Kvr Group’s ‘Sri Fashion Show’ in women’s day celebrations

మహిళా దినోత్సవం సందర్భంగా కె వి ఆర్ గ్రూపు ఆధ్వర్యంలో స్త్రీ డిజైనర్ ఫ్యాషన్ షో అదుర్స్ అనిపించారు….ఈ కార్యక్రమంలో సినీనటి మాధవి లతా,భోంతు శ్రీదేవి మరియు శ్రీజా రెడ్డి పాల్గొన్నారు.

సంప్ర‌దాయ ఉత్ప‌త్తుల‌ను, సంప్ర‌దాయ క‌ళ‌ల‌ను కాపాడ‌టంతోపాటు వాటికి గుర్తింపు తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని కేవీఆర్ గ్రూపు ప్ర‌య‌త్నిస్తుంది. ఇందులో భాగంగానే మ‌న సంప్ర‌దాయాల‌ను మ‌గువ‌ల‌కు మ‌రింత చేరువ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. కేవీఆర్ సంస్త ఆద్వ‌ర్యంలో మ‌గువ‌ల మ‌న‌సుకు మెచ్చే డిజైన్ల‌ను చేరువ చేసే క్ర‌మంలో స్త్రీ పేరుతో ప్ర‌త్యేక డిజైన‌ర్ స్టోర్‌ను హైద‌రాబాద్ వాసుల కోసం అందుబాటులోకి తీసుకువ‌స్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే మాదాపూర్‌లోని ఎన్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో ఆదివారం రాత్రి ప్ర‌త్యేకంగా రూపొందించిన డిజైన‌ర్ చీర‌ల‌తో ప్ర‌ద‌ర్శ‌న ఫ్యాషన్ షో నిర్వహించారు. విలాస‌వంత‌మైన రాజ‌సాన్ని ప్ర‌ద‌ర్శించే రీతిలో స్త్రీ పేరుతో ఈ ప్ర‌ద‌ర్శ‌న‌ను సైతం ఏర్పాటుచేస్తున్న‌ట్లు వ్య‌వ‌స్థాప‌కులు రామ‌సుబ్బారెడ్డి, మేనేజింగ్ డైర‌క్ట‌ర్ శ్రీ‌జరెడ్డి చిట్టిపోలు అన్నారు. ఉగాది ప‌ర్వ‌దినాన న‌గ‌ర‌వాసుల కోసం స్టోర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్న‌ట్లు తెలిపారు.

బ్రాండ్ గురించి..
విస్తృత శ్రేణి వర్గాలు మరియు సేకరణలతో, మహిళల ప్రీమియం కోచర్ బ్రాండ్ అయిన స్త్రీ మహిళల ఫ్యాషన్‌లోకి కొత్త జీవితాన్ని తీసుకురానుంది. వారు మ‌న‌సు ప‌డే రీతిలో, వారు కోరుకునే రీతిలో డిజైన్ల‌ను తీర్చిదిద్ది అందించే సంస్థ‌గా ఇది ముందుకు రానుంది.

కెవిఆర్ గ్రూప్ గురించి..
ఫ్యాషన్ పరిశ్రమలో కొత్త శకాన్ని సృష్టించడానికి కేవీఆర్ గ్రూపు వ్యవస్థాపకులు రామ సుబ్బారెడ్డి, మేనేజింగ్ డైర‌క్ట‌ర్ శ్రీజారెడ్డి చిట్టిపోలు కెవిఆర్ గ్రూప్ కింద కెవిఆర్ టెక్స్‌టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభించారు. స్టోర్‌లో అత్యుత్త‌మ‌మైన డిజైన్ల‌ను తిల‌కించ‌వ‌చ్చు.

స్త్రీ బృందం స‌భ్యులు వీరే..
అసాధారణమైన నైపుణ్యాలతో ప్రఖ్యాత జాతీయ సంస్థల నుండి పట్టభద్రులైన ప్రొఫెష‌న‌ల్ డిజైనర్లు స్త్రీకి వెన్నుముక‌గా నిలుస్తున్నారు. వారి వినూత్న మరియు స్ఫూర్తిదాయక నైపుణ్యాలు మన హృదయాలకు దగ్గరగా చేస్తాయి.


ఎన్నో వైవిధ్యాలు

ఇక్క‌డ స్టోర్‌లో కాంచీపురం హస్తకళా చీరలు, ప్రీమియం పెళ్లి దుస్తులు, కాశ్మీరీ ఎంబ్రాయిడరీ చీరలు, ఇండో వెస్ట్రన్ లైన్, ప్రింటెడ్, ఫ్యాన్సీ, ఎంబ్రాయిడరీ, వెస్ట్రన్ చీరలు, క్యాజువల్ లైన్, కోచర్ లెహెంగాస్ మరియు సెట్లు, స్టోల్స్ మరియు దుపట్టాలు ఉన్నాయి.

విలాసం.. మీ సొంతం..
మ‌హిళ‌ల ఆహార్యానికి, ఆలోచ‌న‌ల‌కు త‌గిన విధంగా ఇక్క‌డ డిజైన్ల‌ను తీర్చిదిద్దుతున్నారు. ఇందుకోసం న‌గ‌రంలో మ‌రెక్క‌డా లేని విధంగా స్టూడియో ఫిట్టింగ్‌ను అందిస్తున్నారు. ఇక్క‌డ రూ. 7000 /- నుంచి మొద‌లుకొని రూ. 12 ల‌క్ష‌ల ప్రత్యేకమైన ప్రీమియం డిజైనర్ దుస్తులు అందుబాటులో ఉంచాం. మ‌ధ్య త‌ర‌గ‌తి నుంచి విలాస‌వంత‌న‌మైన వారు ఇష్ట‌ప‌డే అన్ని ర‌కాల డిజైన‌ర్ దుస్తుల‌ను వారికి త‌గిన విధంగా తీర్చి దిద్ది అందించ‌నున్నాం. ప్ర‌ధానంగా క్షీణిస్తున్న సాంప్రదాయ చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం, చేతివృత్తుల‌కు విలువ ఇవ్వడం ద్వారా జీవనోపాధిని సృష్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నాం. ఇక్క‌డ సాంప్రదాయ చీరలు చాలావరకు చేతితో నేసినవి మరియు చేతితో ఎంబ్రాయిడరీ చేయబడినవి.

ప్రారంభం
మొత్తంగా, స్త్రి అనేది వారి ఫ్యాషన్‌కి ప్రత్యేకమైన నైపుణ్యాన్ని తీసుకురావడానికి ఇష్టపడే మహిళల కోసం. ఈ పెరుగుతున్న బ్రాండ్ నుండి మీ వార్డ్రోబ్‌కు జోడించడానికి అనేక ప్రత్యేకమైన కార‌ణాలున్నాయి. మార్చి 9 వ తేదీ నుండి ప్రీ-బుకింగ్ కోసం స్త్రీ అందుబాటులో ఉంటుంది. మార్చి 25 వ తేదీ ఉగాది సందర్భంగా స్టూడియోను ప్రారంభించనున్నాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here