Mega Prince Varun Tej released the trailer of ZEE5 original series ‘Paruvu’.. Streaming from June 14th

గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ మీద విష్ణు ప్రసాద్ లగ్గిశెట్టి, సుస్మిత కొణిదెల నిర్మించిన ZEE5 ఒరిజినల్ సిరీస్ ‘పరువు’. సిద్దార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ ఈ చిత్రానికి దర్శకులు. ఈ మూవీలో నాగబాబు, నివేదా పేతురాజ్, నరేష్ అగస్త్య, ప్రణీత పట్నాయక్, బిందు మాధవి, అమిత్ తివారి వంటి వారు ప్రముఖ పాత్రలు పోషించారు. పవన్ సాధినేని షో రన్నర్‌గా రాబోతోన్న ఈ ZEE5 ఒరిజినల్ సిరీస్ జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. మొదటి ఎపిసోడ్‌ను అందరూ ఉచితంగానే వీక్షించవచ్చు. ఇక ఈ క్రమంలో ‘పరువు’ ట్రైలర్‌ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రిలీజ్ చేశారు.

ఇక ఈ ట్రైలర్‌ను చూస్తుంటే పరువు అనే టైటిల్ ఎందుకు పెట్టారో క్లియర్‌గా అర్థం అవుతోంది. ఓ ప్రేమ జంట, కులాలు అడ్డు రావడం, పారిపోయి పెళ్లి చేసుకోవడం, పరువు కోసం పేరెంట్స్ చేసిన డ్రామా.. ఆ జంటకు ఎదురైన కష్టాలు ఇలా అన్నింటిని ఎంతో ఉత్కంఠభరితంగా ఈ ట్రైలర్‌లో చూపించారు. కారు డిక్కీలో ఉన్న శవం ఎవరిది? మర్డర్ కేస్ నుంచి ఎలా బయటపడ్డారు? పరువు హత్యకు గురవుతామని భయపడ్డ వాళ్లే.. ఓ హత్యను చేయడంతో ఎదురైన కష్టాలు ఏంటి? వాటి నుంచి ఎలా బయటపడ్డారు? ఇలా అనేక ఆసక్తికరమైన ప్రశ్నలు లేవనెత్తేలా ట్రైలర్ ఉంది.

బిందు మాధవి ట్రైలర్ చివర్లో ఎంట్రీ ఇవ్వడం, నివేదా పేతురాజ్ బిందు మాధవి మధ్య వచ్చే సీన్ అదిరిపోయింది. ఇక నాగబాబు చాలా రోజులకు ఓ సీరియస్ పాత్రను పోషించినట్టుగా కనిపిస్తోంది. శ్రావణ్ భరద్వాజ్ ఆర్ఆర్ ట్రైలర్‌లో అదిరిపోయింది. చింతా విద్యా సాగర్ సినిమాటోగ్రఫీ ఎంతో నేచురల్‌గా ఉంది.

ZEE5 గురించి…

జీ5 భార‌త‌దేశ‌పు యంగ‌స్ట్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్. మల్టీలింగ్వుల్ స్టోరీటెల్ల‌ర్‌గా ప్ర‌సిద్ధి పొందింది. మిలియ‌న్ల కొద్దీ అభిమానుల‌ను సంపాదించుకుంది. గ్లోబ‌ల్ కంటెంట్ ప‌వ‌ర్ హౌస్ జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎంట‌ర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీఎల్‌) నుంచి శాఖ‌గా మొద‌లైంది జీ5. అత్య‌ద్భుత‌మైన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ గా పేరు తెచ్చుకుంది. 3,500 సినిమాల లైబ్ర‌రీ ఉన్న ప్లాట్‌ఫార్మ్ ఇది. 1,750 టీవీ షోలు, 700 ఒరిజిన‌ల్స్, 5 ల‌క్ష‌ల‌కు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ ఈ సంస్థ సొంతం. 12 భాష‌ల్లో (హిందీ, ఇంగ్లిష్‌, బెంగాలీ, మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళ్‌, మ‌రాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజ‌రాతీ, పంజాబీ)లో అందుబాటులో ఉంది. బెస్ట్ ఒరిజిన‌ల్స్, ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీస్‌, టీవీ షోస్‌, మ్యూజిక్‌, కిడ్స్ షోస్‌, ఎడ్‌టెక్‌, సినీ ప్లేస్‌, న్యూస్‌, లైవ్ టీవీ, హెల్త్, లైఫ్‌స్టైల్ విభాగాల్లో ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేస్తోంది. ఇంత గొప్ప డీప్ టెక్ స్టాక్ నుంచి ఎదిగిన ప్లాట్‌పార్మ్ కావ‌డంతో జీ5 12 భాష‌ల్లో అత్య‌ద్భుత‌మైన కంటెంట్‌ని ప్రేక్ష‌కుల‌కు అందించ‌గ‌లుగుతోంది.

నటీనటులు :

నరేష్ అగస్త్య, నివేదా పేతురాజ్, నాగబాబు, రమేష్, సునిల్ కొమ్మిశెట్టి, ప్రణీత పట్నాయక్, రాజ్ కుమార్ కసిరెడ్డి, మోయిన్, అమిత్ తివారి, అనిల్ తేజ, బిందు చంద్రమౌళి, అఖిలేష్, బోస్ అన్నియ్య, రవితేజ మహాదాస్యం, మాధవి, సంతోష్ నందివడ తదితరులు

సాంకతిక వర్గం :

షో రన్నర్: పవన్ సాదినేని
బ్యానర్స్- గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లి. , నిర్మాతలు – విష్ణు ప్రసాద్ లగ్గిశెట్టి, సుస్మిత కొణిదెల, దర్శకత్వం – సిద్దార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్, మాటలు,రచయిత – సిద్దార్థ్ నాయుడు, సినిమాటోగ్రఫీ – చింతా విద్యా సాగర్, మ్యూజిక్ డైరెక్టర్ – శ్రవణ్ భరద్వాజ్, ప్రొడక్షన్ డిజైనర్ – నార్ని శ్రీనివాస్, ఎడిటర్ – విప్లస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – పొట్ల లక్ష్మీ శరణ్య, పి.ఆర్.ఒ- బియాండ్ మీడియా (నాయుడు సు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here