Love, Comedy, Emotional Entertainer ‘Merise Merise’ Movie Review

Release date :- August 6,2021
Cinema rangam :- Rating 3.25 /5
Movie Name :- “Merise Merise”
Banner :-  Kothuri Entertainments,
Cast : –Dinesh Tej, Shweta Awasthi, Sanjay Swaroop, Guru Raj, Bindu, Sandhya Janak, Mani, Shashank, Nanaji etc.
Music :-  Karthik Kodagandla,
Editor :- Mahesh,
D.O P :- Nangesh Banel,
P.R.O: – Sai Satish
Producer :-  Venkatesh Kotthuri,
Writer, Director : – Pawan Kumar. K,

కొత్తూరి ఎంటర్ టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై “హుషారు’ ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్థి జంటగా పవన్ కుమార్ కె. దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి నిర్మించిన లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌ చిత్రం  ‘మెరిసే మెరిసే’.ఈ చిత్రం ఆగస్టు 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం ఎంటర్టైన్ చేసిందో చూద్దాం పదండి.

కథ
ఇంజినీరింగ్ పూర్తి చేసుకొని సొంతంగా ఎదగాలని స్టార్టప్ కంపెనీ ప్రారంభించి విఫలమైన సిద్దు (దినేష్ తేజ) ,తల్లిదండ్రుల సూచన మేరకు బెంగళూరు వదిలి హైదరాబాద్ మరతాడు. హీరోయిన్ తల్లిదండ్రులు ఇంజినీరింగ్ పూర్తి చేయమని చెప్తూ లండన్ లో డాక్టర్ గా పనిచేసే యువకుడితో పెళ్లి సంబందం కుదుర్చుకున్న వెన్నెల (శ్వేత అవస్థి) ఫ్యాషన్ డిజైనర్ కావాలనే కోరికతో కాబోయే భర్త అత్త కోరికలకు వ్యతిరేకంగా ఫ్యాషన్ డిజైనింగ్ లో మంచి పేరు సంపాదించు కోవానుకుంటుంది.. ఆ క్రమంలో వెన్నెల, సిద్ధూలు కలుసు కుంటారు వారిపరిచయం వెన్నెల పెళ్లి బ్రేకప్ వరకు వెళుతుంది. ఫ్యాషన్ డిజైనర్ కావాలని కలలు కన్న వెన్నెల లక్ష్యం నెరవేరిందా ? ఏ పరిస్థితుల్లో వెన్నెలతో సిద్దు పరిచయం జరిగింది వారి పరిచయం ఇలాంటి పరిస్థితులకు దారితీసింది. వారి పరిచయం ప్రేమకే పరిమితం అయిందా ? లేక స్నేహం వరకే ఉందా ? లండన్ డాక్టర్ తో బ్రేక్ అప్ కు దారితీసిన పరిస్థితులు ఏంటి ? చివరకు లండన్ బాబు తో వెన్నెల జీవితాన్ని సరిపెట్టుకుంటూ ఉందా  లేక సిద్దు తో రిలేషన్ నాకు ఇంతవరకు తీసుకెళ్ళింది అనే ప్రశ్నలకు సమాధానమే మెరిసే మెరిసే..

నటీనటుల పనితీరు
హుషారు ప్లేబ్యాక్ సినిమాలతో పక్కింటి కుర్రాడు లా ఎలా మెప్పించాడో ఇందులో కూడా దినేష్ తేజ మరోసారి ఆకట్టుకొన్నాడు . యువకుడిగా ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలనేది తెరపైన మెప్పించాడు.హీరోయిన్ శ్వేత అవస్థి నటన అద్భుతంగా ఉంది. తనకిచ్చిన పాత్రలో చక్కగా ఒదిగిపోయి తన పాత్ర పరిధి మేరకు రాణించింది. జై స్వరూప్, సంధ్యాజనక్ బిందు పర్వాలేదనిపించారు హీరో హీరోయిన్ ఫ్రెండ్స్ క్యారెక్టర్లు ప్రత్యేకంగా అనిపించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు
దర్శకుడు పవన్ కుమార్ ఎంచుకున్న కథ.. కథనాలు బాగున్నాయి. అనవసరపు  హంగులు ఆర్భాటాలకు పోకుండా నేరుగా సింపుల్ గా  కథను చెప్పే ప్రయత్నం చేశారు. ఎంతో అనుభవం ఉన్న డైరెక్టర్ లా సినిమాను డీల్ చేశాడు. కథకు తగ్గ సన్నివేశాలతో బోరింగ్ లేకుండా రెండుగంటల పాటు చాలా సరదాగా సాగిపోయేలా స్క్రీన్ ప్లేను రాసుకుని మెప్పించారు దర్శకుడు.ఓ అమ్మాయి లోని ఎమోషన్ కోణాన్ని ఆవిష్కరించే తపన దర్శకుడు లో కనిపిస్తుంది. హీరోయిన్ కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి. ఇక మిగిలిన అన్ని విభాగాల పనితీరు చాలా రిచ్ గా కనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు  సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నాగేష్ ప్రతి సన్నివేశాన్ని చాలా అందంగా చూపించాడు. పలు సన్నివేశాలను కార్తీక్ తన మ్యూజిక్ తో మరో లెవల్ కి తీసుకెళ్లారు ..కథ ,నటీనటుల ఎంపికలో వెంకటేష్ కొత్తూరి టేస్ట్ బాగుంది.నిర్మాత ఖర్చుకు వెనకాడకుండా నిర్మాణ విలువలను చాలా గ్రాండియర్ గా చూపించారు.ఫీల్గుడ్ చిత్రాన్ని అందించే ప్రయత్నం చేశారు . ఓవరాల్ గా చూస్తే ఎలాంటి అశ్లీలత అసభ్యత లేని చిత్రంగా  ‘మెరిసే మెరిసే” లవ్ కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌  ఇష్టపడే ప్రేక్షకులకు “మెరిసే మెరిసే” సినిమా కచ్చితంగా నచ్చుతుంది.

Cinemarangam.com… Rating 3.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here