‘Mathu Vadalara’ Movie Review

Release date : December 25, 2019
Cinemarangam.com.. Rating : 3/5
Movie name:-”Mathu Vadalara”
Banners:-Mythri Movie Makers,Clap Entertainment
Starring :  Sri Simha,Vennela kishore,Satya, Naresh agashtya,Bramhaji,Athulya chandra
Editor :karthik srinivas
Cinematography :Suresh sarangam
Music Director : : kalabairava
Director :Rithesh rana
Producer :Chiranjeevi(cherry),Hemalatha

సంగీత దిగ్గజం కీరవాణి తనయుడు శ్రీసింహా కథానాయకుడిగా అరంగేట్రం చేసిన చిత్రం ‘మత్తు వదలరా’. కాగా రితేష్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా ఈ సినిమాకి కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ స్వరాల్ని అందించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది . క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

కథ : ఒక డెలివరీ బాయ్ గా నెలంతా పని చేస్తే చేతికి నాలుగు వేలు జీతం కూడా దక్కని బాబూ మోహన్ (శ్రీ సింహా) కథ ఇది. ఇటువంటి ఉద్యోగం ఉంటే ఏమిటి? పోతే ఏమిటి? అనుకుని ఉద్యోగం మనేద్దామనుకుంటాడు. కానీ బాబూ మోహన్ స్నేహితుడు యేసు (సత్య) మాత్రం ఈ కొరియర్ బోయ్ ఉద్యోగమే చేస్తూ వేలకు వేలు ఎలా సంపాదించాలో ఓ ఐడియా చెబుతాడు.కస్టమర్ ను ఎలా మోసం చేయాలో కస్టమర్ ఏమరపాటుగా ఉన్నప్పుడు కస్టమర్ దగ్గర నుండి 500 రూపాయలు ఎలా నొక్కేయాలో ప్రాక్టికల్‌గా చూపిస్తాడు. ముందు ఇది దొంగతనం కదా అనుకున్నా, యేసు(సత్య) హితబోధ వల్ల ఇది దొంగతనం కాదు, తస్కరించే విద్య అని తెలుసుకుని, స్నేహితుడు చెప్పింది ఫాలో అవుదామని అనుకుంటాడు. ముందుగా ఓ ముసలమ్మ దగ్గర 500 రూపాయలు కొట్టేద్దామని ఫిక్సవుతాడు. కానీ ఆ ముసలమ్మ అతి తెలివి, చాదస్తం, ముందు జాగ్రత్తల వలన 500 రూపాయలు తస్కరించి దొరికిపోతాడు.కానీ అక్కడ అనుకోకుండా జరిగే కొన్ని సంఘటనతో ఓ మర్డర్ కేసులో ఇరుక్కొంటాడు. అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నంలో జరిగిన తోపులాటలో ముసలమ్మ కిందపడి పోతుంది. అక్కడి నుంచి మెల్లమెల్లగా తన జీవితాన్నీ, తననీ రిస్కులో పడేసుకుంటూ వెళ్తాడు బాబూ మోహన్‌. 500 రూపాయల కోసం ఆశ పడి. తన జీవితంతో పాటు, తన స్నేహితుల జీవితం కూడా ప్రమాదంలో పడేలా చేస్తాడు. ఇంతకీ అక్కడ ఏం జరిగింది? ఈ కేసు నుంచి బాబూ మోహన్ ఎలా బయటపడ్డాడు?ఈ మధ్యలో బాబుమోహన్ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? అనేదే మత్తువదలరా సినిమా కథ.

 విశ్లేషణ : .క్రైైమ్‌ కామెడీ థ్రిల్లర్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో ఓ మర్డర్‌ మిస్టరీ చుట్టూ ఈ సినిమా సప్సెన్స్ తో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సరదాగా సాగుతుంది. సినిమాలో సత్య కామెడీ, ఇంటర్వెల్ బ్యాంగ్ మరియు సెకెండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ లు అలరిస్తాయి.అలాగే హీరో పాత్రతో ముడి పడిన మిగిలిన ప్రధాన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు పాయింట్ అఫ్ వ్యూస్ లో రివీల్ అయ్యే సస్పెన్స్ ఎలిమెంట్స్.. సెకెండ్ హాఫ్ లో వచ్చే విచారణ సన్నివేశాలు కామెడీ సీన్స్ వంటి అంశాలు సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.ఇక హీరో శ్రీసింహా చాలీచాలని జీతంతో ఇబ్బంది పడే మంచి స్వభావం ఉన్న ఒక డెలివరీ బాయ్ గా చాల బాగా నటించాడు. మర్డర్ కేసులో ఇరుకునే సన్నివేశాల్లో కూడా చాల బాగా నటించాడు.ఇక కమెడియన్ సత్య తన కామెడీతో ఈ సినిమాకి ఊపిరి పోసాడు. సినిమా మొత్తం తన భుజాల పై మోసాడు. ముఖ్యంగా కామెడీ టైమింగ్ తో చక్కగా పర్ ఫామ్ చేసాడు.విలన్ గా నటించిన నటుడు, వెన్నెల కిషోర్, అజేయ్ ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సినిమా మొదటి పది నిముషాలు బోర్ గా సాగడం, ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత ఫన్, సెకెండ్ హాఫ్ లో మిస్ అవ్వడం అలాగే సెకెండాఫ్ లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి. ఈ సినిమాలో పాటలు, హీరోయిన్, రొమాన్స్ లేకున్నా దర్శకుడు రాసుకున్న ట్రీట్మెంట్ కామెడీని డీల్ చేసిన విధానం బాగా ఆకట్టుకుంది. మొదటి మూవీ అయినా కూడా దర్శకుడు రితేష్ ఎంచుకున్నకథను చెప్పిన విధానం చాలా బాగుంది. వాస్తవికతకు కాస్త దూరంగా అనిపించినా,ఆయన స్క్రీన్ ప్లే మాత్రం ప్రేక్షకుడికి ఉత్కంఠను కలిగిస్తూనే బాగా నవ్విస్తోంది. మొత్తానికి రితేష్ ఇటు హాస్యాన్ని అటు సీరియస్ నెస్ ని మిక్స్ చేసి సినిమాని బాగా హ్యాండిల్ చేశాడు.. అతని డైలాగ్ డిక్షన్ కూడా సినిమాకు చక్కగా ఉపయోగపడింది. సంగీత దర్శకుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం కూడా బాగా ఆకట్టుకుంది.కెమెరామెన్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది.ఎడిటర్ వర్క్ సినిమాకి తగ్గట్లు ఉంది. సినిమాలోని నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.అయితే ఈ సినిమా ఓవరాల్ గా యూత్ తో పాటుగా మిగిలిన అన్నివర్గాల ప్రేక్షకులని అలరిస్తుందని చెప్పొచ్చు

Cinemarangam.com..3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here