Mega Brother Nagababu released the first look of Adire Abhi “White Paper” movie

జి.ఎస్.కె ప్రొడక్షన్స్ పతాకం పై శివ దర్శకత్వం వహిస్తూ,
గ్రంధి శివ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ” వైట్ పేపర్” (White Paper). ప్రభాస్ హీరో గా నటించిన ఈశ్వర్ చిత్రం లో ప్రభాస్ ఫ్రెండ్ గా తన నట జీవితాన్ని ప్రారంభించిన అభినయ కృష్ణ, ఎన్నో చిత్రాల్లో నటుడుగా కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు. జబర్దస్త్ టివి షో తో అదిరిపోయే కామెడీ పెర్ఫార్మెన్స్ తో అదిరే అభి గా ప్రసిద్ధి చెందాడు. ఇప్పుడు ఈ వైట్ పేపర్ చిత్రం తో హీరో గా పరిచయం కాబోతున్నాడు.

ఈ చిత్రాన్ని కేవలం 10 గంటల వ్యవధిలో పూర్తీ చేసారు. ఈ సందర్భంగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు అరుదైన చిత్రంగా సత్కరించారు. వైట్ పేపర్ 1స్ట్ లుక్ ను నాగబాబు విడుదల చేసారు.

ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ “వైవిధ్య కథనాలు ఎంచుకోవడంలో మా అభి ముందు ఉంటాడు, అలానే ఇప్పుడు ఈ వైట్ పేపర్ సినిమా ని కూడా డిఫరెంట్ గా చేసాడు, 1స్ట్ లుక్ లో అభి ని చూస్తుంటే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ లా ఉన్నాడు, అభి అండ్ వాళ్ళ టీం పడిన కష్టానికైన ఈ సినిమా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను, టీం అందరికి నా శుభాకాంక్షలు.

హీరో అభి మాట్లాడుతూ ” మొన్న విడుదల చేసిన టైటిల్ లుక్ కి మంచి బజ్ క్రియేట్ ఐనది, ఇప్పుడు మా సినిమా 1స్ట్ లుక్ ని నాగబాబు గారు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది.

డైరెక్టర్ శివ మాట్లాడుతూ.. “సస్పెన్స్ కథనంతో తెరకెక్కిన ఈ సినిమా లో అభి హీరో గా నటించారు. నాగబాబు గారి బ్లేసింగ్స్ మా టీం అందరికి ఉండాలి, పోస్టర్ చూస్తుంటే మేము పడిన కష్టం మరిచిపోతున్నాం, ఇలా పెద్దలందరు మా సినిమా ని , మేము చేసిన ప్రయోగాన్ని మెచ్చుకుంటున్నారు, చాలా సంతోషంగా ఉంది” అన్నారు.ఈ కార్యక్రమంలో రాజశేఖర్, శ్యామ్ ప్రసాద్, రవి వంశీ లు పాల్గొన్నారు.

అదిరే అభి ( అభినయ కృష్ణ), వాణి, తల్లాడ సాయి కృష్ణ ,నేహా, నంద కిషోర్ తదితరులు నటించిన

ఈ సినిమా కి
*నిర్మాత – గ్రంథి శివ ప్రసాద్*
*డైరెక్టర్- శివ*,
కేమేరా- మురళి కృష్ణ,
*ఎడిటింగ్- కె.సి.బి. హరి*
సంగీతం – నవనిత్ చారి,
*పి.ఆర్.ఓ- పవన్ పాల్*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here