Lady Oriented Horror Graphics “O Ammai Crime Story” Movie Review

Release date :-April 30,2021
Cinema rangam :- Rating 3/5
Movie Name :- “O Ammai Crime Story”
Banner :- Chinna Productions
Cast : – Keerthi Chawla, Sadhika, Adhi Prem, Kavitha, Ravali, Shriman, Gautam Raju, Rahesh and Neelgal Ravi etc.
Editor :- Menaga Srinu
P.R.O: – Madhu V.R
Producers :- AB.Srinivas, R.Sunder, Sridhar Pothuri, Shakamudra Sridhar
Director : – G. Surender Reddy

చిన్నా ప్రొడక్షన్స్ పతాకంపై కీర్తి చావ్లా ప్రధాన పాత్రలో సాధికా, ఆధీ ప్రేమ్, కవిత, రవళి, శ్రీమాన్, గౌతమ్ రాజు మరియు నీలగల్ రవి నటీనటులుగా జి.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏబి.శ్రీనివాస్, ఆర్.సుందర్, శ్రీధర్ పోతూరి, శాకముద్ర శ్రీధర్ లు సంయుక్తంగా నిర్మించిన లేడీ ఓరియెంటెడ్ హర్రర్ గ్రాఫిక్స్ చిత్రం “ఓ అమ్మాయి క్రైమ్ స్టోరీ”. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని కరోనా ప్యాండమిక్ స్విచ్ వేషన్ లో కూడా దైర్యంగా ఈ నెల 30 న ప్రేక్షకుల ముందుకొచ్చిన “ఓ అమ్మాయి క్రైమ్ స్టోరీ” సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ
రామచంద్ర(అదీ ప్రేమ్),కవిత లకు ఒక్కగానొక్క కొడుకు ఆనంద్(శ్రీమాన్) కు కీర్తి చావ్లా తో పెళ్లి జరుగుతుంది. ఆనంద్ తండ్రి రామచంద్ర చేసిన రెండు లక్షలు అప్పు తీర్చడానికి సిటీలో ఉద్యోగం చేయడానికి వస్తాడు.ఉద్యోగం వెతికే క్రమంలో కార్ల కంపెనీ ఓనర్ (సాధిక)దగ్గర పని చేసే అకౌంట్ మేనేజర్ ఐదు లక్షలు డ్రా చేసుకొని వస్తుంటే బ్యాగ్ పడిపోయి ఆనంద్ కు దొరుకుతుంది. ఆ డబ్బును తను పనిచేస్తున్న కార్ల కంపెనీ కు వెళ్లి పోగొట్టుకున్న వక్తికి డబ్బును తిరిగి ఇస్తాడు ఆనంద్. అది చూసిన సాధిక అతని సినియార్టీ నచ్చి ఆనంద్ ను ఇష్టపడి తనకు ఉద్యోగం ఇస్తుంది . అప్పు ఉందని చెపితే అడ్వాన్స్ గా రెండు లక్షల డిడి ఇస్తుంది. ఉద్యోగం వచ్చిందనే ఆనందంలో ఊరికి ఫోన్ చేసి భార్యకు చెపుతాడు.దాంతో కీర్తి చావ్లా పట్నంకు వస్తుంది. అక్కడ తన భర్త సాధిక తో క్లోజ్ గా ఉండడం చూసి కొపంతో సాధికను అవమాన పరచి ఇంట్లోనుండి బయటకు గెంటేస్తుంది.ఆ అవమానం తట్టుకోలేక కీర్తి చావ్లా నుండి ఆనంద్ ను విడగొట్టి ఎలాగైనా ఆనంద్ ను దక్కించుకోవాలని ప్లాన్ చేస్తుంది సాధిక. సాధిక ఇంట్లో పనిచేసే సర్వెంట్ అకస్మాత్తుగా చనిపోతాడు. అతన్ని ఆనంద్ చంపినట్లు ఉన్న ఫొటోస్ చూపించి ఆనంద్ కు జైలు శిక్ష తప్పదు. కాబట్టి మీరిద్దరూ నేను చెప్పినట్లు వింటే ఆనంద్ ను కాపాడతానని.. ఇక నుండి ఆనంద్ నాతోనే ఉండాలని కండిషన్ పెడుతుంది. అలాగే ఈ రాత్రికి నా దగ్గరికి పంపమని కీర్తి చావ్లాకు చెప్పి వెళుతుంది. ఆ రాత్రి సాధిక ఇంటికెళ్లి వచ్చిన తరువాత సాధిక హత్యకు గురైతుంది. ఆనంద్ ను పోలీస్ లు అరెస్ట్ చేస్తారు. సాధిక ను ఎవరు హత్య చేశారు ? అలాగే సాధిక ఇంట్లో పనిచేసే సర్వెంట్ ఎలా చనిపోయాడు?సాధికను చంపాల్సిన అవసరం ఎవరికుంది ?ఆమెను ఎవరు చంపారు ? అమాయకుడైన ఆనంద్ జైలునుండి నిర్దోషిగా బయటికి వచ్చాడా? లేదా? ఇవన్నీ తెలుసుకోవాలంటే థియేటర్ కు వెళ్లి “ఓ అమ్మాయి క్రైమ్ స్టొరీ” సినిమా చూడవలసిందే…

నటీనటుల పనితనం
ఈ సినిమాలో నటించిన కీర్తి చావ్లా, సాధిక, శ్రీమాన్, ఆధీ ప్రేమ్, కవిత, రవళి, గౌతమ్ రాజు ,రాజేష్ మరియు నీలగల్ రవి అందరూ చాలా బాగా నటించారు. హీరోగా నటించిన ఆనంద్(శ్రీమాన్) చాలా మంచి ఫర్మార్మెన్స్ చూపించాడు.ఇక కీర్తి చావ్లా, సాధిక లు చూపించిన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ తరం నాయికల్లో ఇలాంటి క్యారెక్టర్ చేసేందుకు తనకే గట్స్ ఉన్నాయని ప్రూవ్ చేశారు. చాలా రోజుల తరువాత ఈ సినిమాలో రవళి చక్కగా నటించింది. ఇంకా ఈ సినిమాలో నటించిన కమెడియన్స్ అందరూ కామెడీ తో ప్రేక్షకులను ఏంటర్ టైన్ చేశారు.మిగిలిన వారంతా సహజమైన పాత్రలతో చాలా చక్కగా నటించారు. ఓ అమ్మాయి క్రైమ్ స్టోరీ చిత్రం కూడా సినిమా చూస్తున్నంతసేపూ సహజమైన అనుభూతినే కలిగిస్తుంది.

సాంకేతిక నిపుణుల పనితనం
నిర్మాతలు ఏబి.శ్రీనివాస్, ఆర్.సుందర్, శ్రీధర్ పోతూరి, శాకముద్ర శ్రీధర్ లు సినిమాను ఎక్కడా రాజీ పడకుండా గ్రాండ్ గా నిర్మించారు.సినిమాటోగ్రఫీ బాగుంది. బడ్జెట్ లో కథను బాగా తెరమీద ఆవిష్కరించారు. సంగీత దర్శకుడు అందించిన పాటలతో పాటు నేపధ్య సంగీతం అద్భుతంగా ఇచ్చాడు. కొన్ని ఎలివేషన్స్ ఎపిసోడ్స్ లో రీరికార్డింగ్ సూపర్ గా ఉంది. ఎడిటర్ మేనగ శ్రీను షార్ట్ అండ్ స్వీట్ గా కట్ చేసాడు. దర్శకుడు జి సురేందర్ రెడ్డి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి వరకు మేకింగ్ లో తన ప్రత్యేకత చూపించారు. ప్రతి సీన్ తన కథ మీదున్న పట్టును, క్రియేటివ్ స్క్రీన్ ప్రెజెన్స్ ను చూపిస్తూ కథను గందరగోళం లేకుండా కంప్లీట్ గా పర్ఫెక్ట్ గా క్లైమాక్స్ వరకు లీడ్ చేశాడు. దర్శకుడు జి.సురేందర్ రెడ్డి ఇంటర్వెల్ ట్విస్ట్, సెకండ్ హాఫ్ లోని కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆడియన్స్ ను కట్టిపడేస్తాయి. యువతకు కావాల్సిన అంశాలతో పాటు సినిమాలో అన్ని ఏజ్ గ్రూప్స్ వారు చూసే విధంగా కథ కథనాలు ఉండడం మరో హైలెట్. ఎక్కడా బోరింగ్ లేకుండా ఉన్న ఈ మూవీని రెండు గంటలు ఎంజాయ్ చెయ్యవచ్చు. మంచి సినిమా చూడాలి అనుకున్న వారు ఖచ్చితంగా “ఓ అమ్మాయి క్రైమ్ స్టొరీ” సినిమాను ఇష్టపడతారు.

Cinema rangam.com Review Rating 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here