రివ్యూ:ఖైదీ

khaidi-review

మూవీ : ఖైదీ
జానర్‌ : యాక్షన్‌ థ్రిల్లర్‌
నటీనటులు : కార్తీ, నరైన్‌, రమణ, జార్జ్‌ మార్యన్‌ తదితరులు
ఎడిటింగ్‌ : ఫిలోమన్‌ రాజు
సంగీతం : సామ్‌ సీఎస్‌
డైరెక్టర్‌ : లోకేశ్‌ కనగరాజ్‌
నిర్మాతలు : ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, తిరుప్పూర్‌ వివేక్‌
విభిన్న కథలను ఎంచుకోవడంలో కోలీవుడ్‌ యాంగ్రీ హీరో కార్తీ ఎప్పుడూ ముందే ఉంటాడు. ఇప్పటివరకు అతడు తీసిన సినిమాలను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. చినబాబు, ఖాకీ వంటి సినిమాలు మంచి టాక్‌ సొంతం చేసుకున్నప్పటికీ కమర్షియల్‌ హిట్‌ను సాధించలేకపోయాయి. అనంతరం ‍కమర్షియల్‌ హంగులతో వచ్చిన ‘దేవ్‌’ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో కాస్త గ్యాప్‌ తీసుకుని తెలుగు సూపర్‌ హిట్‌ టైటిల్‌ ‘ఖైదీ’తో థియేటర్‌ తలుపులు తట్టాడు కార్తీ. ఖైదీ అనగానే తెలుగు ప్రేక్షకుల అంచనాలు పీక్స్‌లో ఉంటాయి. మరి కార్తీ ఖైదీ ప్రేక్షకుల అంచనాలను అందుకున్నాయా?
కథ
ఆది శంకర్ (హరీష్ ఉత్తమన్) అనే గ్యాంగ్‌స్టర్ తెలుగు రాష్ట్రాల్లోకి అక్రమంగా కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్‌ను తీసుకొస్తాడు. చిత్తూరు నుంచి ఆ డ్రగ్స్‌ను మిగిలి ప్రొంతాలకు తరలించాలని ప్లాన్ చేస్తాడు. అయితే, కొంత మంది పోలీసులు ఆ గ్యాంగ్‌లో అండర్ కవర్ ఆఫీసర్లుగా ఉండటంతో ఆ సరుకు మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ఎస్పీ ఆఫీసులో దాచిపెడతారు.

ఆ డ్రగ్స్‌ను ఎలాగైనా చేజిక్కుంచుకోవాలని, ఇన్ఫార్మర్లుగా ఉన్న పోలీసులను చంపేయాలని ఆది శంకర్ గ్యాంగ్ ప్లాన్ వేస్తుంది. ఇదే సమయంలో జైలు నుంచి విడుదలైన ఢిల్లీ (కార్తి) అనుకోకుండా పోలీసుల దగ్గర ఇరుక్కుంటాడు. అయితే, ఆ పోలీసులకు ఢిల్లీనే దిక్కవుతాడు. ఖైదీ జీవితాన్ని అనుభవించి బయటికి వచ్చిన ఢిల్లీ.. అసలు పోలీసులకు ఎందుకు సాయం చేశాడు? గ్యాంగ్‌స్టర్స్ నుంచి వాళ్లను ఎలా కాపాడాడు అనేదే సినిమా.
విశ్లేషణ:
చాలా కాలంగా కమర్షియల్‌ హిట్‌ లేని కార్తీ ఈ కథను ఓకే చేసి రిస్క్‌ చేశాడనే చెప్పొచ్చు. ఎందుకంటే కామెడీ, హీరోయిన్‌, రొమాన్స్, పాటలు లేకుండా కమర్షియల్‌ హిట్‌ సాధించడం సాధ్యం కాదు. అయితే హాలీవుడ్‌లో ఇలాంటి సినిమాలు మంచి సక్సెస్‌ సాధించాయి. దీంతో ప్రయోగాత్మకంగా యువ దర్శకుడు లోకేశ్‌ను, కథను పూర్తిగా నమ్మి కార్తీ ఈ చిత్రానికి ఓకే చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటివరకు షార్ట్‌ ఫిలిమ్స్‌తో మంచి క్రేజ్‌ తెచ్చుకొని.. సందీప్‌ కిషన్‌తో ‘మానగరం’వంటి హిట్‌ సొంతం చేసుకున్న దర్శకుడు లోకేష్‌ ఈ సినిమాను పూర్తిగా తన భుజస్కందాలపై మోశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here