KVR Group Team Distributing essential commodities and vegetables to the poor Peoples

కరోనా మహమ్మారిని తరిమికొట్టే నేపథ్యంలో దేశవ్యాప్త లాక్‌డౌన్ అనివార్యం అయింది. దీంతో పేద ప్రజల కష్టాలు ఎక్కువ అయ్యాయి. వలస కార్మికులు, రోజూవారి కూలీల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. పనులు లేక వారు ఇళ్లకే పరిమితం అవడంతో పొట్ట గడవని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో వారిని ఆదుకోవడానికి కొందరు పెద్దమనసుతో ముందుకు వస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా అన్ని పనులు రద్దు కాగా చేతిలో పనులు లేక పేద  అన్ని రకాల కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు . ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులకు కూడా సరుకులు అందజేశారు. వారిని ఆదుకోవడానికి ఇప్పటికే చాలా మంది చాలా రకాలుగా విరాళాలు అందించారు. అయితే ఆ సహాయం మాకు చేసే ఆవకాశం  లభించింది.

అలాంటివారిని ఆదుకోవడానికి మేము సైతం అన్నారు పొలిమేర మరియు కెవిఆర్ గ్రూప్ అందరికి దాదాపు 4000 మందికి పైగా ఈ రోజు  నిజాం పేట, మరియు  మియపూర్, బాచూపల్లి లో నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు పంపిణీ చేశారు.పది రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను అందించారు. పొలిమేర నిర్వాహకులు గణేష్ రెడ్డి మరియు కె వి ఆర్ గ్రూప్ నిర్వాహకులు కేతు రామ సుబ్బారెడ్డి, తదితరులు హాజరై పేద కార్మికులకు సరుకులు అందించారు.

ఈ సందర్భంగా కేతు రామసుబ్బారెడ్డి  మరియు పొలిమేర గణేశ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఇలాంటి సంక్షోభ సమయంలో ఒకరికొకరు అండగా నిలవడం ఎంతో అవసరం. భౌతిక దూరాన్ని పాటిస్తూ సామాజిక స్పృహతో సహాయం చేయడం మన కర్తవ్యంగా భావించాలి’ అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here