Megastar Chiranjeevi’s birthday wishes to Mega Powerstar Ram Charan

టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రౌద్రం రణం రుధిరం’ సినిమాలో  నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే రేపు తన 34వ పుట్టినరోజుని జరుపుకోనున్న రామ్ చరణ్ కు ఆయన తండ్రి మెగాస్టార్ చిరంజీవి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా విషెస్ తెలిపారు.

చిన్నప్పటి చరణ్ ని తాను ఎత్తుకుని ఉన్న ఫోటో ని షేర్ చేసిన మెగాస్టార్, అందరి తండ్రుల వలే తనకు కూడా చరణ్ పుట్టినపుడు ఎంతో సంతోషం కలిగిందని, అయితే సరిగ్గా మార్చి 27 ప్రపంచ రంగస్థల దినోత్సవం రోజునే చరణ్ ఎందుకు పుట్టాడో తనకు ఆ తరువాతనే అర్ధం అయిందని, చేప పిల్లకు ఈత నేర్పవలసిన అవసరం లేకుండా తన అనంతరం చరణ్ కూడా యాక్టింగ్ లో అదరగొడుతున్నాడని గుర్తుచేసుకుంటూ రామ్ చరణ్ కు విషెస్ తెలిపారు మెగాస్టార్.

     

Ramcharan celebrates his Birthday with Upasna’s Homemade Healthy Cake. The best quarantine recipe.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here