Love‌, Emotional, Message Oriented ‘Nallamala’ Movie Review

Cinemarangam.com
రివ్యూ రేటింగ్..3/5
బ్యానర్ : నమో క్రియేషన్స్
సినిమా : ”నల్లమల”
నిర్మాత: ఆర్.ఎమ్
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రవి చరణ్
నటీన‌టులు: అమిత్ తివారి, భానుశ్రీ‌, నాజ‌ర్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, అజ‌య్ ఘోష్‌, కాశీ విశ్వ‌నాథ్‌, కాల‌కేయ ప్ర‌భాక‌ర్‌, ఛలాకీ చంటి, శుభోద‌యం రాజ‌శేఖ‌ర్‌, చ‌త్ర‌ప‌తి  శేఖ‌ర్‌, ముక్కు అవినాష్‌, శేఖ‌ర్ అలీ, అరోహి నాయుడు, అసిరి శ్రీ‌ను తదితరులు
సినిమాటోగ్రఫీ: వేణు మురళి
సంగీతం, పాటలు: పి.ఆర్
ఎడిటర్: శివ సర్వాణి
ఆర్ట్:  పీవీ రాజు
ఫైట్స్: నబా
స్టైలిస్ట్‌: శోభ ర‌విచ‌ర‌ణ్‌
విఎఫ్ఎక్స్: విజయ్ రాజ్
పిఆర్ఓ – శ్రీ‌ను – సిద్ధు

నల్లమల అడవి నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటికి భిన్నంగా ఆ అడవి చుట్టూ నల్లమల అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్నో చీకటి కోణాలను, సామాన్య జనానికి తెలియని అవినీతి ఒప్పందాల నేపథ్యంలో ఆస‌క్తిక‌ర క‌థా క‌థ‌నాల‌తో తెర‌కెక్కిన చిత్రం `న‌ల్ల‌మ‌ల‌’.అమిత్‌ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్‌ ఘోష్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ద్వారా రవి చరణ్ ‌దర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఆర్‌.ఎమ్‌ నిర్మించారు . ఈ మూవీ లోని సిద్ శ్రీ‌రామ్ పాడిన ‘ఏమున్న‌వే పిల్లా’ సాంగ్ కు 40 మిలియ‌న్స్ పైగా వ్యూస్ సాధించి సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. అంతే కాకుండా ఆ పాట‌కు ల‌క్ష‌కు పైగా క‌వ‌ర్‌సాంగ్స్ రావ‌డం విశేషం. అలాగే ఈ చిత్రం నుండి విడుద‌లైన అన్ని పాట‌లు మిలియ‌న్ల వ్యూస్ సాధించ‌డం ఆడియ‌న్స్‌లో ఈ సినిమా క్రేజ్‌ను తెలియ‌జేస్తున్నాయి.మార్చి 18 న ఎంతో గ్రాండ్ గా థియేటర్స్‌ లో రిలీజ్ అయిన ఈ చిత్రం  ప్రేక్షకుల్ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో రివ్యూలో చూద్దాం పదండి

కథ
నల్లమల అటవీ ప్రాతంలో నల్లమల(అమిత్ తివారి) జన్మించినపుడే తన ఇంట్లో ఉన్న ఆవు కూడా ఒక  లేగ దూడకు జన్మిస్తుంది. దాంతో నల్లమల కూడ ఆ లేగదూడను ఏంతో అటాచ్మెంట్ పెంచుకొని సొంత అన్నగా భావిస్తూ తను ఏది తిన్నా దాంట్లో సగం ఆ లేగదూడకు పెడుతుంటాడు. ఆ అటవీ ప్రాంతంలో ఉండే ప్రకృతిని, సాధు జంతువులను ప్రేమిస్తూ తనగూడెం లో నివాసం ఉంటున్న వారికి సహాయం చేస్తుంటాడు. అదే గూడెంలో వుండే వనమాలి (బానుశ్రీ)ని ఎంతో ప్రాణంగా ప్రేమిస్తుంటాడు..ఒక రోజు వనమాలితో ఏకాంతంగా మాట్లాడుతుంటే ఫారెస్ట్ అఫిసర్ కాలకేయ ప్రభాకర్ వచ్చి నల్లమలని అరెస్ట్ చేసి జైల్లో వేస్తాడు.ఆ తరువాత రోజు జైలు నుండి బయటకు వచ్చే లోపే సొంత అన్నలా బావిస్తున్న తన లేగదూడ తో పాటు అనేకమైన అవులు వుండే పాక కాలి బూడిదై పోయింటుంది. అందులో ఉన్న ఆవులు అన్ని చనిపోతాయి.మరో వైపు ఇరాన్ దేశంలో నివసించే తెలుగువాడైన నాజర్ సైంటిస్ట్ గా ఎన్నో ప్రయోగాలు చేస్తుంటాడు. ప్రపంచాన్ని శాసించే శక్తి తన పరిశోధనలకు ఉండాలన్నదే తన లక్ష్యం. ప్రయోగం మంచిదా చెడుదా అనేది అతనికి అనవసరం. తన ప్రయోగాలకు నల్లమలను క్షేత్రంగా ఎంచుకుని అక్కడ ప్రయోగాలు చేస్తూ కొన్ని చీకటి వ్యాపారాలు చేస్తుంటాడు. ఆ తరువాత  నల్లమలలో సామాన్య జనానికి తెలియని చీకటి కోణాలను,అక్కడ జరుగుతున్న కొన్ని సంఘటనలు విన్న నల్లమల (అమిత్ తివారి) అటవీ ప్రాంతంలో అక్రమ వ్యాపారం చేసేవారికి ఎదురు తిరుగుతాడు..ఆ నల్లమల అటవీ ప్రాంతంలో జరిగే అక్రమ వ్యాపారం ఏమిటి? అది ఎందుకు చేస్తున్నారు? నాజర్ నల్లమల లో ఏం ప్రయోగాలు చేశాడు. ఏం కనుగొన్నాడు..ఆ ప్రయోగాల ఫలితంగా ఏం జరిగింది.గిరిజనుడైన “నల్లమల” దాన్ని ఎందుకు ఎదిరించాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల పనితీరు
ఇప్పటి వరకు అమిత్ తివారిని  విలన్ గా చూశాము. తివారి హీరోగా ఎంచుకొన్న కథ బాగుంది. అన్ని రకాల ఎమోషన్స్ పండించే ఆస్కారం దొరికింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలలో అమిత్ అదరగొట్టాడు. భాను శ్రీ గ్లామర్ పరంగా, డ్యాన్సుల పరంగా ఆకట్టుకొంది. కొన్ని సీన్లలో భాను శ్రీ నటన, స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. ఇరాన్ దేశంలో నివసించే తెలుగువాడైన సైంటిస్ట్ పాత్రలో నాజర్ చాలా చక్కగా నటించాడు. నక్సలైట్ (చత్రపతి శేఖర్),అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్, నాజర్, తనికెళ్ల భరణి పాత్రలు చక్కగా కుదిరాయి. ఇంకా మిగిలిన నటీనటులు అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణులు
ఆవు అమ్మ లాంటిది దాన్ని కాపాడు కోకపోతే మనుగడలేదు అనే కాన్సెప్ట్ తీసుకొని ఆవు చుట్టూ తిరిగే భావోద్వేగమైన పాయింట్‌ను దర్శకుడు తీర్చిదిద్దిన విధానం చక్కగా కుదిరింది.మంచి మెసేజ్ ఇస్తూ లవ్ ఎంటర్‌టైనర్‌ని ఎంచుకుని ఎక్కడా వల్గారిటీకి తావులేకుండా క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దారు.   మొదటి సినిమా అయినా ఎక్కడా ఆ ఫీలింగ్ కలగదు. ఒక అనుభవజ్ఞుడైన దర్శకుడిలా మంచి ప్రతిభను కనబరిచారు. ఫస్ట్ సినిమాకే నల్లమల లాంటి భలమైన కథను ఎంచుకొని కొత్త కాన్సెప్ట్ తో చాలా చక్కని సినిమా తీశాడు . నల్లమల సినిమాకు బ్యాక్ గ్రౌండ్, బీజీఎంతో కొన్ని సీన్లు బాగా ఎలివేట్ అయ్యాయి.లవ్‌, ఎమోషనల్‌ సీన్స్,యాక్షన్ సీన్లు, సినిమాకి ప్లస్‌ పాయింట్స్ .ఇప్పటి వరకూ సిధ్ శ్రీరామ్ పాడినవన్నీ మెలోడీయస్ గీతాలే. భారతీయ సంగీతంతో పాటు పాప్ మ్యూజిక్ లోనూ ప్రవేశం ఉన్న సిధ్ శ్రీరామ్ ఫస్ట్ టైమ్ ఓ ఫోక్ సాంగ్ పాడాడు.తను ఇప్పటి వరకూ పాడిన పాటలకు ఎంతోమంది అభిమానులున్నారు. అలాంటి వారందరినీ ఆశ్చర్యపరుస్తూ ‘నల్లమల’ చిత్రంలో ‘‘ఏమున్నావే పిల్లా ఏమున్నావే.. అందంతో బంధించావే’’ అంటూ సాగే అందమైన జానపదాన్ని అంతే అందంగా ఆలపించి శభాస్ అనిపించు కున్నాడు. ఈ పాట తెర మీద కూడ అంతే ఎఫెక్టివ్‌గా కనిపించింది.అటవీ అందాలను సినిమాటోగ్రాఫర్ వేణు మురళి తన కెమెరాలో చక్కగా బంధించాడు.విజువల్స్ రిచ్‌గా కనిపిస్తున్నాయి.శివ సర్వాణి ఎడిటింగ్  క్లాసీగా వుంది.నల్లమల సినిమా విషయానికి వస్తే.. అటవీ ప్రాంతంలో జరిగే అన్యాయాలు, వాటిని ఎదురించిన గిరిజన యువకుడి కథగా రూపొందింది. కథ, కథనాలు గ్రామీణ వాతావరణం, నేటివిటి సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా మరింత బాగా నచ్చుతుంది.భారీ సినిమాలు, స్టార్ హీరోల సినిమాల స్థాయిలో నిర్మాత ఆర్.ఎమ్ నమో క్రియేషన్స్ పై ఈ సినిమాను రాజీపడకుండా మంచి క్వాలిటీతో ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించారని చెప్పొచ్చు. . ఈ ”నల్లమల” సినిమాను పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఎంజాయ్ చేయచ్చు. చూసిన వారందరికీ తప్పక నచ్చుతుంది.

           Cinemarangam.  Review Rating  3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here