Mass song released from ‘Batuku Bus Stand’ movie is an unexpected response to ‘Bussa Bussa’

Bussa Bussa from BB: Mass Feast
 
Icon Staar Allu Arjun’s nephew, Viran Muttamsetty is making his debut as male lead with Bathuku Busstand. 
 
The makers of Bathuku Busstand have unveiled a new song from the album and it has a massy vibe to it. 
 
Titled Bussa Bussa, this item number has a proper mass masala touch to it. The lyrics are bold and the visuals are pleasing to the eye to glamour lovers. 
 
Deepthi Bhogaraju’s vocals and IN Reddy’s lyrics gel well with Mahavir’s composition. The song is a feast to the masses. 
 
Bathuku Busstand is billed to be a suspense action thriller. It is directed by IN Reddy. The makers will be announcing the release date soon.

విరాన్ ముత్తంశెట్టి, నికిత అరోరా, శృతి శెట్టి జంట‌గా బ‌తుకు బ‌స్టాండ్ మూవీ నుంచి విడుద‌లైన‌ మాస్ సాంగ్ బుస్సా బుస్సాకు అనూహ్య స్పంద‌న‌ 

విరాన్ ముత్తంశెట్టి హీరోగా పరిచయం అవుతున్న సినిమా బతుకు బస్టాండ్. నికిత అరోరా, శృతి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇలవల ఫిల్మ్స్ పతాకం పై చక్రధర్ రెడ్డి సమర్పణలో IN రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను కవితా రెడ్డి, కె.మాధవి నిర్మిస్తున్నారు. బ‌తుకు బ‌స్టాండ్ అనే టైటిల్ పెట్టిన‌ట్లుగా ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి అటు సాధ‌ర‌ణ ప్రేక్ష‌కుల‌తో పాటు తెలుగు ఇండ‌స్ట్రీ ట్రేడ్ వ‌ర్గాల్లో ఈ సినిమా పై ఆస‌క్తి పెరిగుతూ వ‌స్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప‌బ్లిసిటీ కంటెంట్ కు సోష‌ల్ మీడియాలో అనూహ్య స్పంద‌న ల‌భిస్తోంది. ఇటీవ‌లే విడుద‌లైన మొద‌టి పాట యూట్యూబ్ లో  విశేషాద‌ర‌ణ అందుకుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా విడుద‌లైన‌ బ్రేజిలియ‌న్ మోడ‌ల్ జెన్నీఫ‌ర్ పిక్కినాటో చిందేసిన బుస్సా బుస్సా అంటూ సాగే ఓ మాస్ ఐట‌మ్ సాంగ్ కు సోష‌ల్ మీడియాతో పాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన రెస్పాన్స్ రావ‌డం చాలా ఆనందంగా చిత్ర ద‌ర్శ‌కుడు ఐ.ఎన్. రెడ్డి తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం ముగిసింద‌ని, త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లుగా చిత్ర నిర్మాత‌లు తెలిపారు.
 
నటీనటులు: 
విరాన్ ముత్తంశెట్టి, నికిత అరోరా, శృతి శెట్టి తదితరులు

టెక్నికల్ టీం:
బ్యానర్ : ఇలవల ఫిల్మ్స్
సమర్పణ : K చక్రధర్ రెడ్డి
రచన, దర్శకత్వం : I.N. రెడ్డి
నిర్మాతలు : I.కవితా రెడ్డి, K.మాధవి
డిఓపి : వాస్ కమల్
సంగీతం : మహవీర్
పీఆర్ఓ : ఏలూరు శ్రీను & మేఘ శ్యామ్
కొరియోగ్రఫీ : శివాజీ
యాక్షన్ : శంకర్.U

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here