Love and Family Entertainer “Khushi” Movie Review

Cinemarangam.Com
బ్యానర్ : మైత్రీ మూవీస్
సినిమా : “ఖుషి “
రివ్యూ రేటింగ్ : 3/5
విడుదల తేదీ : 01.09.2023
నిర్మాతలు : నవీన్ యేర్నేని,రవిశంకర్ యలమంచిలి
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం, కొరియోగ్రఫీ : శివ నిర్వాణ.
నటీనటులు: విజయ్ దేవరకొండ, సమంత, జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, శరణ్య పొన్ వణ్నన్, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : దినేష్ నరసింహన్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : జి.మురళి
మ్యూజిక్ డైరెక్టర్ : హిషామ్ అబ్దుల్ వాహబ్
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
మేకప్ : బాషా
కాస్ట్యూమ్ డిజైనర్స్ : రాజేష్, హర్మన్ కౌర్, పల్లవి సింగ్
ఆర్ట్ : ఉత్తర కుమార్, చంద్రిక
ఫైట్స్ : పీటర్ హెయిన్
రచనా సహకారం : నరేష్ బాబు.పి
పి.ఆర్.వో : జి.ఎస్.కె మీడియా
పబ్లిసిటీ : బాబ సాయి
మార్కెటింగ్ : ఫస్ట్ షో
ప్రొడక్షన్ డిజైనర్ : జయశ్రీ లక్ష్మీనారాయణన్
డి.ఐ, సౌండ్ మిక్స్ ః అన్నపూర్ణ స్టూడియోస్, విఎఫ్ఎక్స్ మాట్రిక్స్
సి.ఇ.ఓ : చెర్రీ


రీసెంట్ టైమ్స్ లో మరే తెలుగు సినిమాకు రానంత బజ్ తెచ్చుకుంటోంది విజయ్ దేవరకొండ, సమంత పెయిర్ గా నటించిన ‘ఖుషి’. వీరిద్దరి కాంబినేషన్ లో ప్రేక్షకులను సిల్వర్ స్క్రీన్ పై అలరించేందుకు సిద్ధమైన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రాన్ని మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. దర్శకుడు శివ నిర్వాణ రూపొందించారు. ఈ సినిమా రిలీజ్ కోసం సినీ ప్రియులతో పాటు విజయ్, సమంత ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. టీజర్, పాటలు, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా మీద మరింతగా అంచనాలు పెరిగాయి.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 1న పాన్ ఇండియా మూవీగా గ్రాండ్ గా రిలీజ్ అయిన ఖుషి సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి.


కథ
రోమాంటిక్ కామెడీగా మొదలై, రోమాంటిక్ డ్రామాగా మారే సీరియస్ కథే “ఖుషి “.విప్లవ్ (విజయ్ దేవర్ కొండ) బిఎస్ఎన్ఎల్ లో కాశ్మీర్ లో జాబ్ వేయించుకుని అక్కడికెళ్ళి ఎంజాయ్ చేస్తూంటాడు. ఆరా (సమంత) అనే అమ్మాయి తన ఫ్రెండ్ తో పాకిస్తాన్ నుంచి వచ్చి, తప్పిపోయిన తమ్ముడ్ని వెతుకుతూంటుంది. ఆమెని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడ్డ విప్లవ్, ఆమె తమ్ముడ్ని వెతకడంలో పడతాడు. తమ్ముడు దొరకడు గానీ- ఆమె ఆరా కాదనీ, ఆరాధ్య అనీ తెలిసి పోతుంది. ఆరాధ్య తండ్రి శ్రీనివాస రావు (మురళీ శర్మ) కాకినాడలో ప్రవచనాలు చెప్పే ఆస్తికుడు. విప్లవ్ తండ్రి లెనిన్ సత్యం (సచిన్ ఖెడేకర్) అతడ్ని వ్యతిరేకించే నాస్తికుడు. జాతకాలు కలవని వీళ్ళు సంసారం చేస్తే సమస్యలు వస్తాయని హోమం చేయమని హెచ్చరిస్తాడు అమ్మాయి తండ్రి. హోమం లేదు గీమం లేదు పొమ్మంటాడు అబ్బాయి తండ్రి. ఇలా వీళ్ళిద్దరూ విప్లవ్ ఆరాధ్యల పెళ్ళికి అడ్డుపడతారు.తమలాంటి చక్కగా సంసారం చేసే జంట ప్రపంచంలోనే లేదని ప్రూవ్ చేయాలని ఇద్దరూ అనుకుని పెద్దలను ఎదిరించి ఎలా పెళ్ళి చేసుకున్నారు? పెళ్లి తరువాత వీరు ఉత్తమ దంపతులుగా ప్రూవ్ చేసుకున్నారా లేదా? ఈ క్రమంలో వీరిద్దరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అనేది తెలుసుకోవాలి అంటే “ఖుషి” సినిమా తప్పక చూడాల్సిందే…


నటీనటుల పనితీరు: 
విజయ్ దేవరకొండ రొమాంటిక్ సీన్స్ లో లవర్ బాయ్ గా, పెళ్ళైన తరువాత సంసారం పరమైన సమస్యలలోని ఎమోషనల్ సీన్స్ లోనూ అలరించడమే కాకుండా తను చేసిన ఈ రెండు వేరియేషన్స్ లో విజయ్ జీవించేశాడని చెప్పచ్చు. సమంత లుక్స్ పరంగా మెప్పించక పోయినా నటన పరంగా చాలా బాగా నటించింది. హీరో, హీరోయిన్స్ మధ్య కేమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. ఫస్టాఫ్ లో ప్రేమలో పడిన జంటగా ఎంత అందంగా కనిపించారో, సెకండాఫ్ లో పెళ్లైన తరువాత భార్య భర్తలుగా సహజమైన పాత్రలలో నటించి చక్కటి భావొద్వేగాన్ని పండించారు. ఇంట్రెస్టింగ్, యాక్టివ్ క్యారెక్టర్లు ఎవరంటే, తండ్రుల పాత్రల్లో మురళీ శర్మ, సచిన్ ఖెడేకర్లు. వీళ్ళ విరుద్ధ భావాలతో గొడవపడే సీన్స్ బాగా వర్కవుటయ్యాయి. విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో శరణ్య, సమంత నానమ్మ పాత్రలో లక్ష్మి, అలాగే.. బ్రాహ్మణ యువకుడిగా శత్రు నటన ఆశ్చర్యపరిచింది. వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ ల ,కామెడీ ఫర్వాలేదు రోహిణి తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణుల పనితీరు: 
ఎప్పుడు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీసే దర్శకుడు శివ నిర్వాణ పెళ్లి తరువాత అందరూ ఇది చేద్దాం. అది చేద్దాం అని ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న జంటలను దృష్టిలో పెట్టుకొని తీసిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎక్కడా కొట్టకుండా చూసిన ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా చాలా చక్కగా తెరకెక్కించాడు. రొటీన్ కథను ఎంటర్ టైనింగ్ గా చెప్పే ప్రయత్నంలో శివ నిర్వాణ దర్శకుడుగా సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.మలయాళ మ్యూజికల్ సెన్సేషన్ హేషమ్ అబ్ధుల్ వహాద్ పాటలు, నేపధ్య సంగీతం ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. మురళి.జి కెమెరా వర్క్ నీట్ గా ఉంది.కొన్ని లొకేషన్స్ మైమరపించేలా ఉన్నాయి.ఆర్ట్ వర్క్ బాగుంది. సినిమాలో ఎడిటర్ ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి లు నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. హిలేరియస్ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు కదిలించే ఎమోషన్స్ ఉన్న ఈ సినిమాను కుటుంబ సభ్యులు , లవర్స్ ఇలా ప్రతి ఒక్కరూ కలిసి చూసేవిధంగా ఉన్న “ఖుషి” మూవీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది.

Cinemarangam.com Review Rating..3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here