Indian Panorama Awards for ‘F2’ and Anil Ravipudi

2019  సంక్రాంతి సినిమాల బరిలో విడుదలైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఎఫ్‌ 2..ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌’. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్స్‌తో వరుస విజయాలను అందుకున్న దర్శకుడు అనీల్‌ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాకు, చిత్ర డైరెక్టర్‌ అనీల్‌ రావిపూడికి అరుదైన గౌరవం దక్కింది. 2019 ఏడాదికిగానూ వివిధ భాషలకు చెందిన 26 సినిమాలకు అవార్డులు కేంద్ర సమాచార ప్రసారశాఖ ప్రకటించింది. ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ ఆఫ్ ఇండియా ద్వారా సినిమాల ఎంపిక చేపట్టగా..ఇందులో గతేడాది జనవరిలో విడుదలైన ‘ఎఫ్‌ 2’ సినిమాతో పాటు డైరెక్టర్‌ అనీల్‌ రావిపూడి ఇండియన్‌ పనోరమ అవార్డ్ అందుకోనున్నారు. ఆ ఏడాదిలో ఇండియన్‌ పనోరమను దక్కించుకున్న ఏకైక తెలుగు చిత్రం కూడా ‘ఎఫ్‌2’నే కావడం విశేషం. 
విక్టరీ వెంకటేష్‌, మిల్కీబ్యూటీ తమన్నా, వరుణ్‌తేజ్‌, మెహరీన్‌ నటించిన ఈ చిత్రాన్ని దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సినిమా రూపొందింది. ఔట్‌ అండ్‌ ఔట్‌ ఫ్యామలీ ఫన్‌ రైడర్‌గా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను సాధించింది. ఈ సందర్భంగా నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎంటైర్‌ యూనిట్‌కు అభినందనలు తెలిపింది. డైరెక్టర్‌ అనీల్‌ రావిపూడి మాట్లాడుతూ “2019 ఇండియన్‌ పనోరమ అవార్డుల్లో ఎఫ్‌ 2 సినిమాతో పాటు నేను కూడా డైరెక్టర్‌గా అవార్డును అందుకోనుండటం చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి సంతోషానికి కారణమైన విక్టరీ వెంకటేశ్‌, నా సోదరుడు వరుణ్‌తేజ్‌ సహా ఎంటైర్‌ యూనిట్‌కు ధన్యవాదాలు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌కు రాజుగారు, శిరీష్‌గారు నాపై నమ్మకంతో సినిమాను నిర్మించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here