Live Music Performance with Indian Idol top singers in Hyderabad from September to October

హైద‌రాబాద్‌లో ఇండియన్ ఐడ‌ల్ టాప్ గాయ‌కుల‌తో ప్ర‌త్య‌క్ష సంగీత కార్య‌క్ర‌మం

ఎలెవన్ పాయింట్ టూ(11.2) & మెటాలాయిడ్ ప్రొడక్షన్స్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ రివైవ్ కన్సర్ట్ సిరీస్

ఇండియ‌న్ ఐడిల్‌లో విజేత‌గా నిలిచిన ప‌వ‌న్‌దీప్ రాజ‌న్, తెలుగ‌మ్మాయి ష‌ణ్ముక ప్రియ‌తోపాటు మ‌రో ఇద్ద‌రు గాయకుల‌తో హైద‌రాబాద్‌లో తొలిసారిగా ప్ర‌త్య‌క్ష సంగ‌త కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించేందుకు 11.2, మెట‌లాయిడ్ ప్రొడ‌క్ష‌న్స్ ఈవెంట్ ఆర్గ‌నైజ్డ్ సంస్థ‌లు నిర్వ‌హించ‌ నున్నాయి. కొవిడ్ నేప‌థ్యంలో దాదాపు 18నెల‌ల సుదీర్ఘ విరామం త‌రువాత ప్ర‌త్య‌క్ష సంగీత క‌చేరిల‌కు ఇదే తొలి వేదిక కానుంది. రివైవ్ కన్స‌ర్ట్ సిరీస్ పేరుతో ఇప్పుడు అభిమానుల ముందుకు తిరిగి వ‌స్తున్నాం. ఈ సెప్టెంబ‌రు నుంచి బ్యాండ్‌, సింగ‌ర్‌, మ్యుజీషియ‌న్‌లతో క‌లిసి సెప్టంబ‌ర్ నుంచి అక్టోబ‌ర్ వ‌ర‌కు ప్ర‌తి వారం ప్ర‌ద‌ర్శ‌న‌కు సిద్దమ‌వుతున్నాం.

ఈ సంద‌ర్భంగా మెటలోయిడ్ ప్రొడక్షన్ ప్ర‌తినిధి ప్రీతిష్ కోలాటి మాట్లాడుతూ.. ఇది రెండో ద‌శ సంగీత వేదిక‌గా మీము భావిస్తున్నాం. ప్ర‌తిభావంతులైన క‌ళాకారుల‌ను మీముందుకు తీసుక‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాం. ఇందులో భాగంగానే కేర‌ళ‌కు చెందిన తైక్కుడం బ్రిడ్జ్‌, మ‌సాలా కాఫీ, ఇండియ‌న్ ఐడిల్ షోలో ఫైన‌లిస్టుల‌ను ఈ వేదిక‌పైకి తీసుకొస్తున్నాం. తైక్కుడం బ్రిడ్జ్ క‌ళాకారుల ఆధ్వ‌ర్యంలో సెప్టెంబ‌ర్ 2న, ఇండియ‌న్ ఐడ‌ల్ విజేత ప‌వ‌న్‌దీప్ రాజన్‌తో సెప్టెంబ‌రు 3న హార్ట్‌క‌ప్‌లో ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించేందుకు సిద్ద‌మ‌వుతున్నాం. ఈ సిరీస్‌లో దేశంలోని అత్యుత్త‌మ‌మైన సంగీత‌కారుల‌తోపాటు గాయ‌కులు పాలుపంచుకొని అబిమానుల‌ను ఉర్రూత‌లుగించ‌నున్నారు.

ఇండియన్ ఐడల్ విజేత పవణ్‌దీప్ రాజన్, మొదటి రన్నరప్ అరుణిత కంజిలాల్, రెండవ రన్నరప్ సైలి, మూడవ రన్నరప్ మొహమ్మద్ డానిష్ మరియు రాక్‌స్టార్ షణ్ముఖ ప్రియ బంజారాహిల్స్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో రివైవ్ కచేరీ సిరీస్ ప్రదర్శన (సెప్టెంబర్ నుండి అక్టోబర్ వరకు)కు సంబంధించిన వివ‌రాలు, ప్ర‌ద‌ర్శ‌న జ‌రిగే ప్రాంతాలు ఇలా ఉన్నాయి.

1. సెప్టెంబర్ 2 – తైకుద్దం బ్రిడ్జ్ మ్యూజిక్ బ్యాండ్ (ప్రిజం, గచ్చిబౌలి) వద్ద
2. సెప్టెంబర్ 3 – ఇండియన్ ఐడల్ పవన్ దీప్ రాజన్ (హార్ట్ కప్ కాఫీ, గచ్చిబౌలి)
3. సెప్టెంబర్ 23 – మసాలా కాఫీ మ్యూజిక్ బ్యాండ్ (ప్రిజం, గచ్చిబౌలి) వద్ద
4. అక్టోబర్ 1 – ఇండియన్ ఐడల్ షణ్ముఖ ప్రియ (గ్రీజ్ మంకీ క్లబ్, జూబ్లీహిల్స్)
5. అక్టోబర్ 2 – చిన్మయి + కాప్రిసియో
6. అక్టోబర్ 9 – వద్ద స్టాక్కాటో కాంటెంపోరే క్లాసిక్ బ్యాండ్
7. అక్టోబర్ 15 – శోభన (రవీంద్ర భారతి) వద్ద
8. అక్టోబర్ 23 – ఇండియన్ ఐడల్ టాప్ 5 (హార్ట్ కప్ కాఫీ గచ్చిబౌలి)
9. అక్టోబర్ 30 – అవియల్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here