Medical Mafia Backdrop Message Oriented ‘Balamevvadu’ Movie Review

Cinemarangam.Com
సినిమా : “బలమెవ్వడు “
రిలీజ్ డేట్ : 1.10.22
రివ్యూ రేటింగ్ : 3/5
బ్యానర్ : సనాతన దృశ్యాలు
నిర్మాత : ఆర్. బి. మార్కండేయలు
కథ, స్క్రీన్ ప్లే, మాటలు , దర్శకత్వం : సత్య రాచకొండ
నటీ నటులు : ధృవన్ కటకం, నియా త్రిపాఠీ, పృద్వి రాజ్, నాజర్, సుహాసిని మణి రత్నం, శ్రావణ్ భరత్, మోహన్ కాంత్, జబర్దస్త్ అప్పారావు, మణి మహేష్ తదితరులు
సంగీతం : మణిశర్మ
డి. ఓ. పి : సంతోష్, గిరి
ఎడిటర్ : జస్విన్ ప్రభు
లిరిక్స్ : కళ్యాణ్ చక్రవర్తి
గాయకులు : ఎం. ఎం. కీరవాణి, అనురాగ్ కులకర్ణి
ఫైట్ మాస్టర్ : శివరాజ్
పి. ఆర్. ఓ : సాయి సతీష్, పర్వతనేని రాంబాబు

వైవిద్య భరితమైన కథాంశంతో వైద్య రంగంలోని దోపిడీని ప్రశ్నిస్తూ నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా “బలమెవ్వడు”. సనాతన దృశ్యాలు పతాకంపై ధృవన్ కటకం, నియా త్రిపాఠీ జంటగా సత్య రాచకొండ దర్శకత్వంలో ఆర్ బి మార్కండేయులు ఈ చిత్రాన్ని నిర్మించారు.చిత్రం. సీనియర్ నటులు ఫృథ్విరాజ్, సుహాసిని, నాజర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మెలోడి బ్ర‌హ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్ 1 న గ్రాండ్ గా ప్రేక్షకులకు ముందుకు వచ్చిన “బలమెవ్వడు’ చిత్రం ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్ టైన్ చేసిందో రివ్యూ లో చూద్దాం పదండి.


కథ
సత్యనారాయణ (ధృవన్ కటకం) ఇన్సూరెన్స్ ఏజెంట్ గా వర్క్ చేస్తుంటాడు.పాలసీ కట్టించడానికి వెళ్లిన సత్యకు అక్కడే డ్యాన్స్ చేస్తున్న క్లాసికల్ డ్యాన్సర్ పరిణిక (నియా త్రిపాఠీ)ను చూసిన మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. ఆ తరువాత బైక్ పై వెళ్తున్న పరిణిక బైక్ రిపేర్ రావడంతో పక్కన ఉన్న షెడ్ వారిని రిపేర్ చెయ్యమని హెల్ప్ అడిగితే రిపేర్ చెయ్యకుండా రేప్ చేయబోతే అనుకోకుండా అక్కడికి వచ్చిన సత్య పరిణిక ను కాపాడుతాడు. దాంతో సత్యతో స్నేహం ఏర్పడి ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారుతుంది. ఆ తరువాత హెల్త్ బాగాలేక పరిణిక హిస్పిటల్ కు వెళితే.. క్యాన్సర్ ఉంది. కీమోథెరఫీ చెయ్యాలి అంటాడు డాక్టర్ ఫణిభూషణ్ ఉరఫ్ పి.బి(పృద్వి ). పారు ఉరఫ్ పరిణిక పై ఉన్న ఇష్టంతో తనకు అండగా నిలబడడానికి హిస్పిటల్ లోనే తాళి కడతాడు సత్య.

క్యాన్సర్ ట్రీట్మెంట్ లో ఎంతో పేరు గాంచిన పి.బీ ప్రజలకు సేవ చెయ్యకుండా మెడికల్ మాఫియాతో చేతులు కలపి బిజినెస్ చేస్తూ కోట్లు గడిస్తున్న పి. బి కి జీవితంలో ఊహించని షాక్ తగులుతుంది? పి.బి కి తగిలిన షాక్ ఏంటి? అసలు పారు కు క్యాన్సర్ ఎలా సోకింది? ఆ క్యాన్సర్ బారినుండి పారును సత్య ఎలా కాపాడుకున్నాడు ? డాక్టర్ యశోద సహాయంతో మెడికల్ మాఫియా ముసుగులో అందరినీ మోసం చేస్తూ బిజినెస్ చేస్తున్న పి. బీ కి “బలమెవ్వడు” ఆ బలాన్ని సత్య, యశోద ల బుద్ది బలంతో బలహీనునిగా చేసి అక్కడ జరిగే మెడికల్ మాఫియాకు ఎలాంటి గుణ పాఠం చెప్పారు ? అనేది తెలుసు కోవాలంటే కచ్చితంగా “బలమెవ్వడు” సినిమా చూడాల్సిందే

నటీ నటుల పనితీరు
సత్యనారాయణ (ధృవన్ కటకం) సాధారణమైన మద్య తరగతి యువకుడిగా, చాలా చక్కగా నటించాడు.. హీరోయిన్ పరిణిక (నియా త్రిపాఠీ) చాలా చక్కగా, నటించింది. డాక్టర్ ఫణిభూషణ్ ఉరఫ్ పి.బి(పృద్వి ) నటన ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది. వయసులో ఉన్న వ్యక్తి గా, అలాగే వయసు మళ్ళిన పాత్రలో ఇలా రెండు షేడ్స్ లలో చాలా బాగా నటించాడు.వైద్యో నారాయణ హరీ అన్న పదానికి నిజాయితీ గల డాక్టర్ గా యశోద పాత్రలో సుహాసిని గారు రాఖీ సినిమా తర్వాత అంత పవర్ ఫుల్ రోల్ నటించి మెప్పించింది. హాస్పిటల్ ఓనర్ గా నాజర్ పాత్ర చిన్నదే అయినా కథను మలుపు తిప్పే కీలక పాత్రలలో చాలా బాగా చేశారు  పృథ్వి భార్య పాత్రలో అంజలి (పద్మ) మెప్పించింది.ఇంకా ఈ చిత్రంలో నటించిన వారంతా  తమకిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు.


సాంకేతిక నిపుణుల పనితీరు
మెడికల్ మాఫియా ఒక కామన్ మ్యాన్ ను ఎంత నలిపేస్తుంది.. దాన్ని ఎలా ఎదు ర్కోవాలో అన్న పాయింట్ తో చాలా ఇంట్రెస్ట్ కలిగించే సరికొత్త కాన్సెప్ట్ ను ఎంపిక చేసుకుని అందరికీ ఆర్త్బమయ్యేలా కథ, కథనాలను రాసుకొని ఇందులో ప్రేమ కథ తో పాటు , సున్నితమైన హాస్యం కలగలపుతూ సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే విధంగా వివరించిన తీరు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా చాలా చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు సత్య రాచకొండ. మెడికల్ మాఫియాలో జరుగుతున్న ఈ కథ కొరకు దర్శక, నిర్మాతలు చాలా కష్టపడి తీసినట్టు కనిపిస్తుంది. మ‌ర‌క‌తమ‌ణి మణిశర్మ గారు ఇచ్చిన మ్యూజిక్, ఆర్ ఆర్ వలన సినిమా చూస్తున్న ప్రేక్షకులకు పెద్ద సినిమా చూస్తున్న ఫీల్ కలుగుతుంది.

‘ప్రేమంటే భద్రం కొడుకో’ పాట, శ్రీమద్ రామా రమణ గోవిందో హార్.. అంటూ సాగే ఈ పాటలు చిత్రానికే హైలెట్ గా నిలుస్థాయి.. గీత ర‌చ‌యిత ఎంతో ప్రాణం పెట్టి రాసిన పాటలు అర్థ‌వంతంగా వుంటూ అందరినీ ఆలోచింప‌జేసేవిగా అనిపిస్తాయి. క్లెమాక్స్ లో కీరవాణి గారు పాడిన టైటిల్ సాంగ్‌ “కృష్ణం వందే జగద్గురుం’ ను తలపిస్తుంది. ఈ పాట వింటున్న వారికి కచ్చితంగా గూజ్ బమ్స్ వచ్చేలా ఉంది. అడ్డదిడ్డంగా సంపాదించిన డబ్బు నీకు బలమనుకున్నావా అన్న డైలాగ్స్ ఆలోచింప చేసే విధంగా ఉన్నాయి. పృథ్వి గారితో పాటు హీరో హీరోయిన్ ల నటనకు అవార్డు వచ్చేలా అద్భుతంగా నటించారు అని చెప్పవచ్చు. సంతోష్, గిరి సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. జస్విన్ ప్రభు ఎడిటింగ్ గ్రిప్పింగ్ గా ఉంది.ఫైట్ మాస్టర్ శివరాజ్ అందించిన యాక్షన్ ఫైట్స్ ఇలా ఇవన్నీ కథను మరో స్థాయికి తీసుకెళ్లాయి.

సనాతన దృశ్యాలు పతాకంపై ఆర్. బి. మార్కండేయలు నిర్మించిన నిర్మాణ విలువలు క్వాలిటీ గా.. రిచ్ గా ఉన్నాయి. ఖర్చు విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు.కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఓ మంచి విషయాన్నీ ఇలా మెసేజ్ ఫ్లస్ ఎంటర్ టైన్ మెంట్ కలిసి చూపించే సినిమాలు చాలా తక్కువ. అలాంటి అరుదైన చిత్రాలు వస్తే తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఇప్పుడు వస్తున్న సినిమాలను భిన్నంగా మంచి మెసేజ్ ఇచ్చే కథతో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన “బలమెవ్వడు ” సినిమా చూసిన వారందరికీ కచ్చితంగా నచ్చుతుంది.

Cinemarangam.Com Review Rating..3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here