‘Madhurapudi Gramam Ane Nenu’ To Be Released In Theatres On October 13

‘Madhurapudi Gramam Ane Nenu’ is a village-based drama where the village narrates its own story. The film is directed by Kalyan Ram Malli of ‘Katti’ fame. The film features Siva Kantamaneni in the lead. The music has been composed by Melody Brahma Mani Sharma. Presented by G Rambabu Yadav, it is produced by KS Shankar Rao and R Venkateswara Rao under the banner Light House Cine Magic.

The makers of the movie have announced the official release date. The film will be released in theatres on October 13, 2023.

Speaking about his movie, Director Malli stated that its screenplay is unique. “My film contains ingredients such as friendship, politics, emotions, and themes that we associate with village drama. The film is set in the backdrop of Ongole and its unique fabrics form a key element. We shot the film in different locations, namely, Rajahmundry, Machilipatnam and Hyderabad. Hero Siva Kantamneni is going to be seen in a totally new avatar. Kathleen Gowda, Bharani, and Satya are going to be seen in important roles. I feel that the audience would love the film.”

Producer Venkateswara Rao stated that ‘Madhurapudi Gramam Ane Nenu’ is a concept-oriented action drama. “We haven’t compromised on anything with regards to the budget. We gave everything to the best of our abilities. The film also completed its censor formalities and is up for a grand theatrical release. The film’s trailer will be out soon,” he added.

Writer, Director: Malli; Banner: Light House Cine Magic; Producers: KS Shankar Rao, R Venkateswara Rao; Music Director: Mani Sharma; Editor: Gautham Raju; Cinematography: Suresh Bhargav; Fights: Ramakrishna; Dialogues: Uday Kiran; Co-Producers: K Sridhar Reddy, M Jaggaraju; Executive Producers: K Srinivasa Rao, Y Anil Kumar, Production Controller: Naren G Surya.

అక్టోబ‌రు 13న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌వుతున్న“మధురపూడి గ్రామం అనే నేను”

మ‌నుషుల‌కి ఆత్మ‌లు ఉన్న‌ట్టే..ఒక ఊరికి ఆత్మ ఉంటే..ఆ ఆత్మ త‌న క‌థ తానే చెబితే ఎలా ఉంటుంది అనే ఆస‌క్తిక‌ర‌మైన క‌థాంశంతో తెర‌కెక్కిన చిత్రం “మధురపూడి గ్రామం అనే నేను”. శివ కంఠమనేని హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి క‌ళ్యాణ్ రామ్ “కత్తి” ఫేమ్ మల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మెలొడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. జి రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ ప‌తాకంపై కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌, టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్ రాగా తాజాగా ఈ చిత్రాన్ని అక్టోబ‌రు 13న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా..

ద‌ర్శ‌కుడు మ‌ల్లి మాట్లాడుతూ – “ఒక డిఫ‌రెంట్ స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా చేద్దాం అని “మధురపూడి గ్రామం అనే నేను” అనే సినిమాను రూపొందించ‌డం జ‌రిగింది. ల‌వ్‌, ఫ్రెండ్‌షిప్‌, పాలిటిక్స్‌, యాక్ష‌న్‌, ఎమోష‌న్ ఇలా ఒక ఊరిలో ఎమైతే ఎగ్జ‌యిటింగ్ అంశాలు ఉంటాయో అవ‌న్నీ ఈ మ‌ట్టి క‌థ‌లో ఉన్నాయి. ఒంగోలు, చీరాల బ్యాక్‌డ్రాప్లో జ‌రిగే క‌థ ఇది. రాజ‌మండ్రి, మ‌చిలీప‌ట్నం,హైద‌రాబాద్‌లోని ప‌లు అంద‌మైన‌, ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌దేశాల్లో షూటింగ్ జ‌రిపాం. హీరోగా శివ కంఠ‌మ‌నేని గారు ప‌ర్‌ఫెక్ట్ యాప్ట్‌..అద్బుత‌మైన న‌ట‌న‌ని క‌న‌బ‌రిచారు. హీరోయిన్‌గా క్యాథ‌లిన్ గౌడ ఒక డిఫ‌రెంట్ పాత్ర‌లో త‌ప్ప‌క‌ మెప్పిస్తుంది. భ‌ర‌ణి శంక‌ర్‌, స‌త్య‌, నూక‌రాజు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. చివ‌రి వ‌ర‌కు ఉత్కంఠభరితంగా సాగుతూ త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తుంది అనే న‌మ్మ‌కం ఉంది“ అన్నారు.

చిత్ర నిర్మాత‌లు మాట్లాడుతూ – `కాన్సెప్ట్ ఓరియంటేష‌న్‌తో ఒక మంచి యాక్ష‌న్ డ్రామాగా ఖ‌ర్చుకి ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించ‌డం జ‌రిగింది. ఇటీవ‌లే సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. అక్టోబ‌రు 13న ప్ర‌పంచ వ్యాప్తంగా “మధురపూడి గ్రామం అనే నేను” చిత్రాన్ని గ్రాండ్‌ రిలీజ్ చేస్తున్నాం. త్వ‌ర‌లోనే ట్రైల‌ర్ తో మీ ముందుకు వ‌స్తాం` అన్నారు.

శివ కంఠ‌మ‌నేని, క్యాథ‌లిన్ గౌడ, భ‌ర‌ణి శంక‌ర్‌, స‌త్య‌, నూక‌రాజు త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి

రచన, దర్శకత్వం: మల్లి,
సమర్పణ: జి రాంబాబు యాదవ్,
బ్యానర్: లైట్ హౌస్ సినీ మ్యాజిక్,
నిర్మాతలు: కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు,
సంగీతం: మణిశర్మ,
ఎడిటర్: గౌతమ్ రాజు,
సినిమాటోగ్రఫీ: సురేష్ భార్గవ్,
ఫైట్స్: రామకృష్ణ,
స్క్రీన్ ప్లే: నాగ‌కృష్ణ గుండా,
మాటలు: ఉదయ్ కిరణ్,
సహ నిర్మాతలు: కె శ్రీధర్ రెడ్డి, ఎం జగ్గరాజు,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: కె శ్రీనివాసరావు, వై అనిల్ కుమార్
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: న‌రేన్ జి సూర్య‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here