‘Maruthi Nagar Subramanyam’ Movie Review

Cinemarangam.Com
బ్యానర్స్ : పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్
సినిమా : “మారుతి నగర్ సుబ్రమణ్యం’’
రివ్యూ రేటింగ్ : 3/5
విడుదల తేదీ : 23.08.2024
సమర్పణ : సుకుమార్ భార్య తబిత
నిర్మాతలు: బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య,
కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: లక్ష్మణ్ కార్య.
నటీ నటులు : రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్ తదితరులు
సహ నిర్మాతలు: రుషి మర్ల, శివప్రసాద్ మర్ల,
లైన్ ప్రొడ్యూసర్: శ్రీహరి ఉదయగిరి,
క్రియేటివ్‌ హెడ్‌: గోపాల్‌ అడుసుమల్లి,
సినిమాటోగ్రఫీ: ఎంఎన్ బాల్ రెడ్డి,
ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి,
సాహిత్యం: ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్, భాస్కరభట్ల, కళ్యాణ్ చక్రవర్తి,
పీఆర్వో: పులగం చిన్నారాయణ,
ఆర్ట్ డైరెక్షన్: సురేష్ భీమంగని

ఎటువంటి పాత్రలోనైనా జీవించగల విలక్షణ నటుడు రావు రమేష్. ఆయన హీరోగా రూపొందిన సినిమా ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ భార్య తబిత సమర్పణలో లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ పతాకాలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. రావు రమేష్ సరసన ఇంద్రజ… అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ కీలక పాత్రలో నటించారు. ఆగస్టు 23న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి.

కథ:

సుబ్రమణ్యం(రావు రమేష్)కి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది కల. తనకు ఉద్యోగం వస్తే ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి అనుకుంటూ ప్రతి జాబ్ కు ట్రై చేస్తుంటాడు. అయితే తన భార్య కళారాణి (ఇంద్రజ) కు మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది.. దాంతో  మొత్తం కుటుంబాన్ని కళారాణి చూసుకుంటుంది. చివరికి సుబ్రహ్మణ్యంకు ఉద్యోగం వచ్చినా ఆది కోర్టులో కేస్ పడడంతో ఆపాయింట్మెంట్ రాదు.ఎప్పటికైనా నాకు ఉద్యోగం వస్తుంది అన్న ఆశతో భార్య సంపాదన మీద బతుకుతూ ఉంటాడు. ఒకానొక సందర్భంలో అత్త (అన్నపూర్ణమ్మ) దాచుకొన్న డబ్బును కూడా సుబ్రహ్మణ్యం ఖర్చు పెట్టేస్తాడు..ఇకపోతే ఇతనికి ఒక కొడుకు అర్జున్ (అంకిత్ కొయ్య) ఉంటాడు. తనేమో నేను అల్లు అరవింద్ కొడుకని, అల్లు అర్జున్ కు తమ్ముడని కలలు కంటూ ఉంటాడు. ఒక రోజు కాంచన (రమ్య పసుపులేటి ) ను చూసిన మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు అర్జున్. ఇదిలా ఉండగా అనుకోకుండా ఒకరోజు సుబ్రమణ్యం ఖాతాలో పది లక్షలు జమ అవుతాయి. దీంతో అవి ఎక్కడి నుండి వచ్చాయో, ఎవరు పంపారో తెలియక తండ్రి, కొడుకులు తికమక పడుతుంటారు, కానీ వీరికి చాలా సమస్యలు ఉన్నందున వచ్చిన డబ్బు మొత్తాన్ని ఖర్చు పెట్టేస్తారు. దీని తర్వాత వీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? అసలు ఈ 10 లక్షలు ఎవరు పంపారు? చివరికి సుబ్రహ్మణ్యం కు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందా? మరో వైపు అర్జున్ ప్రేమ సక్సెస్ అయ్యిందా..లేదా ? అనే విషయాలు తెలుసుకోవాలి అంటే కచ్చితంగా థియేటర్ కు వెళ్లి “మారుతినగర్ సుబ్రహ్మణ్యం” సినిమా చూడాల్సిందే.


నటీ నటుల పనితీరు : 
సుబ్రహ్మణ్యం పాత్రలో రావు రమేష్ నటన ఈ సినిమాకు హైలెట్ అని చెప్పవచ్చు. తన కామెడీ తో ప్రేక్షకులను నవ్వించడమే కాకుండా మధ్య మధ్యలో వచ్చే ఎమోషన్ సీన్స్ లలో కూడా అద్భుతంగా నటించాడు. రావు రమేష్ భార్యగా కళారాణి పాత్రలో నటించిన ఇంద్రజ ఒక గృహిణిగా, దైర్యవంతురాలిగా చాలా బాగా నటించింది. కథానాయకుడిగా అర్జున్ పాత్రలో నటించిన అంకిత్ కొయ్య తన పాత్రకు తగ్గట్టుగా చాలా చక్కగా నటించాడు. అంకిత్ కు జోడీగా కాంచన పాత్రలో నటించిన రమ్య పసుపులేటి మోడ్రన్ గర్ల్‌గా, బబ్లీ గా కనిపించింది. వీరిద్దరి లవ్ ట్రాక్ యూత్ కు బాగా నచ్చుతుంది. హర్షవర్ధన్, బిందు, శివన్నారాయణ, ప్రవీణ్, అన్నపూర్ణమ్మ తదితరులు వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారని చెప్పచ్చు.


సాంకేతిక అంశాలు: 
ఒక సాధారణమైన వ్యక్తి ఖాతాలో భారీ మొత్తం జమ అయితే ఆ డబ్బుతో తను ఏం చేస్తాడు ఆనే సింపుల్ కథను తీసుకొని దానికి కామెడీని జోడించి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందించాడు దర్శకుడు లక్ష్మణ్. రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్  వంటి ఆర్టిస్టులందరూ తమ నటనతో కథకు బలాన్ని తీసుకొచ్చారని చెప్పవచ్చు. రావు రమేష్‌కి రాసిన డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. సంగీత దర్శకుడు కళ్యాణ్ నాయక్ మ్యూజిక్ పాటలు బాగున్నాయి. ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్, భాస్కరభట్ల, కళ్యాణ్ చక్రవర్తి వంటి వారి సాహిత్యం సినిమాకు హెల్ప్ అయ్యాయి. సిద్ శ్రీ రామ్ పాడిన ‘మేడమ్ సార్ మేడమ్ అంతే’ సాంగ్ బాగుంది. యం. యన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది. ముఖ్యంగా బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ పనితీరు డీసెంట్ గా ఉంది. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ భార్య తబిత సమర్పణలో పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ పతాకాలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య లు సినిమా నిర్మించడం అంటే ఏదో డబ్బులు ఖర్చు పెట్టేయడం కాకుండా కథా కథనాలు, ఆర్టిస్టులను, టెక్నీషియన్స్ ను సెలెక్ట్ చేసుకొని ఖర్చుకు వెనుకడకుండా నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్, మంచి మ్యూజిక్ వంటి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో తీసిన ఈ సినిమా చూసిన వారందరికీ బాగా కనెక్ట్ అవ్వడమే కాకుండా సినిమాకు వచ్చిన ప్రతి ఒక్కరూ మంచి అనుభూతితో థియేటర్ నుండి బయటకి వస్తారు.

Cinemarangam.Com Review Rating 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here