Narasimha Nandi’s Message Oriented ‘Jathiya Rahadari’ Movie Review

Cinema rangam.com Rating 3/5
బ్యానర్ :- భీమవరం టాకీస్
సినిమా పేరు :-“జాతీయ రహదారి”
సినిమాటొగ్రఫి :- యస్ మురలి మొహన్ రెడ్డి,
సంగీతం :- సుక్కు,
పాటలు :- మౌన శ్రీ మల్లిక్,
ఎడీటర్ :- వి నాగిరెడ్డి,
నిర్మాత :- తుమ్మలపల్లి రామసత్యనారాయణ.,
రచన,దర్శకత్వం :- నరసింహ నంది…
సమర్పణ :- సంధ్య స్టూడియోస్ రవి కనగల.
పి.ఆర్.ఓ :- మధు వి.ఆర్

నటి నటులు
మధు చిట్టె ,సైగల్ పాటిల్ , మమత, ఉమాభారతి, మాస్టర్  నందిరెడ్డి. ధక్షిత్ రెడ్ది, అభి, తెల్జెరు మల్లెష్, తరని,గొవిందరాజు, ఘర్షణ శ్రీనివాస్., విజయ భాస్కర్, సిద్దిపెట రవి

1940 లో ఓ గ్రామం’ ,కమలతో నా ప్రయాణం”,”లజ్జ” ,”డిగ్రీ కాలేజ్” వంటి సామాజిక సృహ కలిగే సినిమాలు తీసి  ప్రేక్షకులను ఆలోచింప జేసేవిధంగా హార్ట్ టచింగ్ కథలు తీసి దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు దర్శకుడు నరసింహ నంది. ఇపుడు అదే కోవలో మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ తో భీమవరం టాకీస్ పతాకంపై మధు చిట్టె ,సైగల్ పాటిల్ , మమత, ఉమాభారతి, మాస్టర్  నందిరెడ్డి. ధక్షిత్ రెడ్ది, నటీనటులుగా నరసింహ నంది దర్శకత్వంలో తుమ్మలపల్లి రామ సత్య నారాయణ నిర్మించిన  “జాతీయరహదరి” చిత్రం సెప్టెంబర్ 10 న త ప్రపంచ వ్యాప్తంగా  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో చూద్దాం పదండి.

కథ
కరీంనగర్ జిల్లాలోని ఒక గ్రామంలో మల్లి(సైగల్ పాటిల్ ) , ఈశ్వరి (ఉమాభారతి) ప్రేమించుకున్న ఈ యువజంట పెళ్లి చేసుకుందా మనుకొని పెద్దలకు చెప్పకుండా హైదరాబాద్ కు వస్తారు.ఇక్కడ ఆటో డ్రైవర్ వీరిని లాడ్జ్ కు తీసుకెళ్లి మాయమాటలు చెప్పి ఈశ్వరిని అక్కడే కూర్చోబెట్టి మల్లిని తెలియని ప్రదేశానికి తీసుకెళ్లి మంచిగా ఉన్నట్లు నటిస్తూ మల్లి చేతిలో ఉన్న మొబైల్ ను లాక్కొని మాయమవుతాడు. ఆ ఆటోడ్రైవర్ ఈశ్వరి ఉన్న లాడ్జ్ కు వచ్చి భయపెట్టి లొంగతీసు కోవడమే కాకా తన మాట విననందుకు ఆమెను బంధించి విటులతో పడుకోబెట్టి సొమ్ము చేసుకుంటుంటాడు. అలా ఆమె శారీరకంగా, మానసికంగా ఎంతో బాధలు అనుభవిస్తుంటుంది. మరో పక్క ఈశ్వరి వుండే లాడ్జ్ అడ్రెస్ తెలియక సిటీ అంతా ఈశ్వరి కోసం గాలిస్తుంటాడు మల్లి. నేను మిస్సయ్యాననుకొని తనకోసం ఊరెళ్ళిందోమో అనే అనుమానంతో మల్లి సొంత ఊరికి బయలుదేరగా కరోనా కారణంగా ప్రభుత్వం లాక్ డౌన్ విధిస్తుంది. అలాగే ఎక్కడి వారు అక్కడే ఉండాలని పోలీసులు తెలపడంతో ఎలాగైనా తను ఊరెళ్లాలని కాలినడకన జాతీయ రహదారిపై ప్రయాణం సాగించగా  జాతీయ రహదారి పై ఎవరినీ వెళ్ళ నివ్వకుండా మల్లిని పోలీసులు అడుగడుగునా అడ్డు కుంటుంటారు.

అలాగే అదే గ్రామం లో వుండే మరో జంట రాములు (మధు చిట్టె), సీతాలు (మమత) ఇద్దరు భార్య భర్తల వీరికి ఒక కుమారుడు సైదులు.తన కుటుంబం బాగు పడాలని ఊర్లో అప్పులు కోసి దుబాయి కెళ్ళగా  వెళ్లిన కొద్ది రోజులకే అక్కడ కరోనా రావడం తో ఇండియాకు తిరిగి వస్తాడు. చేసిన అప్పులు అలాగే ఉండడంతో తన కుటుంబానికి ధైర్యం చెప్పి చేసిన అప్పును తీర్చడంకోసం  హైదరాబాద్ కు వస్తాడు రాములు. ఇక్కడకు వచ్చిన కొద్ధి రోజులకే ప్రభుత్వం లాక్ డౌన్ విదించగా అటు ఊరికి వెళ్లలేక,ఇటు హైదరాబాద్ లో ఉండలేక చివరికి  ఊరికి వెళ్లాలని జాతీయ రహదారి వెంట నడక సాగిస్తాడు రాములు. అలాగే ఊర్లో ఉన్న తన భార్య సీతాలు కూడా భర్త కోసం ఆశగా ఎదురు చూసి,చూసి చివరికి కొడుకుతో హైదరాబాద్ కు బయలుదేరుతుంది. ఇలా రెండు కుటుంబాల జీవితాలు ఎలా చిన్నా బిన్న మయ్యాయి. ఆ ఆటో డ్రైవర్ ద్వారా మోసపోయిన ఈశ్వరి లాడ్జ్ నుండి తప్పించుకొని తన లవర్ మల్లిని, ఈశ్వరి కోసం వెతుకుతున్న మల్లి కి ఈశ్వరి ఇలా వీరిద్దరూ కలుసుకొని ఒక్కటయ్యారా లేదా ?  మరియు భార్య,భర్తలైన రాములు, సీతాలు ఇద్దరూ కలుసు కున్నారా లేదా.. ? ఇలా ఇద్దరు లవర్స్, ఒక ఫ్యామిలీ జంట ఇలా రెండు కుటుంబాల కథలు సుఖాంత మయ్యాయా.. లేదా? అన్యోన్యంగా ఉన్న వీరి జీవితాలకు లాక్ డౌన్ ఒక శాపంగా మారిందా? అనేది తెలుసు కోవాలంటే కచ్చితంగా సినిమా చూడాల్సిందే…

నటీనటుల పనితీరు
రాములు(మధు చిట్టె) పక్క పల్లెటూరి అబ్బాయిగా మంచి భర్తగా, చక్కటి తండ్రిగా తన నటనతో చాలా చక్కగా నటించాడు. సీతాలు (మమత) ఒక భార్య ఎలా ఉండాలి భర్త కోసం ఆశగా ఎదురుచూస్తూ లాక్ డౌన్ కారణంగా  హైదరాబాద్ లో చిక్కుకొన్న భర్త దగ్గరికి వెళ్లాలనే క్రమంలో తను చూపించిన నటన అద్భుతం , మల్లి,(సైగల్ పాటిల్ ) ప్రియురాలి కోసం వెతుకుతూ తనపై ఉన్న ప్రేమను చెక్కు చెదర నివ్వకుండా ఆత్మ విశ్వాసంతో తన ప్రయాణంలో జరిగే సంఘటనలను ఎదుర్కొంటూ చక్కటి అభినయాన్ని ప్రదర్శించాడు , ఈశ్వరి (ఉమాభారతి)తను ఊహించుకున్న అందమైన జీవితం పేకమేడలా కూలిపోతుంటే తను పడే క్షోభ, బాధ,దుఃఖం ఇలా అన్ని హావభవాల్లో చక్కటి నటనను కనబరచింది ఈశ్వరి.ఇంకా మిగిలిన వారంతా వారి వారి పాత్రల్లో చక్కగా నటించారు.

సాంకేతిక నిపుణులు పనితీరు
రెండు జీవితాలే కాకా లాక్ డౌన్ టైంలో కొన్ని లక్షల మంది జీవితాలు ఎన్నో ఇబ్బందులు ఎలా పడ్డారు. లాక్ డౌన్ టైం లో వారు ఎన్ని కష్టాలు పడ్డారు.కరోనా కారణంగా లాక్ డౌన్ విధిస్తే వెళ్ళడానికి ఎం లేక దేశ ప్రజలంతా రోడ్ల పై నడిచి వెళ్తుంటే వారిపై పోలీస్ లు రూడ్ గా ఎలా బిహేవ్ చేశారు.వారి కష్టాలు,వారి బాధలు,వ్యదలు గురించి తెలియజేస్తూ.. ఈ ప్యాండమిక్ స్విచ్వేషన్ ను బేస్ గా చేసుకొని సినిమా చేశారు దర్శకుడు నరసింహ నంది. లాక్ డౌన్ లో జరిగిన సంఘటన నేపథ్య కథనంతో మంచి కథను ఎంపిక చేసుకుని తాను అనుకున్న కథ, కథనాలను చాలా చక్కగా తెరకెక్కించాడు. అలాగే డైలాగ్స్ అక్కడక్కడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.ఈ సినిమాకు సుక్కు అందించిన సంగీతం ఆకట్టుకుంది. నేపథ్య సంగీతం సినిమాకు బలాన్నిచ్చాయి. లిరిక్స్ రైటర్ మోనశ్రీ మల్లిక్ అద్భుతమైన సాహిత్యం అందించారు. ప్రతి పాట కూడా ఎంతో అర్థ వంతంగా ఉంది.ఈ సినిమాకు యస్ మురలి మొహన్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రెమ్ ని అందంగా చూపించారు. వి నాగిరెడ్డి ఎడిటింగ్ అద్భుతంగా ఉంది.భీమవరం టాకీస్ పతాకంపై నిర్మించిన నిర్మాత తుమ్మలపల్లి  రామసత్య నారాయణ ఖర్చుకు వెనకాడకుండా నిర్మాణ విలువలను చాలా గ్రాండియర్ గా చూపించారు. ఇందులో నటించిన పాత్రలు చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. సినిమా చివరి వరకు చూస్తే రెండు కుటుంబాల జీవితాలను చూస్తున్నట్లు ఉంటుంది.సినిమా చేసేటపుడు వారితో మనం ప్రయా నిస్తున్నట్లు ఫీలింగ్ కలుగుతుంది. చాలా రియలిస్టిక్  గా చూపించడం జరిగింది.1940 లో ఓ గ్రామం’ , ”కమలతో నా ప్రయాణం”, “లజ్జ” ,”డిగ్రీ కాలేజ్” వంటి సామాజిక సృహ కలిగే సినిమాలు తీసి ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్ తో ప్రేక్షకుల మనసు దోచుకొని విమర్శకుల ప్రశంశలు పొందిన దర్శకుడు నరసింహ నందికి ఈ సినిమాకు కూడా ఖచ్చితంగా అవార్డు వస్తుంది. ఇద్దరు లవర్స్ ఒక రాంగ్ టైం లో డీసీజన్ తీసుకొని పెద్దలకు చెప్పకుండా వెళ్ళిపోతే వారు తమ జీవితంలో ఎం కోల్పోయారు అనే విషయాన్ని చాలా చక్కగా చూపించారు. లాక్ డౌన్ లో మనం చూడ నటువంటి ఎన్నో విషయాలను కళ్ళకు కట్టినట్లు తెరపై అద్భుతంగా చూపించిన నరసింహ నందికి ఈ చిత్రానికి కూడా ఖచ్చితంగా అవార్డు వస్తుందనే దాంట్లో సందేహం లేదు.కొత్త నటీ నటులతో గ్రామీణ,పట్టణ నేపథ్యంలో సాగె చక్కటి కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన “జాతీయ రహదారి”  చిత్రం ఎక్కడా బోరింగ్ లేకుండా ఫ్యామిలీతో  పాటు కలసి చూడవలసిన ఈ సినిమా అందరికీ తప్పక నచ్చుతుంది.

Cinemarangam.com..Rating..3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here