Manchu Vishnu and Viranika Celebrating Their Anniversary Today

కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఫ్యామిలీ గురించి ఇండస్ట్రీ కి పరిచయం అవసరం లేదు. ఆ కుటుంబంలో ఒక్క మోహన్ బాబు భార్య మంచు నిర్మలాదేవి తప్ప మిగిలిన వారందరూ నటులుగా . రాణిస్తున్నారు.అయితే వీరిలో మంచు విష్ణులో ఒక ప్రత్యేకత ఉంది. సినిమారంగంలో ఉన్న తను అప్పటి ముఖ్యమంత్రి వై. యస్ రాజశేఖర్ రెడ్డి మేనకోడలు విరానికా రెడ్డిని ప్రేమించి 2009 లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే.ఇప్పుడు వారికి నలుగురు సంతానం. ఇప్పుడు మంచు విష్ణు, విరానికా రెడ్డి.. ఈ రెండు పేర్లు వింటేనే ఆల్ టైం బెస్ట్ కపుల్ అని తెలుగు ప్రజలంతా గర్వంగా చెప్పుకుంటున్న ఈ జంట.. రాముడు, సీతలా.. అసలు సిసలు దాంపత్య జీవనానికి అద్దం పడుతున్నారు. వ్యక్తిగతంగానూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని, వివాహ బంధంలోనూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ధనం, పలుకుబడి ఉన్నా.. ఎలాంటి గర్వానికి పోకుండా సాదాసీదాగా జీవనం గడిపేస్తూ, హుందాతనం మెయింటైన్ చేస్తూ.. చూడముచ్చటైన జంటగా పేరొందారు. ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకుంటూ, తెలుగు ఇండస్ట్రీలో చూడముచ్చటైన జంటగా నిలిచారు. మంచు విష్ణు, విరనికా రెడ్డి పెళ్లి రోజు సందర్భంగా ఈ జంటకు బెస్ట్ విషెస్ చెప్తూ.. ఈ లవ్ బర్డ్స్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

రంగస్థలం నుంచి అన్ని రంగాల వరకు..

మంచు విష్ణు సినిమాతో పాటు అన్ని రంగాల్లోనూ ఆరితేరారు. నటుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాక తన ప్రతిభా పాటవాలతో మంచి బిజినెస్ మ్యాన్ గానూ రాణించారు. ప్రస్తుతం తండ్రి మోహన్ బాబు స్థాపించిన మోహన్ బాబు కార్పొరేషన్ కి విష్ణు సీఈఓగా వ్యవహరిస్తున్నారు. 1985లోనే “రగిలే గుండెలు” బాల నటుడిగా అరంగేట్రం చేశారు. 2007లో విష్ణు కథానాయకుడిగా నటించిన “ఢీ” చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత పాతిక సినిమాలకుపైగా విష్ణు హీరోగా నటించారు. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడగలరు. స్వయంగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన విష్ణు.. కాలేజీ లెవెల్లో క్రికెట్, బాస్కెట్ బాల్ లో పలు అవార్డులు కూడా అందుకున్నారు. శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలకు సీఈఓగానూ వ్యవహరిస్తున్నారు. సినిమాలతో పాటు వ్యాపారాల్లోనూ రాణించి స్టార్ డం సొంతం చేసుకున్న మంచు విష్ణు ఒకడుగు ముందుకు వేసి మా అధ్యక్షులుగా పోటీచేసి అందరి అంచనాలను తలక్రిందలు చేస్తూ గెలుపొందడం జరిగింది..మా అసోసియేషన్ అధ్యక్షులుగా మరో వైపు తండ్రి స్థాపించిన విద్యా సంస్థలను చూసుకుంటూ బిజీగా ఉన్న తనకు అండగా నిలబడింది భార్య విరానికా రెడ్డి,

వివేకవంతురాలు విరానిక రెడ్డి…
అందచందంతో గుణవంతురాలు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలంటే ఎంతో గౌరవం. అన్నింటికీ మించి సేవాగుణానికి పెట్టింది పేరు. విరానిక ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి చెల్లెలు. రాజారెడ్డి కుటుంబంలో చిన్న మనవరాలు.. రాజారెడ్డి నాలుగో కొడుకు సుధాకర్ రెడ్డి, విద్యా రెడ్డి దంపతుల కుమార్తె. బాల్యం నుంచి అమెరికాలోనే ఉన్నారు. చిన్నతనంలో విరానిక డాక్టర్ కావాలనే కోరిక ఉండేది. ఆ తర్వాత వ్యాపారంలోకి అడుగుపెట్టారు. నాటి నుంచి నేటి వరకు విజయవంతంగా రాణిస్తున్నారు. తను రాజకీయ కుటుంబం నుండి వచ్చినా కూడా డిజైనర్ గా చేస్తూనే మోహన్ బాబు విద్యా సంస్థలలోని న్యూయార్క్ అకాడమీ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టి విజయవంతంగా రాణిస్తున్న తను తాజాగా లండన్, దుబాయ్, దోహ వంటి వివిధ దేశాలలో కూడా బోటిక్ సంబందించిన బ్రాంచి లను నెలకొల్పడానికి సిద్దమైన విరానికాకు ఆఫ్రికాలోనూ వ్యాపారాలు ఉన్నాయి.


ప్రేమ చిగురించింది ఇలా..

మొదటిసారి విరానికా రెడ్డిని చూసిన మంచు విష్ణు ప్రేమలో పడిపోయారు. ఆమెతో పరిచయం చేసుకున్నారు. ఇలా స్నేహితులుగా మారి, ప్రేమికులయ్యారు. ఇరువురికి మాట మర్యాదలు, మంచి తెలివితేటలు, బిజినెస్ లక్షణాలు ఉండడంతో ఆ బంధం మరింత దృఢంగా మారింది. తల్లిదండ్రులను ఒప్పించి, 2009లో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. విరానికా రెడ్డి సోషల్ మీడియాకు కొంచెం దూరంగా ఉంటారు. కానీ లాక్ డౌన్ సమయంలో కర్చీఫ్ ని కుట్టులేకుండా మాస్క్ లాగా ఎలా తయారు చేసుకోవాలో చెప్పి అందరిని ఆకట్టుకున్నారు.

భర్త చాటు భార్యగానే విరానికా ఉంటూ ఫ్యామిలీతోనే ఎక్కువ సమయాన్ని గడిపేస్తుంటారు. ఇరువురికి వివాహం జరిగి 14 ఏండ్లు అవుతున్నా ఇప్పటివరకు వారి మధ్య చిన్న మనస్పర్ధలు రాలేదు అంటే ఒకరినొకరు ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు.ఇలా వీరిద్దరిదీ వివిధ రంగాలైనా కూడా సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న మంచు విష్ణు, విరానికా రెడ్డి పెళ్లి రోజు మార్చి 1..వీరు ఇలాగే అందరికీ ఆదర్శంగా నిలుస్తూ బిజినెస్ పరంగా, సినిమా పరంగా రాణిస్తూ సక్సెస్ కపుల్ గా నిలవాలని కోరుతూ మంచు విష్ణు, విరానికా దంపతులు ఇలాంటి వివాహ వార్షికోత్సవాలు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here