‘KALINGA’ Movie Review

Cinemarangam.Com
బ్యానర్ : బిగ్ హిట్ ప్రొడక్షన్స్
సినిమా : “కళింగ”
రివ్యూ రేటింగ్ : 3.25/5
విడుదల తేదీ : 13.09.2024
దర్శకుడు: ధృవ వాయు
నిర్మాతలు: దీప్తి కొండవీటి, పృథివి యాదవ్
నటీనటులు:  ధృవ వాయు, ప్రజ్ఞా నయన్, అడుకలం నరేన్, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, తనికెళ్ల భరణి, షిజు ఏఆర్, సమ్మెట గాంధీ, బలగం సుధాకర్, సంజయ్ కృష్ణ, హరిశ్చంద్ర తదితరులు
సినిమాటోగ్రఫీ :  అక్షయ్ రామ్ పొడిశెట్టి
సంగీతం : విష్ణు శేఖర మరియు అనంత నారాయణన్ AG
ఎడిటర్: నరేష్ వేణువంక
డి ఐ : ఆర్యన్ మౌళి
డాల్బీ మిక్స్: యస్. పి నారాయణన్
విఎఫ్ఎక్స్ : షఫీ
పి. ఆర్ ఓ : సాయి సతీష్


కిరోసిన్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ధృవ వాయు.. ఇప్పుడు లవ్, రొమాన్స్, హారర్, థ్రిల్లర్, కామెడీతో “కళింగ” అనే కొత్త కాన్సెప్ట్‌తో హీరోగా, దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించకునేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించిన ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది. టీజర్, పోస్టర్‌లు, గ్లింప్స్, సాంగ్స్ అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 13న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన “కళింగ ’ చిత్రం ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి..


కథ
కళింగ అనే ఊర్లో అనాథ అయిన లింగ (ధృవ వాయు) సారా కాస్తూ ఉంటాడు. ఆ ఊరి పెద్ద (ఆడుకాలమ్ నరేన్) అతని తమ్ముడు బలి (సంజయ్) తమ గుప్పిట్లో పెట్టుకుని ఉంటాడు. కనిపించిన ఆడవాళ్ల మీద కన్నేస్తుంటాడు. లింగ చిన్నతనం నుంచి కూడా పద్దు (ప్రగ్యా నయన్) ప్రేమిస్తుంటాడు. తను కూడా లింగను ప్రేమిస్తూ ఉంటుంది. కానీ ఇంతలో పద్దు మీద బలి కన్ను పడుతుంది. లింగతో పెళ్లికి ఒక చిక్కు ముడి వేస్తాడు పద్దు తండ్రి (మురళీధర్ గౌడ్). ఊరి పెద్ద వద్ద తనఖాలో ఉన్న పొలాన్ని విడిపించుకుని వస్తే పెళ్లి చేస్తాను అని చెప్పి లింగకు మాటిస్తాడు. అసలు ఆ సంస్థానం నేపథ్యం ఏంటి? లింగ పద్దు తండ్రికి స్థలాన్ని రాసిస్తాడా? పద్ధుని పెళ్లి చేసుకుంటాడా? లేదా? చివరికి ఏమైంది? అనేది తెలుసుకోవాలి అంటే కచ్చితంగా “కళింగ” సినిమా చూడాల్సిందే.


నటీ నటుల పనితీరు
లింగ పాత్రలో నటించిన హీరో  ధ్రువ వాయు మరోసారి తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. యాక్షన్ సీక్వెన్స్ లలో కూడా చాలా అద్భుతంగా నటించాడు. హీరోయిన్ ప్రగ్యా నయన్ తన పాత్రకు పర్‌ఫెక్ట్‌గా సెట్ అయింది. ఇందులో ఆమె కళ్లతోనే నటించింది. లుక్స్ పరంగానూ తెరపై అద్భుతంగా కనిపిస్తుంది. అలాగే విలన్లుగా కనిపించిన ఆడుకాలం నరైన్, బలగం సంజయ్ ల నటన బాగుంది .లక్ష్మణ్ మీసాలా ఫ్రెండ్ కారెక్టర్‌ లో మెప్పిస్తాడు. తనికెళ్ల భరణి, షిజు ఏఆర్, సమ్మెట గాంధీ, బలగం సుధాకర్, సంజయ్ కృష్ణ, హరిశ్చంద్ర ఇంకా ఇందులో నటించిన నటీనటులు అందరూ వారికిచ్చిన పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు
కిరోసిన్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ధృవ వాయు.. ఇప్పుడు “కళింగ” అనే కొత్త కాన్సెప్ట్‌తో హీరోగా, దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించకునేందుకు మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో లవ్, రొమాన్స్, హారర్, థ్రిల్లర్, కామెడీ ఇలా అన్ని రకాల అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాను చూస్తున్న ప్రేక్షకులకు తర్వాత ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ నెలకొనేలా అద్భుతంగా తెరకెక్కించడంలో దర్శకుడుగా ధృవ సక్సెస్ అయ్యాడని చెప్పచ్చు. టెక్నికల్‌ గా ఈ చిత్రం చాలా బ్రిల్లియంట్‌ గా కనిపిస్తుంది. విష్ణు శేఖర మరియు అనంత నారాయణన్ AG లు ఇచ్చిన పాటలు, ఆర్ఆర్ మ్యాజిక్‌ను థియేటర్లో చూడాల్సిందే. చివరి 20 నిమిషాలు విఎఫ్ఎక్స్ వేరే లెవెల్ అని చెప్పవచ్చు. యాకూబ్ డైలాగ్స్ బాగా పేలాయి. అక్షయ్ రామ్ పొడిశెట్టి ఇచ్చిన ఫారెస్ట్ విజువల్స్, భయపెట్టే సీన్లు అద్భుతంగా ఉన్నాయి . నరేష్ వేణువంక ఎడిటర్ పనితీరు బాగుంది. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ లు ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించిన నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి . ఓవరాల్‌గా చెప్పాలంటే కొత్త కంటెంట్ హారర్, థ్రిల్లర్, సస్పెన్స్, లవ్, రొమాన్స్,కామెడీ ఇష్టపడే వారికి మాత్రం “కళింగ “ సినిమా తప్పకుండా నచ్చుతుందని కచ్చితంగా చెప్పవచ్చు.

Cinemarangam.Com Review Rating .. 3.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here