Jeevitha Rajasheksr launched ‘Kotha Hero’ Teaser & firs look Poster

థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ’ సినిమా లో  హీరో, హీరోయిన్స్ చివరి వరకు కలుసుకోకుండా వారు ఎలా ప్రేమించు కుంటారు? వారి జీవితంలో జరిగిన సంఘటనలు ఏంటి ?  చివరికి ఈ జంట ఒక్కటవుతుందా లేదా ?..ఆనే కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు చిత్ర దర్శకుడు కట్ల రాజేంద్రప్రసాద్. బొగ్గుల నరసప్ప సమర్పణలో  హెల్పింగ్ హాండ్స్ క్రియేషన్స్ పతాకంపై కట్ల ఇమ్మోర్టల్, ఐశ్వర్య జంటగా  కట్ల రాజేంద్రప్రసాద్ దర్శకత్వంలో బొగ్గుల పరమేశ్ నిర్మిస్తున్న ఔట్ అండ్ ఔట్ యాక్షన్ లవ్ కమర్షియల్ చిత్రం “కొత్త హీరో ” ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకొని ఈ నెల 13 నుండి రెండవ షెడ్యూల్ షూటింగ్ జరుపు కుంటుంది. అలాగే చిత్ర హీరో ఇమ్మోర్టల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం టీజర్ ,ఫస్ట్ లుక్ పోస్టర్ ను హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో సినీ ప్రముఖుల సమక్షంలో  విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన జీవిత రాజశేఖర్ “కొత్త హీరో”  టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు .ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత సాయి వెంకట్, ప్రముఖ నిర్మాత నటుడు రామ సత్యనారాయణ, ప్రముఖ పారిశ్రామిక వేత్త జి.టి.ఆర్ , జనసేన కార్యకర్త ,చిత్ర యూనిట్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం

జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ..* ఒక నిర్మాత గా  కష్టాలు తెలిసిన దాన్ని.ఈ  కోవిడ్ టైం లో సినిమా తీసి విడుదల చేయాలంటే మేమే బయపడు తున్నాము.అలాంటిది ఈ ప్యాండమిక్ స్విచ్వేషన్ లో తన కొడుకును హీరోగా పెట్టి  సినిమా తీయడం ఆయన ధైర్యానికి మెచ్చు కోవచ్చు. సినిమా చాలా కలర్ ఫుల్ గా ఉంది. మంచి కథతో వస్తున్న  చిత్ర హీరో  పెద్ద హీరో అవ్వాలి. దర్శక, నిర్మాతలకు ఈ సినిమా మంచి పేరు తీసుకు రావాలి. కష్ట పని చేస్తే సక్సెస్ ఆటోమేటిక్ గా అదే మనల్ని వెదుక్కుంటూ వస్తుంది.అందరికీ ఈ సినిమా ద్వారా మంచి జరుగుతూ చిత్రం గొప్ప విజయం సాధించాలని కోరుతున్నాను అన్నారు.

నిర్మాత బొగ్గుల పరమేష్ గారు మాట్లాడుతూ* ..జీవిత గారు వచ్చి మా సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసినందుకు ఆ అమ్మ గారికి ధన్యవాదాలు.. ఇంతకు ముందు నాకు సినిమా గురించి  తెలియని టైం లో సినిమా తీసి ఎంతో నష్ట పోయాను. మా గురువు శ్రీను ద్వారా ముందుకు వెళుతున్నాను. సినిమా బాగా వచ్చింది ఈ సినిమా ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది .ఈ చిత్రాన్ని ప్రతి  అందరూ చూసి ఆదరిస్తారని మనసు పూర్తిగా  కోరుతున్నాను అన్నారు.

చిత్ర దర్శకుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ* .. నేను ఫిలిం డైరెక్టర్, కొరియోగ్రాఫర్ , దర్శకుడిగా నాకిది తొమ్మిదవ సినిమా ,హీరోయిన్ ఐశ్వర్య ని పరిచయం చేస్తున్నాం . ఈ చిత్రానికి దర్శకుడిగా , స్టోరీ రైటర్  గా, కొరియోగ్రాఫర్ గా పని చేస్తున్నాను. నేను గత 35 సంవత్స రాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను  అలాగే నేను మర్చిపోలేని వ్యక్తుల్లో సీనియర్ ఎన్టీ రామారావు గారు అతనితో శ్రీనాథ “కవిసార్వభౌమ’, సామ్రాట్ అశోక్ చిత్రాలకు ఎన్టీఆర్ గారికి డాన్స్ లో మెళకువలు నేర్పడం నేను జీవితంలో మరిచి పోలేను. ఆది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే చిరంజీవి, బాలకృష్ణ ,వెంకటేష్, నాగార్జున పవన్ కళ్యాణ్  లకు అదే విధంగా బాలీవుడ్ లో కూడా  గోవిందా , అక్షయ్ కుమార్ ,మిథున్ చక్రవర్తి ,అనిల్ కపూర్ , అమితా బచ్చన్ ల వంటి గొప్ప నటుల  సినిమాలకు కూడా నేను డ్యాన్స్ లో మెలుకువలు నేర్పడం జరిగింది. అలా నేనుగత 35 సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాను. మంచి కాన్సెప్ట్ ఉన్న “కొత్త కథ” లభించడంతో  “కొత్త హీరో” టైటిలే తో మా అబ్బాయిని హీరోగా  పరిచయం చేస్తున్నాను.నటన లో మా అబ్బాయికి మంచి తర్ఫీదుతో పాటు అన్ని మెలుకువలు  నేర్పించాము. “కొత్త హీరో ” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమా ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ నెల 13 నుండి రెండవ షెడ్యూల్ మొదల వుతున్న మా సినిమా ప్రేక్షకులను తప్పక ఏంటర్ టైన్ చేస్తుందని అన్నారు.

సెక్సీ స్టార్ శ్రీనివాస్* .. కట్ల రాజేంద్ర గారు నాకు గురువు. తనకు 24 క్రాఫ్ట్ లో అవగాహన ఉన్న వ్యక్తి ఉంది. కరోనా టైం లో తను వేల మందికి అన్నదానం చేసి ఎంతో మందిని ఆదుకొని ఎంతో మందికి వారి కుటుంబం సేవ చేసింది. ఇంతకాలానికి తన కొడుకును హీరోగా చేస్తూ తీసిన కొత్త హీరో సినిమా చాలా బాగా వచ్చింది. తను చాలా బాగా నటించాడు.ఈ సినిమా తరువాత  హీరో నటనను చూసి వారందరూ మరో విజయ్ దేవరకొండ ఇండస్ట్రీకి వచ్చాడు అనే విధంగా హీరోగా మంచి పేరు తెచ్చుకుంటాడు .ఈ సినిమా తర్వాత హీరోగా తనకు, దర్శకుడు గా వారి తండ్రికి కచ్చితంగా మంచి అవకాశాలు వస్తాయని అన్నారు.

దర్శకుడు అక్క, బావ మాట్లాడుతూ..* మా వాడు ఇంత  స్థాయికి చేరతాడు అనుకోలేదు.మేము ఏవిధమైన సహాయం చేయలేదు తను ఎన్నో కష్టాలు పడి ఈ రోజు తన కొడుకును హీరోగా పెట్టి సినిమా తీసే  స్థాయి కు రావడం చాలా గొప్ప విషయం. మేము చాలా ఆనందంగా ఉందని అన్నారు.

చిత్ర హీరో కట్ల ఇమ్మోర్టల్ మాట్లాడుతూ..* మా నాన్నకు ఇందుష్ట్రీలో  35 సంవత్సరాల అనుభవం వున్నా కూడా ఎన్నో  ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నాడు. మా నాన్న మొదటగా గ్రూప్ డ్యాన్సర్ గా జాయిన్ అయ్యి , అసిస్టెంట్ డ్యాన్స్ మాస్టర్ అయ్యి,ఆ తరువాత కొరియోగ్రాఫర్ అయ్యాడు. తరువాత నాలుగు సినిమాలు హీరోగా చేశాడు. మా నాన్న ఇప్పటి వరకు 9 సినిమాలకు దర్శకత్వం చేయడం జరిగింది.ఇలా ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా తట్టుకొని నిలబడి నన్ను  హీరో ని చేయడానికి చాలా ఇబ్బందులు పడ్డారు.ఈ రోజు నేను ఈ స్టేజ్ పై నిలచున్నాను అంటే దానికి నా తల్లితండ్రులే కారణం వారికి నా పాదాభివందనం. చాలా మంది నన్ను,మా నాన్నకు కించపరిచే మాటలు మాట్లాడి మమ్మల్ని ఎంతో బాధపెట్టారు వారందరికీ మా “కొత్త హీరో” సినిమానే చెంప చెళ్లు మనేలా తగిన గుణపాఠం  చెపుతుంది .అద్భుతమైన కాన్సెప్టు తో వస్తున్న ఈ సినిమాలో అద్భుతమైన పాటలు,డాన్సులు, ఫైట్స్ ఎమోషన్డ్ ఉన్న ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించి ఆశీర్వ దించాలని మనస్పూర్తిగా కోరుతున్నాను అన్నారు.

*హీరోయిన్ ఐశ్వర్య మాట్లాడుతూ..* నేను ఇందులో చాలా మంచి పాత్ర ఇచ్చారు.ఇంత మంచి థ్రిల్లర్ సినిమాలో నటించే  అవకాశం కల్పించిన  దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని అన్నారు.

నటీనటులు
కట్ల ఇమ్మోర్టల్, ఐశ్వర్య, విజయ భాస్కర్ జంబో,మధుమతి తదితరులు

సాంకేతిక నిపుణులు
ప్రజెంట్స్ :- బొగ్గుల నర్సప్ప ,
బ్యానర్ :-హెల్పింగ్ హ్యాండ్స్ క్రియేషన్స్
సినిమా పేరు :- కొత్త హీరో
ప్రొడ్యూసర్ :- బొగ్గుల పరమేష్
స్క్రీన్ ప్లే :- అమ్మ రాజశేఖర్
కొరియోగ్రఫీ స్టోరీ డైలాగ్స్ డైరెక్షన్ :- కట్ల రాజేంద్రప్రసాద్
డిఓపి :- బైపల్లి రవి ఫ్రెండ్స్ నవ
పిఆర్వో :- భూషణ్ , హర్ష

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here