Intresting Triangle Love Entertainer ‘Trayam’ Movie Review

Release date :- July 30,2021
Cinema rangam :- Rating 3/5
Movie Name :- “Trayam”
Banner :-  Panchakshari films
Cast : – Ashok Chandanani, Abhiram Palakollu, Vushnu Reddy etc.
Music :-  Svh
Editor :- Ramarao .JP
D.O P :- S Shivareddy
P.R.O : – Pavan Pal
Producer :-  Padmaja Nayudu
Director : –  Gowtham Nayudu

ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ తో తెరకెక్కిన అనేక సినిమాలను తెలుగు  ప్రేక్షకులు  ఎప్పుడూ బ్రహ్మరథం పడుతుంటారు. అందుకే  చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. యూత్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ.. దర్శకులు, నిర్మాతలు కూడా ఇలాంటి సెన్సిటివ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ ను వెండితెర మీద చూపించ డానికి ఉత్సాహం చేస్తుంటారు. ఇప్పుడు అదే కోవలో పంచాక్షరి ఫిలిమ్స్ పతాకంపై అశోక్ చందనాని,అభిరామ్ పాలకొల్లు,విష్ణు రెడ్డి నటీనటులుగా గౌతమ్ నాయుడు దర్శకత్వంలో పద్మజ నాయుడు నిర్మిస్తున్న  ట్రయాంగిల్ లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా  తెరకెక్కిన ‘త్రయం’ మూవీ  ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం ఎంటర్టైన్ చేసిందో చూద్దాం పదండి.

కథ:
రఘు(విషు రెడ్డి)… నందు(విలన్) ఇద్దరూ తరచుగా గొడవ పడుతూ… కాలేజీలో అటెన్షన్ ని గ్రాబ్ చేస్తూ వుంటారు. రఘు.. హీరోయిన్ శ్రుతి ఇద్దరూ ప్రేమించుకుంటారు. అయితే రఘు చేసే గొడవల వల్ల శ్రుతి రఘుకి దూరం అవుతుంది. ఈ క్రమంలో తనను ఎలాగైన తన వద్దకు చేర్చాలని.. తన చిరకాల మిత్రుడు రాజును వేడుకుంటాడు. దాంతో రాజు… శ్రుతికి నచ్చజెప్పి… రఘుకి దగ్గర చేయాలనుకుంటాడు. అయితే శ్రుతి గతంలో తన జీవితంలో జరిగిన ఓ సంఘటన వల్ల… రాజును విపరీతగా ప్రేమిస్తుంది. ఈ ముక్కోణపు ప్రేమకథ చివరకు ఎలాంటి టర్న్ తీసుకుంది, రఘు శ్రుతి ప్రేమను పొందుతాడా? అసలు శ్రుతి గతం ఏమిటి? రాజు ఎవరు? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల పనితీరు
కాలేజీ స్టూడెంట్ లీడర్ పాత్రలో రఘుగా విషురెడ్డి చాలా బాగా చేశాడు. కాలేజీలో తన పాటు నందగా విలన్ పాత్రతో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ కి నచ్చుతాయి. నంద పేరుతో విలన్ గా నటించిన వ్యక్తి కూడా తన పాత్రకు న్యాయం చేశాడు. క్లైమాక్స్ సీన్ బాగుంది. రఘుతో పాటు.. హీరోయిన్ శ్రుతి లవ్ ను పొందే రాజు క్యారెక్టర్ కూడా చాలా సరదాగా వుంది. తన ఫ్రెండ్ కు హెల్ప్ చేయడానికి వెళ్లి.. హీరోయిన్ ప్రేమ పొందడం.. చివరకు క్లైమాక్స్ సీన్ తదితర సన్నివేషాల్లో చాలా కూల్ గా… నటించి మెప్పించాడు. హీరోయిన్ శ్రుతి పాత్రలో తనకున్న పరిధి మేరకు నటించి మెప్పించింది.

సాంకేతిక నిపుణుల పనితీరు
దర్శకుడు ఎంచుకున్న కథ.. కథనాలు బాగున్నాయి. కాలేజీలో జరిగే సరదా సన్నివేశాలు… యాక్షన్ సీన్స్.. ద్వితీయార్థంలో వచ్చే రాజు పాత్ర తదితరాలన్నీ బోరింగ్ లేకుండా రెండుగంటల పాటు చాలా సరదాగా  సాగిపోయేలా స్క్రీన్ ప్లేను రాసుకుని మెప్పించారు. ముక్కోణపు ప్రేమకథ ప్లాట్ ను ఎంచుకుని మొదటి భాగంలో యాక్షన్, లవ్ ఎపిసోడ్స్ తో సరదాగా సాగే ఈ త్రయం ఫస్ట్ హాఫ్… ద్వితీయార్థంలో అసలు కథ మొదలవు తుంది. ఫస్ట్ హాఫ్ లో విషు రెడ్డితో యాక్షన్ ఎపిసోడ్స్ ను చేయించడానికి ప్రాధాన్యం ఇచ్చిన దర్శకుడు… ద్వితీయార్థంలో అసలు కథను నడిపించడానికి రాజు అనే క్యారెక్టర్ ను ఎంటర్ చేసి ఇంట్రెస్టింగ్ ను కలుగజేస్తాడు. హీరోతో.. హీరోయిన్ కి ఓ చిన్న గ్యాప్ ను వచ్చేలా చేసి… చివరకు ఆమె చిన్నప్పటి నుంచి ఎవరిని మిస్ అవుతోందో… దాన్ని ఫుల్ ఫిల్ చేయడానికి దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే చాలా కన్వెన్సింగ్ గా వుంది. క్లైమాక్స్ లో వచ్చే భారీ యాక్షన్ ఎపిసోడ్ మాస్ కి, యూత్ ని ఉర్రూతలూగిస్తుంది. రాజు, శ్రుతిలను కలపడానికి క్లైమాక్స్ లో చెప్పే డైలాగ్ కూడా ఆకట్టుకుంటుంది. పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేకపోయినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు యాప్ట్ గా వుంది. సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా వుంటే బాగుండు. నిర్మాత ఖర్చుకు వెనకాడకుండా నిర్మాణ విలువలను చాలా గ్రాండియర్ గా చూపించారు. ట్రయాంగిల్ లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇష్టపడే ప్రేక్షకులకు ” త్రయం”  సినిమా కచ్చితంగా నచ్చుతుంది.

Cinemarangam.com… Rating 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here