“Janaka Aithe Ganaka” Pre Release Event held grandly..Movie Releasing on Oct 12th

వెర్సటైల్ యాక్ట‌ర్ సుహాస్‌, సంగీర్త‌న హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘జనక అయితే గనక’. శిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై  హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. సందీప్‌ రెడ్డి బండ్ల డైరక్ట్ చేశారు. ఈ సినిమా  ద‌స‌రా సంద‌ర్భంగా ‘జనక అయితే గనక’ అక్టోబ‌ర్ 12న విడుద‌ల కానుంది. ఇప్పటి వరకు చిత్రం నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, టీజర్‌లు ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. రీసెంట్‌గా చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది. ఆదివారం నాడు బందరులో చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో..

మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. ‘జనక అయితే గనక ఈవెంట్‌ను బందరులో నిర్వహించడం ఆనందంగా ఉంది. నేచురల్ హీరో సుహాస్‌ను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మలయాళీ హీరోయిన్ అయినా సంగీర్తన తెలుగులో బాగా మాట్లాడారు. డైరెక్టర్ సందీప్ గారికి ఈ చిత్రం మంచి విజయాన్ని తెచ్చి పెట్టాలి. ఎంతో మంది కళాకారుల్ని ఈ బందరు అందించింది. అక్టోబర్ 12న రాబోతోన్న ఈ చిత్రాన్ని ఆడియెన్స్ అందరూ చూసి విజయవంతం చేయాలి’ అని అన్నారు.

దిల్ రాజు మాట్లాడుతూ.. ‘మా సినిమా కార్యక్రమానికి మంత్రి కొల్లు రవీంద్ర రావడం ఆనందంగా ఉంది. నా మిత్రుడు నారాయణ రావు ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్‌గా నియమితులవ్వడం సంతోషంగా ఉంది. సుహాస్‌లో మీలో ఒకడిగా ఉండేవాడు.. మీ జిల్లా వాడు. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగాడు. డైరెక్టర్ సందీప్, సంగీర్తన ఇలా కొత్త వాళ్లతో దిల్ రాజు ప్రొడక్షన్స్‌లో నిర్మించిన ఈ చిత్రం పెద్ద హిట్ కాబోతోంది. సినిమా చూసి అందరూ నవ్వుకుని బయటకు వస్తారు. అందరినీ నవ్వించేలానే చిత్రం ఉంటుంది. పండుగ రోజు రిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని చూసి అందరూ ఆనందిస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

డైరెక్టర్ సందీప్ బండ్ల మాట్లాడుతూ.. ‘మా సినిమా ఈవెంట్‌కు వచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర గారికి థాంక్స్. దిల్ రాజు గారు ఎప్పుడూ కొత్త వాళ్లని ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. హన్షిత, హర్షిత్ గారు నాకు ముందు నుంచీ సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. ప్రభాస్ సలార్ సినిమాకు రైటర్‌గా పని చేశాను. ఆయన మా మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ప్రభాస్ గారి గుణం ఎవ్వరికీ ఉండదు.. ఆయన ఎవ్వరికీ రుణం ఉండరు. సుహాస్ వల్లే ఈ సినిమా ఇంత వరకు వచ్చింది. ఈ సినిమాను ఒప్పుకున్న ఆయనకు థాంక్స్. సంగీర్తన అద్భుతంగా నటించింది. అక్టోబర్ 12న దసరా సందర్భంగా ఈ చిత్రం థియేటర్లోకి రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

హీరో సుహాస్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా మీద నాకు చాలా నమ్మకం ఉంది. అందుకే ఈ మూవీతో డిస్ట్రిబ్యూటర్‌గా మారుతున్నా. ఓవర్సీస్‌లో ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. నాకు ఇంత మంచి పాత్ర, సినిమాను ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. సంగీర్తనను చూశాక అందరూ ఆమె ఫ్యాన్స్ అవుతారు. మా సినిమా కార్యక్రమానికి వచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర గారికి థాంక్స్. అక్టోబర్ 12న మా చిత్రం రాబోతోంది. ఆద్యంతం నవ్వుతూనే ఉంటారు. నవ్వుతూనే థియేటర్ బయటకు వెళ్తారు. అందరూ చూడండి’ అని అన్నారు.

హీరోయిన్ సంగీర్తన మాట్లాడుతూ.. ‘మా మూవీ ఈవెంట్‌కు వచ్చిన మంత్రి గారికి థాంక్స్. మా చిత్రం అక్టోబర్ 12న రాబోతోంది. నాకు ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. సుహాస్ గారితో నటించడం ఆనందంగా ఉంది. విజయ్ బుల్గానిన్ సంగీతం అద్భుతంగా వచ్చింది. అందరూ మా సినిమాను చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ నారాయణరావు మాట్లాడుతూ.. ‘దసరా సందర్భంగా జనక అయితే గనక చిత్రం రిలీజ్ అవుతోంది. ఈ చిత్రంలో నటించిన సుహాస్ ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. దిల్ రాజు గారు తీసే చిత్రాలు సందేశాత్మకంగా ఉంటాయి. ఆయన నాకు మంచి మిత్రుడు. ఈ మూవీ అక్టోబర్ 12న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here