Intense Raw Action Entertainer “Konaseema Thugs” Movie Review

Cinemarangam.Com
సినిమా : “కోనసీమ థగ్స్”
రివ్యూ రేటింగ్ : 3/5
విడుదల తేదీ : 24/2/23
నిర్మాణం : హెచ్ ఆర్ పిక్చర్స్ – రియా శిబు
సంగీతం – శామ్ సి ఎస్
డీ వో పి – ప్రీయేష్ గురుస్వామి
నటీనటులు: హ్రిదు హరూన్, సింహ, ఆర్ కె సురేష్, మునిష్ కాంత్, అనస్వర రంజన్, శరత్ అప్పని తదితరులు
ప్రాజెక్ట్ డిజైనర్ – జోసెఫ్ నెళ్లికల్
ఎడిటర్ – ప్రవీణ్ ఆంటోనీ
యాక్షన్ – ఫీనిక్స్ ప్రభు, రాజశేఖర్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – ముత్తు కురుప్పయ్య
కాస్ట్యూమ్స్ – మాలిని కార్తికేయన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – యువరాజ్
కో డైరెక్టర్ – హరిహరకృష్ణన్ రామలింగం
డిజైనర్ – కబిలన్
పి ఆర్ ఓ – బి ఏ రాజు’స్ టీం (తెలుగు)


పాన్ ఇండియా లెవెల్ లో ఇంటెన్స్ రా యాక్షన్ ఫిల్మ్ గా ప్రముఖ డాన్స్ మాస్టర్ బృందా గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం థగ్స్. భారీ చిత్రాల నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శిబు తమీన్స్ కుమార్తె రియా షిబు హెచ్ ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై సమర్పిస్తూ జీయో స్టూడియోస్ తో కలిసి నిర్మించిన ఈ చిత్రంలో .తమీన్స్ కుమారుడు హ్రిదు హరూన్ హీరోగా పరిచయం అవుతుండగా సింహ, ఆర్ కె సురేష్, మునిష్కంత్, శరత్ అప్పనీ, అనస్వర రాజన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ మరియు హిందీ భాషలలో ఫిబ్రవరి 24, 2023 లో భారీ స్థాయిలో విడుదలైన “కోనసీమ థగ్స్” ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి.

కథ..
శేషు (హృదు హరూన్) తండ్రి చనిపోవడంతో అనాధగా మిగిలిపోతాడు. తన తండ్రి పని చేసిన రౌడీ షీటర్ పెద్దిరెడ్డి దగ్గర పనిచేస్తుంటాడు. అక్కడకు వచ్చిన హీరోయిన్ అనశ్వర రాజన్ ను చూసిన తొలిచూపులోనే ప్రేమలో పడతాడు.ఆ తరువాత అనశ్వర రాజన్ కు మాటలు రావని తెలుసుకొని తనను ను ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు.వీరిద్దరూ పెళ్లి తరువాత హ్యాపీ గా ఉండాలి అనుకున్నటైంలో అదే పెద్దిరెడ్డి కుట్రలో భాగంగా శేషు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. కొత్తగా పెళ్ళైన భార్యను వదిలి జైలు కెళ్ళిన శేషు కు అదే సెల్ లో ఉండే దొర (బాబి సింహా), మధు (మునీష్ కాంత్) పరిచయం అవుతారు. వీరందరితో కలిసి జైలు నుండి తప్పించు కోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. మరి జైలు నుండి తప్పించు కోవడానికి శేషు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు..? తనకు ఎవరు సహకరించారు.అసలు పెద్ది రెడ్డి శేషు ను ఇరికించడానికి కారణం ఎంటి? కట్టుదిట్టమైన ఆ జైలు నుండి శేషు తప్పుంచు కున్నాడా లేదా అనేది తెలియాలంటే “కోనసీమ థగ్స్” సినిమా చూడాల్సిందే..


నటీ నటుల పనితీరు
మొదటి చిత్రంతోనే హీరో గా నటించిన హృదు హరూన్ కు ఇది మొదటి చిత్రమైనా శేషు పాత్రలో ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా చాలా బాగా నటించాడు. మాస్ క్యారెక్టర్‌లో బాబి సింహా జీవించేశాడు అని చెప్పవచ్చు. తన నటన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు అని చెప్పవచ్చు. హీరోయిన్ పాత్రలో నటించిన అనశ్వర రాజన్ మూగ అమ్మాయి పాత్రలో చాలా డీసెంట్‌గా నటించింది. మునీష్‌కాంత్‌, ఆర్‌కే సురేష్‌తో పాటు ఇందులో నటించిన వారంతా వారికీచ్చిన పాత్రలకు న్యాయం చేశారాని చెప్పవచ్చు


సాంకేతిక నిపుణులు పనితీరు
కోనసీమ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ సినిమాలో ఎక్కువ శాతం జైలు నేపథ్యంలో సాగుతుంది. హీరో జైలు నుండి తప్పించుకోవడానికి వేసే ఎత్తులు.. దానికోసం ఎంత దూరమైనా వెళ్లడం వంటి ఆసక్తికరమైన సంఘటనలతో, ఆద్యంతం ప్రేక్షకులకు గ్రిప్పింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా అద్భుతమైన స్క్రీన్ ప్లే తో ఆద్యంతం ఆసక్తకిరంగా మలచడంలో దర్శకురాలు బృందా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. అమ్మవారు కాళికా రూపంలో ఊరేగింపుగా వచ్చే సన్నివేశం బ్యాక్ డ్రాప్ లో” వీర శూర మహంకాళి వస్తోందయ్యా… వేటాడను ఆ తల్లే వస్తొందయ్యా… అంటూ సాగే ఈ పాటను రోమంచితంగా చిత్రీకరించారు.
సామ్ సిఎస్ అందించిన మ్యూజిక్ , నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్‌, అమ్మ ఉగ్ర రూపాన్ని ఎలివేట్ చేసే ఎనర్జిటిక్ ట్యూన్ ను సామ్ ఇవ్వగా వనమాలి చెడును అంతమొందించే క్రోధాన్ని తెలిసేలా లిరిక్స్ అందించారు. ప్రియేష్ గురుసామి సినిమాటోగ్రఫీ సినిమాకు మరో హైలైట్, ఇందులో తను అందించిన విజువల్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఎడిటర్ ప్రవీణ్ ఆంటోని పనితీరు బాగుంది.ఫీనిక్స్ ప్రభు, రాజశేఖర్ ల యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి. ఖర్చుకు వెనుకాడకుండా హెచ్ ఆర్ పిక్చర్స్ – రియా శిబు లు కలసి నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు చూసే మాస్ అడియన్స్ కు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని చెప్పొచ్చు.

Cinemarangam. Com Review Rating 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here