kiran Abbavaram’s ‘Nenu meeku baga kavalsina vadini’ Movie Pre Release Event Grandly

కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకంపై యంగ్ సెన్సేషన్ హీరో కిరణ్ అబ్బవరం,సంజ‌న ఆనంద్‌, సిధ్ధార్ద్ మీన‌న్‌, ఎస్వి కృష్ణారెడ్డి, బాబా బాస్క‌ర్‌,సోను ఠాగూర్, భరత్ రొంగలి నటీ నటులుగా శ్రీధర్ గాదె దర్శకత్వంలో కోడి రామ‌కృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్న కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ “నేను మీకు బాగా కావాల్సినవాడిని” ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అద్బుత‌మైన సంగీతాన్ని అందిస్తున్నారు. ‘SR కళ్యాణ మండపం’ లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత అదే కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 16న గ్రాండ్ గా 550 థియేటర్స్ లలో రిలీజ్ చేస్తున్న సందర్బంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ప్రి రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన ప్రముఖ నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి ఈ చిత్రంలోని నచ్చావ్ అబ్బాయ్ వీడియో సాంగ్ లాంచ్ చేయగా, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, బింబిసార దర్శకుడు వశిష్ట లు లాయర్ పాపా వీడియో సాంగ్ ను మరియు బిగ్ టికెట్ ని లాంచ్ చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో సమ్మతమే దర్శకుడు గోపి, రాజారవీంద్ర

తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, కరాటే రాజు
తదితరులతో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు.

అనంతరం గెస్ట్ గా వచ్చిన ప్రముఖ నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. కోడి రామకృష్ణ గారు గ్రేట్ లెజెండరీ డైరెక్టర్.ఆయన చెయ్యని జోనర్ లేదు, చెయ్యని సినిమా లేదు. తను డైరెక్టర్ గా 143 సినిమాలు చేయడం అంటే మామూలు విషయం కాదు. తను చాలా మేధావి.తనతో నాకు ముప్పై ఐదు సంవత్సరాల అనుబంధం ఉంది. ఈరోజు నేను ఈరోజు స్టేజి మీద ఉన్నాను అంటే ఆయన వల్లనే.. 2005 లో ఫైనాన్సియల్ గా చాలా ఇబ్బంది పడుతున్న టైంలో ఏం చేయాలో అర్థం కాక కోడి రామకృష్ణ గారి దగ్గరికి వెళ్లి ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నాను అని చెప్పడంతో తను వెంటనే మనం ఒక మంచి సినిమా చేద్దాం అప్పుడు మీ ప్రాబ్లమ్స్ అన్నీ తీరుతాయి అని తనే మంచి స్క్రిప్ట్ రాసి కష్టాల్లో ఉన్న నాకు మంచి సినిమా ఇచ్చాడు అదే “అరుంధతి”.ఆయనతో నేను ఎక్కువ సినిమాలు చేశాను ఒక అరుంధతి,అంజి, అమ్మోరు, తలంబ్రాలు, అంకుశం, ఆహుతి ఇలా ప్రతి సినిమా తనతోనే తీశాను కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడూ నా పక్కనే ఉన్నాడు. తనే నాకు మెంటర్ ఫిలాసఫర్, గైడ్ ఇలా అన్ని తనే నాకు అలాంటి కోడి రామకృష్ణ గారెప్పుడూ నా గుండెల్లో ఉంటాడు.ఇప్పుడు ఆయన వదిలిన ఆస్త్రమే కోడి దివ్య దీప్తి. తను కూడా తండ్రి లాగే మంచి సినిమాలు చేసి సక్సెస్ అవ్వాలి.ఈ నెల 16న వస్తున్న ఈ సినిమా టీంకు ఆల్ ద బెస్ట్ తెలుపుతూ ప్రేక్షకులందరూ ఈ సినిమాను బిగ్ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

 

ఎస్ వి కృష్ణారెడ్డి మాట్లాడుతూ..కోడి రామకృష్ణ గారంటే నాకు చాలా ఇష్టం. అయన బ్యానర్లో సినిమా అనగానే చేయడానికి ముందుకు వచ్చాను. అయితే కథ కూడా చాలా బాగుంది.హీరోయిన్ కు తండ్రి పాత్రలో నటిస్తున్నాను.కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ తో వస్తున్న ఈ సినిమా ప్రత్యేకంగా అన్ని వర్గాల అడియన్స్ ను ఆకట్టుకుంటుంది. ఇందులో కిరణ్ చాలా చక్కగా నటించాడు.నిర్మాత దివ్య గారు చాలా హార్డ్ వర్కర్. తనే అన్ని పనులు చూసుకుంది. మణి శర్మ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు.ఈ నెల 16న వస్తున్న మా సినిమాను అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర నిర్మాత కోడి దివ్య దీప్తి మాట్లాడుతూ.. మమ్మల్ని మా సినిమాను బ్లెస్ చేయడానికి వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. మా డాడీ బ్లెస్సింగ్ తో ఈ ఫస్ట్ స్టెప్ తీసుకున్నాను.అందరూ మా డాడీతో పని చేసినట్లు నాకు చాలా హెల్ప్ చేశారు. మణి శర్మ గారు అద్భుతమైన మ్యూజిక్,ఆర్ ఆర్ ఇచ్చారు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. దర్శకుడు శ్రీధర్ మంచి కథను సెలెక్ట్ చేసుకొని చాలా చక్కగా తెరకెక్కించారు. కిరణ్ గారికి ఓన్లీ థాంక్స్ చెపితే సరిపోదు తన డైలాగ్స్ తో ఈ సినిమాని నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లాడు.ఇందులో తన యాక్టింగ్, డాన్స్, ఫైటింగ్స్, ఎమోషన్స్ సీన్స్ ఇలా ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉంటాయి.అలాగే భరత్, నరేష్ లు ఒక ఫ్యామిలీ మెంబెర్స్ లా చాలా హెల్ప్ చేశారు. భాస్కర్ పట్లగారు, భాను మాస్టర్ కి ఇలా ప్రతి ఒక్క టెక్నిషియన్ అందరూ మాకు చాలా సపోర్ట్ చేశారు ఈ నెల 16న మంచి కమర్షియల్ హిట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను ప్రేక్షకులు అందరూ బ్లెస్స్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. మా సినిమాను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. లెజెండరీ యాక్టర్ కృష్ణం రాజు గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. వారికి మా డీప్ కండోలెన్స్. లెజెండరీ డైరెక్టర్ కోడి రామకృష్ణ గారి బ్యానర్లో నటించడం చాలా సంతోషంగా ఉంది.దర్శకుడు శ్రీధర్ గాదె రాసుకున్న కథను చాలా బాగా తెరకెక్కించాడు. ఫ్యామిలీతో వచ్చి చూసే ఈ సినిమాలో ప్రాపర్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది .సినిమా చూసి ఇంటికి కెళ్లే ప్రతి ఒక్కా అడియన్ ఇందులోని ఎమోషన్ క్యారీ చేస్తారు. సెకండాఫ్ లో బాబా భాస్కర్ తో వచ్చే నా ఎపిసోడ్ కు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా కోసం మా యూనిట్ లో ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు. మా సినిమాతో పాటు రిలీజ్ అయ్యే సినిమాలు అన్ని హిట్ కావాలని కోరుతూ ఈ నెల 16న వస్తున్న మా సినిమా అందరినీ కచ్చితంగా అలరిస్తుందని నమ్ముతున్నాను అన్నారు.

చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలు శ్యాం ప్రసాద్ రెడ్డి గారికి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రాజారవీంద్ర, వశిష్ట,లకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. కోడి రామకృష్ణ గారి సినిమాలు “దేవి” దగ్గర నుంచి “అరుంధతి” వరకు ఆయన సినిమాలు చూసి పెరిగాను.ఇప్పుడు తన కూతురు దివ్య గారితో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. లెజెండరీ డైరెక్టర్ ఎస్ వి కృష్ణారెడ్డి గారి తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇందులో హీరోయిన్ ఫాదర్ గా చాలా బాగా నటించాడు ప్రతి ఒక్కరూ వీరిద్దరి ఎమోషన్ సీన్స్ కి బాగా కనెక్ట్ అవుతారు. ఒక పెద్ద డైరెక్టర్ ని నేను డైరెక్షన్ చేసే టైమ్ లో చాలా టెన్షన్ పడ్డాను. తను నాకు ఫుల్ సపోర్ట్ చేయడమే కాకుండా డైరెక్షన్ లో కొన్ని మెలకువలు నేర్చుకున్నాను. మణిశర్మ గారి సాంగ్స్ విని పెరిగిన నేను నా రెండో సినిమా మణిశర్మ గారితో చేస్తానని నేను అనుకోలేదు తనతో వర్క్ చేయడం చాలా గ్రేట్ ఫీలవుతున్నాను. అద్భుతమైన హిట్ సాంగ్స్ తో పాటు ఎమోషన్ సీన్స్, ఫైట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. నేను ఎడిటర్ అయినా ప్రవీణ్ పూడి గారి ఎడిటింగ్ విషయంలో తెలియని విషయాలు నేర్చుకున్నాను.కిరణ్ అబ్బవరం హీరో కంటే ఒక బ్రదర్ లా తనను చాలా దగ్గరనుండి చూశాను. సెవెన్ ఇయర్స్ బ్యాక్ కిరణ్ చేసిన షార్ట్ ఫిలింకి ఎడిటింగ్ చేశాను. అప్పటి నుండి మా బాండింగ్ స్టార్ట్ అయ్యింది.ఆ తర్వాత ఇద్దరం కలిసి చేసిన షార్ట్ ఫిలింకి మంచి రెస్పాన్స్ వచ్చింది.దాంతో ఒక సినిమా చెయ్యాలని చేసిన సినిమానే “SR కళ్యాణమండపం” అది పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మేము ఈ స్టేజ్ కు రావడానికి చాలా కష్టపడ్డాము. ఇప్పుడొస్తున్న ఈ సినిమా కూడా ఆలాగే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఇందులో కిరణ్ మాస్, క్లాస్ వంటి రెండు షేడ్స్ లలో అద్భుతంగా నటించాడు.బాబా భాస్కర్, కిరణ్ ల ఫన్ ఎలిమెంట్స్ హిలేరియస్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. తన పాత్ర అందరికీ కనెక్ట్ అవుతుంది. హీరోయిన్స్ సంజన ఆనంద్, సోను ఠాకూర్ లు చాలా బాగా నటించారు.భరత్ కూడా ఒక కామెడీ రోల్ చేశారు.టెక్నికల్ టీమ్, నరేష్ గారూ ఇలా అందరు కూడా ఫుల్ సపోర్ట్ చేశారు అన్ని వర్క్ లో సపోర్ట్ చేశారు.

గెస్ట్ గా వచ్చిన హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. నేను ఈ కార్యక్రమానికి రావడానికి కోడి దివ్య గారే కారణం తను చేస్తున్న ఈ సినిమా 100% హిట్ అవ్వాలి. అలాగే పైన ఉన్న అంకుల్ చూసి చాలా హాపీ ఫీలవుతారు అనుకుంటున్నాను. కిరణ్ “SR కళ్యాణమండపం” సినిమాతో తెలుగు రాష్ట్రాలకి అందరికీ కావలసిన వాడయ్యాడు. మళ్లీ ఇప్పుడు వస్తున్న ఈ సినిమా పెద్ద రేంజ్లో హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు

 

గెస్ట్ గా వచ్చిన బింబిసార దర్శకుడు వశిష్ట మాట్లాడుతూ..కోడి రామకృష్ణ గారు ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు తీశారు. వారి తండ్రి లాగే కోడి దివ్య కూడా మంచి కంటెంట్ ఉన్న గొప్ప సినిమాలు చేయాలని కోరుతూ..ఈ నెల 16 న వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు

 

హీరోయిన్ సంజన ఆనంద్ మాట్లాడుతూ.. ఫిమేల్ కి ఎంతో ఇంపార్టెన్స్ ఉన్న ఈ సినిమా నాకు వెరీ స్పెషల్. చూసిన ప్రేక్షకులందరూ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవుతారు. లెజెండరీ డైరెక్టర్ కోడిరామకృష్ణ గారి ప్రాజెక్టు లో నేను సినిమా చేస్తానని అనుకోలేదు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

మరో హీరోయిన్ సోను ఠాకూర్ మాట్లాడుతూ..దివ్య గారు మమ్మల్ని ఒక సిస్టర్ లా ట్రీట్ చేశారు.నా మొదటి సినిమాకి ఇలాంటి మంచి రోల్ చేసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు

లిరిసిస్ట్ భాస్కర్ పట్ల మాట్లాడుతూ..నేను వచ్చిన కొత్తలో కోడి రామకృష్ణ గారి దగ్గర దర్శకత్వ శాఖలో పని చేద్దామనుకున్నాను. కానీ వారి అమ్మాయి దివ్య దీప్తి నిర్మిస్తున్న సినిమాకు మేజర్ సీన్స్ రాసే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కిరణ్ అబ్బవరంతో వరుస సినిమాలు చేస్తున్న నాకు తనతో అన్నదమ్ముల అనుబంధం ఏర్పడింది. మణి శర్మ గారు అద్భుతమైన సంగీతం అందించారు.నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్ అన్నారు

సినిమాటోగ్రాఫర్ రాజ్ కె నల్లి మాట్లాడుతూ..కంటెంట్ ఓరియంటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో వస్తున్న ఈ సినిమా ఉమెన్ పాయింట్ ఆఫ్ లో ఉంటుంది. ప్రేక్షకులకు కావాల్సిన ఆల్ ఎలిమెంట్స్ తో వస్తున్న ఈ సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

కొరియోగ్రాఫర్ భాను మాట్లాడుతూ.. అప్పట్లో ఎన్టీఆర్ గారు బాలయ్య గారు చిరంజీవి గార్ల సెట్ సాంగ్స్ కు మంచి ప్రేక్షకాధరణ లభించేది.మళ్లీ కిరణ్ తో అలాంటి సెట్ సాంగ్స్ చేశాము. వాటికి చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. కిరణ్ చాలా హార్డ్ వర్కర్,కోడి దివ్య గారు టెక్నికల్ గా మాకు ఏం కావాలన్నా అది అన్ని విధాలా సహకరించారు. మంచి కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని అన్నారు.

 

నటుడు సిద్దార్థ్ మీనన్ మాట్లాడుతూ.. మలయాళం ఇండస్ట్రీ లో నేను సింగర్ ని నటుడిని.నాకు తెలుగు సినిమా అన్నా, తెలుగు ఆడియన్స్ అన్నా చాలా ఇష్టం.ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు.

ఇంకా ఈ కార్యక్రమం లో పాల్గొన్న వారందరూ ఈ నెల16 న వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని అన్నారు.

నటీనటులు : కిరణ్‌ అబ్బవరం, సంజన ఆనంద్‌, సోనూ ఠాకూర్‌, సిధ్ధార్ద్‌ మీనన్‌, ఎస్వి కృష్ణారెడ్డి, బాబా భాస్కర్‌, సమీర్‌, సంగీత, నిహరిక, ప్రమోదిని, భరత్‌ రొంగలి తదితరులు

టెక్నికల్‌ టీమ్‌:
సమర్పణ: కోడి రామకృష్ణ
బ్యానర్‌: కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌
లిరిక్స్‌: భాస్కర భట్ల
ఎడిటర్‌: ప్రవీన్‌ పూడి
ఆర్ట్‌ డైరక్టర్‌: ఉపేంద్ర రెడ్డి
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: భరత్‌ రొంగలి
పి.ఆర్‌.ఓ: ఏలూరు శ్రీను, మేఘశ్యామ్‌
సినిమాటోగ్రఫి: రాజ్‌ నల్లి
సంగీతం: మణిశర్మ
కో-ప్రొడ్యూసర్‌: నరేష్‌ రెడ్ది మూలే
ప్రొడ్యూసర్‌: కోడి దివ్య దీప్తి.
డైరక్టర్‌: శ్రీధర్‌ గాదె (ఎస్‌.ఆర్‌.కళ్యాణమండపం ఫేమ్‌)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here