ పై చూపించే ప్రయత్నం చేసాడు కూడా. కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథా,కథనాలను రాసుకోలేదు..హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగా హ్యాండిల్ చేసాడు.ఒకరి కోసం ఒకరు పుట్టారనే కాన్సెప్ట్ బాగానే ఉన్నా.. ఇద్దరి మధ్య మరిన్ని బలమైన సన్నివేశాలు రాసుండుంటే బాగుండేది. క్లైమాక్స్ బాగా చేసాడు.  తమ్మిరాజు ఎడిటింగ్ జస్ట్ ఓకే అనిపిస్తోంది. బోర్ కొట్టించే కొన్ని సన్నివేశాలను అయన తన ఎడిటింగ్ తో మ్యానెజ్ చేసుంటే బాగుండేేది.సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది.  నిర్మాతలు దిల్ రాజు,శిరీష్ లు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.అయితే  సినిమా ఓవరాల్ గా యూత్ తో పాటుగా మిగిలిన అన్నివర్గాల ప్రేక్షకులని అలరిస్తుందని చెప్పొచ్చు

Cinemarangam.com…3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here