Love & Message Oriented “Neethone Nenu” Movie Review

Cinemarangam.Com
సినిమా : “ నీతోనే నేను”
విడుదల తేదీ : అక్టోబర్ 13, 2023
రివ్యూ రేటింగ్ : 3 /5
బ్యాన‌ర్‌: శ్రీమామిడి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
నిర్మాత‌: ఎమ్‌.సుధాక‌ర్ రెడ్డి
ద‌ర్శ‌క‌త్వం: అంజిరామ్‌
న‌టీనటులు : వికాస్ వ‌శిష్ట‌, మోక్ష‌, కుషిత, అకెళ్ల త‌దిత‌రులు
సంగీతం: కార్తీక్ బి.క‌డ‌గండ్ల‌
సినిమాటోగ్రాఫ‌ర్‌: ముర‌ళీ మోహ‌న్

టీచ‌ర్‌గా ప‌ని చేసి ఇప్పుడు మంచి స్టేజ్‌కు చేరుకున్న నిర్మాత ఎమ్‌.సుధాక‌ర్ రెడ్డి.తనకు ఎన్ని స‌మ‌స్య‌లు ఉన్నా ఓ మంచి గురువు త‌న శిష్యుల ఉన్న‌తికి ఎంతో క‌ష్ట‌ప‌డుతుంటాడు. అలాంటి గురువుకి సంబంధించిన క‌థను సెలెక్ట్ చేసుకోని త‌న నిజ జీవితంలో చూసిన కొన్ని ఘ‌ట‌న‌ల‌ను బేస్ చేసుకుని త‌నే నిర్మాతగా మారి అంజి రామ్ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీమామిడి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నిర్మించిన చిత్రమే ‘నీతోనే నేను’.సినిమా బండి సినిమాతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన వికాష్ వ‌శిష్ట హీరోగా మోక్ష‌, కుషిత క‌ళ్ల‌పు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోని అక్టోబ‌ర్ 13న గ్రాండ్ గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన “నీతోనే నేను’ సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి.

కథ‌:

ఓ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ఉపాధ్యాయుడిగా బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్న రామ్ (వికాస్ వ‌శిష్ట‌) స్కూల్‌కి వ‌చ్చామా? మ‌న ప‌ని మ‌నం చూసుకున్నామా? వెళ్లామా? అనే ఆలోచ‌న‌తో కాకుండా తన స్కూల్‌లో పిల్ల‌లు చ‌క్క‌గా చదువుకుని అభివృద్ధిలోకి రావాల‌ని బ‌లంగా కోరుకుంటాడు. మంచి చేయాల‌ని తాప‌త్ర‌య‌ప‌డే త‌న‌ను చూసి కొంద‌రు ఉపాధ్యాయులు ఈర్ష్య ప‌డుతుంటారు. కొంద‌రు ఇష్ట‌ప‌డుతుంటారు. అలా రామ్‌ను ఇష్ట‌ప‌డుతుంది ఆయేషా (కుషిత క‌ళ్ల‌పు). ఆమె అదే స్కూల్‌లో పీటీ టీచ‌ర్‌గా ప‌ని చేస్తుంటుంది. క్ర‌మంగా ఆయేషాకు రామ్‌పై ఏర్ప‌డ్డ ఇష్టం ప్రేమ‌గా మారుతుంది. ఓ రోజు ఆయేషా త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను రామ్‌కు చెబుతుంది. అయితే త‌న‌కు పెళ్లైంద‌ని, చిన్న‌నాటి స్నేహితురాలే సీత (మోక్ష‌)ని పెళ్లి చేసుకున్న‌ట్లు రామ్ చెబుతాడు. ఓ రోజు రామ్‌, సీత‌ల‌ను ప‌ల‌క‌రిద్దామ‌ని వారింటికి వెళుతుంది ఆయేషా. అయితే ఆమెకు షాకింగ్ విష‌యాలు తెలుస్తాయి. ఇంత‌కు రామ్ గురించి ఆయేషాకు తెలిసే నిజం ఏంటి? రామ్ జీవితంలో ఉన్న స‌మ‌స్య ఏంటి? సీత‌కు ఆయేషాకు ఉన్న సంబంధం ఏంటి? త‌న స్కూల్‌లోని పిల్ల‌ల కోసం రామ్ చేసే ప‌నేంటి? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…

నటీ నటుల పనితీరు
సినిమా బండితో మెప్పించిన వికాస్ వ‌శిష్ట ఓ వైపు గ‌వ‌ర్న‌మెంట్ టీచ‌ర్‌గా నటిస్తూ త‌న‌కు వ్య‌క్తిగ‌త జీవితంలో ఎన్ని బాధలు ఉన్నా స్టూడెంట్స్ ఉన్నత స్థితికి ఎదగాలని తాపత్రయ పడుతూ , మ‌రో వైపు భార్య కోసం ప‌రిత‌పించే పాత్ర‌లో చ‌క్క‌గా న‌టించారు. తన పాత్రకు హీరో వంద శాతం న్యాయం చేశాడు. సీత పాత్రలో మోక్ష చక్కగా నటించారు. లక్కీ లక్ష్మణ్ వంటి చిత్రం తరువాత
ఆయేష గా ఎమోష‌న‌ల్ పాత్ర‌లో మోక్ష చక్కగా నటించి మెప్పించింది.క‌న్నింగ్ టీచ‌ర్ పాత్ర‌లో ఆకెళ్ల న‌ట‌న ఆక‌ట్టుకుంది.. ఇంకా ఇందులో నటించిన వారందరూ వారికిచ్చిన పాత్రల్లో నటించి మెప్పించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు

విద్య నేర్పే గురువు దేవుడితో స‌మానం.. అందుక‌నే గురుదేవో మ‌హేశ్వ‌ర అని అన్నారు. చాలా చోట్ల గ‌వ‌ర్న‌మెంట్ స్కూల్స్‌లో చ‌దివే పిల్ల‌ల‌కు చాలా స‌రైన వ‌స‌తులు ఉండ‌వు. కానీ వాళ్లకి మంచి స‌దుపాయాల‌ను ఏర్పాటు చేస్తే వాళ్లు కార్పొరేట్ స్కూల్స్‌లోని పిల్ల‌ల‌కు ధీటుగా మంచి ర్యాంకులు సంపాదిస్తారు. అనే విష‌యాన్ని ద‌ర్శ‌కుడు అంజిరామ్ తెర‌కెక్కించిన తీరు బావుంది. ఓ వైపు మెసేజ్‌తో పాటు మంచి ల‌వ్ స్టోరీని మిక్స్ చేసి తెర‌కెక్కించారు. క‌థ‌ను స్కూల్ బ్యాక్ డ్రాప్‌లో తీసుకెళుతూ ఇంట‌ర్వెల్ ముందు హీరో, హీరోయిన్ మ‌ధ్య ఇచ్చే ట్విస్ట్ బావుంది. ఇక సెకండాఫ్ విష‌యానికి వ‌స్తే ఈ ట్విస్టుల‌ను మ‌రింత ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించారు. సినిమాటోగ్రాఫ‌ర్ ముర‌ళీ మోహ‌న్ విజువ‌ల్స్ బావున్నాయి.  మ్యూజిక్ డైరెక్ట‌ర్ కార్తీక్ అందించిన పాట‌లు బావున్నాయి.శ్రీమామిడి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఎమ్‌.సుధాక‌ర్ రెడ్డి ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. “నీతోనే నేను‘ సినిమా చూసిన వారందరికీ ఈ సినిమా బాగా కనెక్ట్ అవ్వడమే కాకుండా సినిమాకు వచ్చిన ప్రతి ఒక్కరూ మంచి అనుభూతితో థియేటర్ నుండి బయటకి వస్తారు.

Cinemarangam.Com Review Rating 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here