Megastar Birthday Grand Celebrations in Blood Bank!

మెగాస్టార్ … టాలీవుడ్ తెరపై ఎవరెస్టు శిఖరమంత ఇమేజ్ తెచ్చుకున్న వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే. నటుడిగా వెండితెరపై రికార్డులు సృష్టించారు. మనిషిగా సామజిక సేవా కార్యక్రమాలతో ప్రపంచ ప్రసిద్ధిగాంచారు. మెగాస్టార్ చిరంజీవి అంటే ఆయనను అభిమానించే ప్రతి అభిమాని అన్నయ్య అంటూ ముద్దుగా పిలుచుకునే మెగాస్టార్ చిరంజీవి జన్మదిన  వేడుకలు ఆగస్టు 22న చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు అంధ్వర్యంలో గ్రాండ్ గా జరిగాయి. అశేష అభిమానుల సమక్షంలో చిరంజీవి పుట్టినరోజు వేడుకలు జరుగాయి. ఈ వేడుకలో ముఖ్య అతిధులుగా ప్రముఖ దర్శకుడు వి వి వినాయక్, దర్శకుడు బాబీ, అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు రవణం స్వామి నాయుడుతో పాటు తదితర మెగా అభిమానులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా సంగీత దర్శకుడు స్వరసాగర్ మహతి మ్యూజిక్ దర్శకత్వంలో శ్రీ రామజోగయ్య శాస్త్రి గారు రచించిన song ని స్వరాగ్ కీర్తన్ పాడిన స్పెషల్ సాంగ్ ని మరియు మహిత్ నారాయణ్ మెగాస్టార్ పై రూపొందించిన సాంగ్స్ ని విడుదల చేసారు.

అలాగే మెగా అభిమానులు నిరంతరం సేవాతత్పరతను చాటుతున్న అభిమానులను సన్మానించారు.

ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ మాట్లాడుతూ .. మెగాస్టార్ అభిమానిగా.. ఆయనను అన్నయ్య అంటూ పిలుచుకుంటూ నేను ఒక తమ్ముడిగా పెరిగాను. చిరంజీవి గారు ఒక్కరు సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు పదిమంది హీరోలను మనకు అందించారు. అది చాలు చిరంజీవి గారు చేసిన గొప్ప పని.
చిరంజీవి గారు పూజించే ఆంజనేయస్వామి భక్తుడు, ఆంజనేయస్వామి కి ఎలా వయసు తెలియదో.. అలాగే చిరంజీవిగారికే వయసు పెరగదు,  చిరంజీవి గారు మరో పాతికేళ్ళు అయనే మెగాస్టార్.

ఆ ఎనర్జీ ఎక్కడ తగ్గదు. అన్నయ్యకి చాలా ఇష్టమైనది ఏమిటో తెలుసా.. కెమెరా. కెమెరా ముందుకు అయన వస్తే కెమెరా, అయన తప్ప మిగతా అంతా శూన్యం. వారిద్దరికీ అలా సెట్ అయింది. కెమెరా ముందు అయన ఎన్ని వండర్స్ చేస్తారో అందరికి తెలుసు. అన్నయ్య ఏ స్థాయినుండి ఈ రోజు ఈ స్థాయికి వచ్చాడో అందరికి తెలుసు, అయన జీవితం అందరికి స్ఫూర్తి. అయన ప్రతి పుట్టిన రోజు అందరికి పండగే..

కానీ ఈ సారి మాత్రం పుట్టినరోజు నాడు మూడు నాలుగు సినిమాల ఫస్ట్ లుక్ లతో సోషల్ మీడియాలో ట్రేండింగ్ అయింది. ఇది సంక్రాంతి కి మించి పెద్ద పండగలా ఉంది. అయన ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలని, ఆయనతో మేము కూడా సినిమాలు తీస్తూ మీకు ఆనందాన్ని పంచుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు.

దర్శకుడు బాబీ మాట్లాడుతూ .. నాకు రవణం స్వామి నాయుడు గారు ఫోన్ చేసి చిరంజీవి గారి బర్త్ డే ఫంక్షన్ ఉంది రమన్నారు .. కానీ నాకు ఆనందం, కోపం రెండు కలిగాయి.. ఎందుకనే చిరంజీవిగారి ఫంక్షన్ అంటే రమ్మంటే చాలు రామా, ఆయనంటే చిన్నప్పటినుండి నాకు చాలా ఇష్టం. చిరంజీవి అభిమానిగా ఉన్న నేను ఆయనతో సినిమా చేస్తున్నాను . చిరంజీవి గారి 154 వ సినిమా చేస్తున్నాను. చిన్నప్పటినుండి ఆయనను చూస్తూ పెరిగాను. అయన లుంగీ కట్టి మాస్ లుక్కులో ఎలా అదరగొడతాడో అంతకు మించి నా సినిమాలో ఉంటుంది. అభినులు ఎలా అయితే ఆయనను చూడాలనుకుంటున్నారో అలాంటి  ;లుక్కులోనే అయన కనిపిస్తారు.

చిరంజీవి గారు హీరోగా ఎంత రేంజ్ లో ఉన్నాడో సేవా తత్పరతలో కూడా అయన అదే స్థాయి. కుడిచేతితో చేసిన సాయం ఎడమచేతి తెలియకూడదని అంటుంటారు ..

కానీ అయన ఎప్పుడినుండో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక్క మెగాస్టార్ వల్ల ఈ రోజు పరిశ్రమలో పదిమంది హీరోలు వచ్చారు .. వాళ్ళ వాల్ల ఈ రోజు పరిశ్రమకు వెయ్యికోట్ల ఆదాయం కలుగుతుంది. నిజంగా చిరంజీవి గారి జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తి, మీరిచ్చిన స్పూర్తితో మేము ఎప్పడూ మీ తమ్ముళ్లుగానే ఉంటాము అని చెప్పారు.

ఆదివారం మెగాస్టార్ జన్మదిన వేడుకల నేపథ్యంలో శనివారం చిరంజీవి బ్లడ్ బ్యాంకు ఆధ్వర్యంలో మెగా అభిమానులను సన్మానించుకున్నారు. ఈ కార్యక్రమంలో మెగా బ్రదర్ నాగబాబు, దర్శకుడు మెహర్ రమేష్ పాల్గొన్నారు.

ఈ వేదికపై మెగా అభిమానులుగా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న అభిమానులను  మెమొంటోలతో సన్మానించారు.

అనంతరం దర్శకుడు మెహర్ రమేష్ మాట్లాడుతూ .. నా ఊహ తెలిసినప్పటినుండి చిరంజీవి గారి బర్త్ డె అంటే చాలా ఇష్టం. అయన ఎన్నో సేవాకార్యక్రమాలు చేసారు .. ముక్యంగా కరోనా సమయంలో సినిమా పరిశ్రమ కార్మికులకు సీసీసీ ద్వారా నిత్యావసర సరుకులు అందచేసిన సంగతి తెలిసిందే. చిరంజీవి గారి అభిమానులుగా ఉండడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.

మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ .. కరోనా సమస్య వల్ల అన్నయ్య బర్త్ డే వేడుకలు ఎక్కువ హంగామా లేకుండా జరుపుకుంటున్నాము. అన్నయ్య తో ఎప్పటికి వెంటుండే అభిమానులను చుస్తే నాకు ఆనందంగా ఉంది. చిన్నప్పటినుండి నేను ఈ అభిమానులను చూస్తున్నాను.. ఇప్పుడు చాలా మందికి తెల్ల గడ్డం, వెంట్రుకలు చేస్తూనే నవ్వొస్తుంది .. వీళ్లంతా నాకు తెలుసు. అన్నయ్యను అభిమానించే వీరంతా అయన వెంటుండి ఎంత సపోర్ట్ అందిస్తున్నారు. అన్నయ్య చేసే ప్రతి సేవా కార్యక్రమంలో అభిమానులు తోడుగా ఉన్నారు. వాళ్ళు లేకుండా ఇలాంటి కార్యక్రమాలు సాధ్యం కాదు.. అన్నయ్య తో అభిమానులు అలా కలిసిపోయారు.  అన్నయ్య గురించి చెప్పాలంటే అయన ప్రతి ఒక్కరికి స్ఫూర్తి నింపేవిధంగా ఉంటారు. అయన చేసే హార్డ్ వర్క్ గురించి కొత్తగా చెప్పేది ఏమిలేదు. అన్నయ్య లేటెస్ట్ గా చాలా కొత్తగా తయారయ్యాడు .. ఆయనను చుస్తే పవన్ కళ్యాణ్ కంటే చిన్నవాడిగా కనిపిస్తాడు .. అయన ఏదైనా తలచుకుంటే అది చేస్తాడు. అన్నయ్య కు పరిశ్రమలో ప్రతి ఒక్కరితో మంచి అనుభందం ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క హీరోతో అన్నయకు మంచి అనుబంధం ఉంది. కొత్త హీరో  అయినా కూడా అతన్ని ప్రోత్సహించే వ్యక్తి అన్నయ్య అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here