Aa Rojulu Malli Raavu’ song from Niharika Konidela’s Movie “Committee Kurrollu”

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధ దామోదర్ స్టూడియో బ్యానర్లపై నిహారిక కొణిదెల సమర్పణలో‘కమిటీ కుర్రోళ్లు’ అనే చిత్రాన్ని పద్మజ కొణిదెల, జయలక్ష్మీ అడపాక నిర్మించారు. ఎద వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు,త్రినాద్ వర్మ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు.

ఈ చిత్రం నుంచి ఇప్పటికే వదిలిన పాట, పోస్టర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఓ ఫీల్ గుడ్ పాటను రిలీజ్ చేశారు. నాటి రోజుల్లోకి తీసుకెళ్లేలా ఉన్న ‘ఆ రోజులు మళ్లీ రావు’ అనే ఈ పాటను సింగర్ కార్తిక్ ఆలపించారు. కృష్ణ కాంత్ రాసిన ఈ పాట మన మూలాల్ని గుర్తు చేసేలా ఉన్నాయి. అనుదీప్ దేవ్ బాణీ ఎంతో క్యాచీగా,వినసొంపుగా, హాయిగా ఉంది. ఈ లిరికల్ వీడియోని చూస్తే మళ్లీ మన ఊర్లోకి వెళ్లాలని అనిపించేలా ఉంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌గా రాజు ఎడురోలు వ్యవహరిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా అనుదీప్ దేవ్ వ్యవహరిస్తున్నారు. ఎడిటర్‌గా అన్వర్ అలీ పని చేస్తున్నారు.

T-Series ద్వారా “కమిటీ కుర్రోళ్ళు” పాటలు విడుదల

నటీనటులు :

సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు,త్రినాద్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, రాధ్య, తేజస్వి రావు, టీనా శ్రావ్య,విషిక, షణ్ముకి నాగుమంత్రి ..ముఖ్య పాత్రల్లో సాయి కుమార్ ,గోపరాజు రమణ,బలగం జయరాం,శ్రీ లక్ష్మి ,కంచెరపాలెం కిషోర్ ,కిట్టయ్య ,రమణ భార్గవ్,జబర్దస్త్ సత్తిపండు తదితరులు

సాంకతిక వర్గం :

సమర్పణ – నిహారిక కొణిదెల, బ్యానర్స్- పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్, నిర్మాతలు – పద్మజ కొణిదెల,జయలక్ష్మి అడపాక, రచన, దర్శకత్వం – యదు వంశీ, సినిమాటోగ్రఫీ – రాజు ఎడురోలు, మ్యూజిక్ డైరెక్టర్ – అనుదీప్ దేవ్, ప్రొడక్షన్ డిజైనర్ – ప్రణయ్ నైని, ఎడిటర్ – అన్వర్ అలీ, డైలాగ్స్ – వెంకట సుభాష్ చీర్ల, కొండల రావు అడ్డగళ్ల, ఫైట్స్ – విజయ్, నృత్యం – జె.డి మాస్టర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – మన్యం రమేష్, సౌండ్ డిజైన‌ర్‌: సాయి మ‌ణింద‌ర్ రెడ్డి, పోస్ట‌ర్స్‌: శివ‌, ఆడియో: T-Series, ఈవెంట్ పార్ట్‌న‌ర్‌: యు వి మీడియా, మార్కెటింగ్‌: టికెట్ ఫ్యాక్ట‌రీ, ఆడియో – టి సిరీస్ పి.ఆర్.ఒ- బియాండ్ మీడియా (నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here