Love & Suspense Horror, Thriller ‘GST’ Movie Review

Cinemarangam.com Rating 3.25/5
బ్యానర్ :- తోలు బొమ్మల సిత్రాలు
సినిమా :- “GST”
ఎడిటింగ్:: సునీల్ మహారాణ
డి.ఓ.పి : డి.యాదగిరి
సంగీతం: యు.వి.నిరంజన్
లైన్ ప్రొడ్యూసర్: కె.బాలకృష్ణ
నిర్మాత: కొమారి జానయ్య నాయుడు
కథ,స్క్రీన్ ప్లే,మాటలు,దర్శకత్వం: కొమారి జానకిరామ్
పి.ఆర్.ఓ: మధు.వి ఆర్

నటీనటులు
హీరోలు: ఆనంద్ కృష్ణ, అశోక్, వెంకట్, నందు
హీరోయిన్లు: స్వాతిమండల్, ‘యాంకర్’ ఇందు, పూజా సుహాసిని, వాణి, కామెడీ పాత్రలో..జూనియర్ సంపు,
ఇతర తారాగణం: స్వప్న,శ్రష్టి వర్మ,”వేదం”నాగయ్య, గోవింద్,నల్లి సుదర్శన రావు,”జానపదం”అశోక్, రాథోడ్ మాస్టర్, సూర్య, సంతోష్, రమణ.

GST అనగానే ట్యాక్స్ పరంగా ఏదైనా కొత్త విషయాలు . 
చెబుతారేమో ఆనే ఆలోచన మనందరికీ వస్తుంది. కానీ… GST” అంటే (God, Saithan, Technology).ఇంట్రెస్టింగ్ పాయింట్ తో ప్రపంచంలో అసలు నిజంగా దేవుడు వున్నాడా.. దెయ్యం వుందా.. సైన్స్ వుందా..? వుంటే.. ఏ రూపంలో వున్నాయి..? అసలు వాస్తవం ఏంటి అనేటటువంటి కథాంశంతో  “తోలు బొమ్మల సిత్రాలు” బ్యానర్ పై కొమారి జానకి రామ్ దర్శకత్వంలో కొమారి జానయ్య నాయుడు నిర్మిస్తున్న లవ్, సెంటిమెంట్ , కామెడీ , హర్రర్ , సస్పెన్స్,థ్రిల్లర్ తో పాటు మంచి సందేశం తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం “GST”( గాడ్ సైతాన్ టెక్నాలజీ). ఆనంద్ కృష్ణ, అశోక్, వెంకట్, నందు హీరోలు గా, స్వాతి మండల్, యాంకర్ ఇందు, పూజా సుహాసిని, వాణి హీరోయిన్ లు గా నటించారు, ఈ సినిమా వినాయక చవితి సందర్బంగా ప్రేక్షకులు ముందుకి వచ్చింది సినిమా రివ్యూ ఎలా ఉందొ చూద్దాం పదండి.

కధ
అప్పుడే కాలేజీ చదువులు పూర్తి చేసుకున్న యువత లాంగ్ టూర్ కి వెళ్తారు, అదే మార్గం లో నేవి ఉద్యోగం చేస్తున్న అతను ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, అతనికి డబ్బుపై పిచ్చి ఎక్కువ  ఎలాగైనా డబ్బు బాగా  సంపాదించి లైఫ్ సెటిల్ చేసుకోవాలి అనుకుంటాడు. అలా ఇద్దరు,ప్రేమికులు సముద్రపు ఓడ్డున ఏకాంతంగా గడుపుతున్న సమయం లో అక్కడ చేపలు పడుతున్న జాలర్లు కి సముద్రం లో తిమింగలం స్పర్మ్ నుంచి విడుదల అయ్యేటటువంటి అతి విలువైంది దొరుకుతుంది, ఆ వస్తువు మనం బయట వాడే పెర్ఫ్యూమ్ ల లో వాడతారు, అది చూసిన నేవి వ్యక్తి వాళ్ళని హతమార్చి తీసుకువెళ్దాం అని చూస్తాడు చివరికి ఆ విలువైన వస్తువు వాళ్ళకి దొరికిందా మధ్యలో దెయ్యం ఎందుకు ఎంటర్ అయ్యింది, ఈ కాలేజీ యువతకి దెయ్యనికి ఏమిటి సంబంధం, దేవుడు గొప్పవాడా, దెయ్యం గొప్పదా, టెక్నాలజీ గొప్పదా (Gst ) అనేది తెలుసుకోవాలి అంటే సినిమా థియేటర్స్ కి వెళ్లి చూడవలసిందే.

నటి నటుల పనితీరు 
కాలేజీ చదువులు కంప్లీట్ చేసుకున్న యువతగా యాక్ట్ చేసిన నటి నటులు అంత కొత్త వాళ్ళు అయినా ఫస్ట్ హాఫ్ అంత చాలా ఆహ్లాదకరంగా సినిమాని వాళ్ళ భుజాలు మీద సినిమాని నడిపించారు అని చెప్పవచ్చు, ఇక పోతే నేవీ ఆఫీసర్ గా అతని లవర్ వాళ్ళ ఇద్దరు మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది అని చెప్పాలి, నేవి ఆఫీసర్ ఆ అమ్మాయిని అంతలా ప్రేమించి ఒక్కసారే డబ్బు సంపాదించాలి అనే అత్యాశ తో ఆ అమ్మాయిని వ్యతిరేకించే విధానాన్ని బాగా పండించాడు, దయ్యం క్యారెక్టర్ ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ అని చెప్పాలి, టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన ఈ రోజుల్లో దేవుడు, దెయ్యం, టెక్నాలజీ మీద వచ్చిన ఇలాంటి కొత్త కథను ఇప్పటివరకు మన తెలుగు ప్రేక్షకులు చూడలేదని చెప్పాలి.

సాంకేతికనిపుణుల పనితీరు 
అసలు నిజంగా దేవుడు వున్నాడా..దెయ్యం వుందా.. సైన్స్ వుందా..? వుంటే.. ఏ రూపంలో వున్నాయి..? అసలు వాస్తవం ఏంటి అనేది డైరెక్టర్ జానకి రామ్ ఈ సినిమాను చాలా బాగా తీశాడు.  ఆయన ఒక సైంటిస్టులా స్మశానం గురించి,అన్ని మతాల దేవుళ్ల గురించి,సైన్స్ గురించి  ఆయన చేసిన రీసెర్చ్  అద్భుతం అని చెప్పాలి. ఈ మూడు అంశాలను కథగా తయారు చేసుకొని  ఒక చక్కటి సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ జానకి రామ్ కు ఇది మొదటి చిత్రమైనా ఎన్నో సినిమాలు తీసిన దర్శకుడిగా ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. డి. ఓ.పి  డి.యాదగిరి సినిమాటోగ్రఫీ చాలా బావుంది,సినిమా విజువల్ వండర్ ట్రీట్ లా వుంది. మ్యూజిక్ డైరెక్టర్ యు.వి నిరంజన్ అందించిన సంగీతం సినిమా కి ప్లస్ పాయింట్ అని చెప్పాలి.ప్రొడ్యూసర్ కోమరి జానయ్య నాయుడు ఖర్చుకు ఎక్కడా  వెనకాడలేదు అని మనకి సినిమా చూస్తుంటె అర్ధమవుతుంది.తోలు బొమ్మల సిత్రాలు” బ్యానర్  ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బావున్నాయి, కథే మా చిత్రానికి కథానాయకుడు అనుకోని తీసిన ఈ సినిమా దైవ భక్తులకు , దయ్యాలకు భయపడే వారికి, సైన్స్ ని నమ్మేవాళ్ళకు ఇలా అందరికీ మెచ్చేలా తీసిన ఈ సినీమా విమర్శకుల ప్రశంసలు పొందుతుందనే.విషయంలో సందేహం .ఈసినిమా ని మీరందరు కూడా చూసి… “దేవుడు”కావాలా మీకు? “దెయ్యం”కావాలా మీకు? టెక్నాలజీ పరంగా మన జీవితాన్ని గడుపుదామా…అని ఒక్కసారి ఆలోచించుకొనెలా  మెసేజ్ ఓరియంట్ తో  సినిమాను చాలా చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు జానకిరామ్ .లవ్, సెంటిమెంట్ , కామెడీ , హర్రర్ , సస్పెన్స్, థ్రిల్లర్ తో పాటు మంచి సందేశం తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన  “GST” చిత్రం ఎక్కడా బోరింగ్ లేకుండా . ఒక్క క్షణం కూడా రెప్ప ఆర్పకుండా ఫ్యామిలీతో  పాటు కలసి చూడవలసిన ఈ సినిమా అందరికీ తప్పక నచ్చుతుంది.

             Cinemarangam.com Rating…3.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here