Love, Action & Emotional Entertainar ‘Jetty’ Movie Review

Cinemarangam.Com
సినిమా : జెట్టి
రివ్యూ రేటింగ్ : 3.5/5
విడుదల తేదీ : నవంబర్ 04, 2022
బ్యానర్ : వర్దిని ప్రొడక్షన్స్
నిర్మాత : కే వేణు మాధవ్
దర్శకత్వం : సుబ్రహ్మణ్యం పిచ్చుక
నటీనటులు : తేజశ్వని బెహెర, M.S. చౌదరి, జీ కిషోర్, గోపి, జీవ, మాన్యం కృష్ణ, శివాజీ రాజా, సుమన్ శెట్టి, నందిత శ్వేతా.
సంగీతం : కార్తీక్ కొడకండ్ల

వర్ధిన్ ప్రోడక్షన్స్ బ్యానర్‌పై వేణు మాధవ్ కే నిర్మాతగా, సుబ్రమణ్యం పిచ్చుక దర్శకత్వంలో రూపొందిన చిత్రం జెట్టి. మాన్యం కృష్ణ, నందితా శ్వేత జంటగా, శివాజీ రాజా, కన్నడ కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్ 4న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్  అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించిందో రివ్యూ లో చూద్దాం పదండి 

కథ
కొన్ని వందల గ్రామాల్లోని వేల మత్స్యకారుల కుటుంబాల పోరాటం ఒక గోడ. ఈ గోడ పేరే జెట్టి. జెట్టి అంటే సముద్ర తీర ప్రాంతాన్ని, సముద్రాన్ని కలిపే వంతెనను జెట్టి అంటారు. అయితే చాలా కాలం నుండి ప్రపంచానికి మారుమూల బ్రతికే మత్స్యకారుల కఠినమైన‌ కట్టుబాట్లు, వారి జీవనశైలి, ఆచారాలను నమ్ముకుని జీవనాన్ని సాగిస్తున్న ఆ గ్రామ ప్రజలకు కట్టుబాట్లు ఎక్కువ. ఆ చుట్టుపక్కల గ్రామ ప్రజలకు పెద్దగా ఉండే జాలయ్య (ఎంఎస్‌ చౌదరి) వారి కట్టుబాట్లను కాపాడుతూ జాలర్లకు సపోర్ట్ గా నిలస్తుంటాడు. అయితే తరచూ ఆ గ్రామానికి చెందిన మత్స్య కారుల బోట్స్ తుపానుల తాకిడికి కొట్టుకు పోయి నష్టాలను తెస్తుంటాయి.అయితే అందరూ కలసి కట్టుగా ఉండి ఎలాగైనా జెట్టి నిర్మించుకుంటే మనందరి జీవితాలు బాగుపడతాయని ఆ ప్రాంత ఎమ్మెల్యే దశరథ రామయ్య(శివాజీ రాజా)దగ్గరికెళ్లి జెట్టీ ని నిర్మించమని విజ్ఞప్తి చేసుకుంటారు.అయితే మా పార్టీ అధికారం లో లేదు కాబట్టి తాను జెట్టిని నిర్మించలేనని చెపుతాడు. ఈ జెట్టి నిర్మిస్తే మత్స్యకారులు మమ్మల్ని ఎదిరిస్తారని జెట్టీ నిర్మించ కూడదని విలన్ (మైమ్ గోపి ) అడ్డు పడుతూ ఉంటాడు. అదే ఆ గ్రామానికి టీచర్ గా వచ్చిన శ్రీ (కృష్ణ మాన్యం) గ్రామ ప్రజలకు సపోర్ట్ గా నిలుస్తుంటాడు. అయితే జాలయ్య కూతురు మీనాక్షి( నందిత శ్వేత) ను చూసిన మొదటి చూపులోనే శ్రీ ప్రేమలో పడతారు. ఆలా ప్రేమించు కొన్న వీరిద్దరూ ఎవరికీ చెప్పకుండా ఆ ఊరి కట్టుబాట్లను దిక్కరించి ఆ గ్రామం నుండి పారిపోతారు. అందరికీ కట్టుబాట్లు చెప్పే ఉరి పెద్ద జాలయ్య తన కూతురు ఆలా వెళ్లడంతో అవమానంగా భావిస్తాడు. ఆలా వెళ్ళిపోయిన కూతురిని జాలయ్య ఏం చేశాడు? అలాగే ఎప్పటినుండో జెట్టి కోసం పోరాటం చేస్తున్న ఆ ఊరి గ్రామ మ‌త్స్య‌కారులు పోరాటం చేసి జెట్టిని సాధించుకున్నారా.. లేదా.. అనేది తెలుసుకోవాలంటే తప్పకుండా జెట్టీ సినిమా చూడాల్సిందే..

నటీనటుల పనితీరు
హీరో గా నటించిన కృష్ణా మాన్యం స్కూల్ టీచర్ గా చాలా చక్కటి అభినయాన్ని ప్రదర్శించాడు.తను చేసిన ఫైట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. పల్లెటూరు అమ్మాయిగా నందితా శ్వేత చక్కటి నటనతో మెప్పించింది. ఆ ఊరి పెద్దగా నటించిన ఎమ్మెస్ చౌదరి జాలయ్య పాత్రకు ప్రాణం పోశాడు.రాజకీయ నాయకుడి పాత్రలో శివాజీ రాజా బాగానే చేశాడు..విలన్ గా నటించిన మైమ్ గోపి, తేజశ్విని, కన్నడ కిషోర్ తదితరులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణుల పనితీరు
కొన్ని వేల మత్స్యకార కుటుంబాలు చాలా కాలం నుండి వస్తున్న ఆచారాలను నమ్ముకుని జీవనాన్ని సాగిస్తున్న వారి జీవితాలను దృష్టిలో ఉంచుకొని దర్శకుడు సుబ్రహ్మణ్యం పిచ్చుక రాసుకున్న కథ, కథనాలతో చాలా రియలిస్టిక్ అప్రోచ్ తో తెరమీదకు తెచ్చిన విధానం ప్రేక్షకులని కట్టి పడేస్తాయి అని చెప్పవచ్చు..మత్స్యకారుల జీవనశైలిని ,వారి కట్టుబాట్ల గురించి ఈ కథలో చక్కగా చూపించారు.ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులను ఎంతో  భావోద్వేగం కలిగిస్తుంది. అలాగే కథలో మట్టివాసనలు తెలుస్తాయి. తండ్రి,కూతుళ్ల మధ్య ఉండే  ఓ ఎమోషనల్ బాండింగ్‌ కంటతడి పెట్టిస్తుంది. ఈ సినిమా లోని ప్రతీ అంశం బాగా ఆకట్టుకుంటోంది. కార్తీక్ కొడగండ్ల సంగీతం బాగుంది.  సిద్ శ్రీరామ్ పాడిన పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ పనితీరు బాగుంది.ఈ చిత్ర విజువల్స్ చూస్తున్న ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తాయి.వర్థని  ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత కే వేణు మాధవ్ నిర్మించిన “జెట్టీ” సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ చిత్రాన్ని నమ్మి థియేటర్స్ కు వచ్చిన అన్ని వర్గాల ప్రేక్షకులకు మాత్రం “జెట్టీ” సినిమా కచ్చితంగా నచ్చుతుంది అని చెప్పవచ్చు.

Cinemarangam com Review Rating..3.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here