Investigation Crime Thriller ‘HER’ Chapter1 Movie Review

Cinemarangam. Com
బ్యానర్ -డబుల్ అప్ మీడియాస్,
సినిమా : “HER ”
రివ్యూ రేటింగ్ : 3/5
విడుదల తేదీ : 21.07.2023
నిర్మాతలు : రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి
దర్శకత్వం : శ్రీధర్ స్వరాఘవ్,
నటీ నటులు : రుహాణి శర్మ. వికాస్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ తదితరులు
సంగీతం – పవన్
సినిమాటోగ్రఫీ – విష్ణు బేసి
ఎడిటర్ – చాణిక్య తూరుపు
పీఆర్వో – సతీష్ పాలకుర్తి


చి!!ల!!సౌ, హిట్ సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ రుహాణి శర్మ.కెరీర్ పరంగా వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటున్న రుహాణి.. ఇప్పుడు మరో డిఫరెంట్ లేడీ ఓరియెంటెడ్ స్టోరీతో మొదటిసారి పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రుహాణి శర్మ.ప్రధాన పాత్రలో వికాస్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్రీధర్ స్వరాఘవ్ దర్శకత్వం వహించిన .ఈ ‘HER’ ‘సినిమాను డబుల్ అప్ మీడియాస్ సంస్థ ఫస్ట్ ప్రొడక్షన్ గా రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి నిర్మించారు. ఈ సినిమా నుండి విడుదలైన చిత్ర ఫస్ట్ లుక్ మొదలుకొని టీజర్, ట్రైలర్ సినిమాపై హైప్ తీసుకొస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ద్వారా జూలై 21న గ్రాండ్ గా థియేటర్లోకి విడుదలైన “HER” సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి.

కథ
సిటీలో వ‌రుస దొంగ‌త‌నాలు జరుగుతున్న క్రమంలో
విశాల్ ప‌సుపులేటి(వినోద్ వ‌ర్మ‌), స్వాతి (అభిజ్ఞ‌) అనే జంట హ‌త్య‌కు గుర‌వుతారు.అప్పటికే కొన్ని కారణాల వల్ల ఆరు నెలలపాటు సస్పెండ్స్ అయి తిరిగి విధుల్లోకి వచ్చిన ఏసీపీ అర్చన ప్రసాద్ (రుహాణి శర్మ) కు ఈ కేసును  అప్పగిస్తారు.ఎలాంటి ఆధారాలు లేని ఈ కేస్ ను ఒక సవాల్ గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన అర్చనకు నేరస్తుడు కేశవ్ ఒక టెర్రరిస్ట్ అని తెలుసుకుంటుంది. అయితే గతంలో కేశవ్ ను పట్టుకోవడానికి తన టీం తో ఆపరేషన్ స్టార్ట్ చేస్తుంది. ఈ ఆపరేషన్ లో తను ప్రేమించిన శేషాద్రి (వికాస్ వ‌శిష్ట‌) ను, తన టీం కోల్పోతుంది. దాంతో తను సస్పెన్సు గురవుతుంది.ఇక కేశవ కు సంబంధించిన కేసు ఎస్ ఐ ఏ చూస్తుంటుంది. ఇపుడు మళ్ళీ ఈ జంట హత్యల కేస్ ను చేదించే క్రమంలో ఈ హ‌త్య కేసుల వెనుకున్న కేశవ్ లింక్ దొరుకుతుంది. దాంతో కేశవ్ ను పట్టుకోవాలని ప్రయత్నిస్తుంది. అయితే అసలు చనిపోయిన జంట ఎవరు? ఆ జంటకు కేశవకు ఉన్న సంబంధం ఏంటి.? ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో కథ ఎలాంటి మలుపులు తిరిగింది. చివరకు ఈ హ‌త్య కేసుల వెనుకున్న మిస్ట‌రీని అర్చ‌న ఎలా ఛేదించింది? చివరికి కేశవ్ ను పట్టుకుందా లేదా?అనేది తెలుసుకోవాలి అంటే కచ్చితంగా “HER” సినిమా చూడాల్సిందే.


నటీ నటుల పనితీరు
ఇప్ప‌టివ‌ర‌కు ఎక్కువ‌గా ప‌క్కింటి అమ్మాయి త‌ర‌హాలో సెన్సిటివ్ రోల్స్ చేసిన రుహాణి శ‌ర్మ మొదటిసారిగా పోలీస్ పాత్ర‌లో నటించి మెప్పించింది.సినిమా మొత్తం అర్చన పాత్ర చుట్టూనే తిరుగుతుంది.ఇంకా ఇందులో అర్చన ప్రియుడుగా నటించిన వికాస్ వశిష్ట స్క్రీన్ లో ఉన్నది తక్కువే అయినా బాగా చేశాడు. ఇంకా ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ తదితరులు వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారాని చెప్పవచ్చు.


సాంకేతిక నిపుణుల పనితీరు

చాలా వ‌ర‌కు క్రైమ్ ఇన్వేస్టిగేట్ సినిమాలు హీరో ప్ర‌ధానంగానే సాగుతుంటాయి. కానీ వాటికి భిన్నంగా తనకిది మొదటి సినిమా అయినా లేడీ ఓరియెంటెడ్ కథను సెలెక్ట్ చేసుకొని క్రైమ్‌ను సాల్వ్ చేసే విష‌యంలో పోలీసుల ఇన్వేస్టిగేష‌న్, వారి ఆలోచ‌న తీరు, వారు వేసే ఎత్తులు, ఎలా ఉంటాయన్నది చాలా రియ‌లిస్టిక్‌గా చూపించడంలో దర్శకుడు శ్రీధ‌ర్‌ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. సినిమాటోగ్రఫర్ విష్ణు బేసి అందించిన విజువల్స్ బాగున్నాయి.. పవన్ అందించిన మ్యూజిక్ బాగుంది… చాణక్య తూరుపు ఎడిటింగ్ పరవాలేదు. డబుల్ అప్ మీడియాస్ పతాకంపై రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి లు నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. క్రైం, ఇన్వెస్టిగేషన్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రం “HER” సినిమా కచ్చితంగా నచ్చుతుంది

Cinemarangam. Com Review Rating.. 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here