Message Oriented ‘Viswak’ Movie Review

Cinemarangam.com
రివ్యూ రేటింగ్ . 3/5
సినిమా “విశ్వక్”
బ్యానర్ : గోల్డెన్ డక్ ప్రొడక్షన్స్
నిర్మాత : తాటికొండ ఆనందం బాల కృష్ణ
లైన్ ప్రొడ్యూసర్: ఎం ఉదయ్ భాస్కర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవికాంత్ జలగం
నటీనటులు : అజయ్ కతుర్వార్, డింపుల్, అజయ్ ,నిఖిల్ ,లిఖిత్  శ్రీకాంత్, అప్పాజీ
డి.ఓ.పి : ప్రదీప్ దేవ్
దర్శకుడు: వేణు ముల్కాకా
సంగీతం: సత్య సాగర్ పొలం
ఎడిటర్: కె విశ్వనాథ్
ప్రొడక్షన్ మేనేజర్: అల్లూరి చంద్రశేఖర్

ఇప్పుడు ట్రెండ్ మారింది కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలకు ఆదరణ పెరిగింది. కథ బావుంటే చాలు ప్రేక్షకులు బ్రహ్మ రథం పడుతున్నారు.దీంతో పెద్ద హీరోలు సైతం ఇలాంటి సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు.అలాంటి కోవలో అజయ్ కతుర్వార్ క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అవుతూ మ‌న ఇండియాలోని మేథావులు వ‌ల‌స‌లు వెళుతుంటే దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది? స‌త్య నాగెళ్ళ‌, సుంద‌ర్ పిచాయ్ వంటి వారు ఇండియా వ‌స్తే ఎంతో అభివృద్ధి చెందుతుంది. దేశం అభివృద్ధి చెందాలంటే మేథావులంతా ఇక్క‌డే వుంటే ఎంతో అభివృద్ధి చెందదా! అన్న కోణంలో సోషల్ కాజ్ ఉన్న డీఫ్రెంట్ కాన్సెప్ట్  చిత్రాన్నీ సెలెక్ట్ చేసుకొని నటిస్తున్న చిత్రం `విశ్వ‌క్. అందుకోస‌మే ఈ విశ్వ‌క్ ప్ర‌పంచ‌మంతా వ్యాపింప‌జేస్తాడ‌నే కాప్ష‌న్‌ పెట్టారు.గోల్డెన్ డక్ ప్రొడక్షన్స్ బేన‌ర్‌పై  తాటికొండ ఆనందం బాల కృష్ణ నిర్మించారు. వేణు ముల్కాకా ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌య‌మ‌ వుతున్నారు. కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ నుంచి ట్రైలర్స్ చూసిన ఆడియన్స్ లో ఆసక్తి ఏర్పడింది. సోషల్ కాజ్ తో మంచి కాన్సెప్ట్ తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన “విశ్వక్” చిత్రం ఫిబ్ర‌వ‌రి 18న ప్రపంచ వ్యాప్తంగా  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో చూద్దాం పదండి.

కథ
విశ్వక్ (అజయ్ కతుర్వార్), తండ్రి అప్పాజికి తెలిసిన వారి కొడుకులు అమెరికాకు వెళ్లిపోతుంటే అది చూసి విశ్వక్ ను కూడా అమెరికా వెళ్ళమని ఫోర్స్ చేస్తుంటాడు.అమెరికాకు వెళ్లకుండా ఇక్కడే బిజినెస్ స్టార్ట్ చేస్తానని తండ్రిని కన్విన్స్ చేస్తాడు. తండ్రి ఇచ్చిన డబ్బుతో ఒక స్టార్టప్ కంపెనీ పెడతాడు. బిజినెస్ డెవలప్ మెంట్ కొరకు ఒక విదేశీయుని దగ్గరకు వెళ్లి తన దగ్గరున్న కాన్సెప్ట్ చెప్పి ఇన్వెస్ట్ చేయమంటే దేశాన్ని తిడుతూ విశ్వక్ ను రోడ్డుపైకి గెంటేఇస్తాడు.అలా తాను ఆనుకున్న కాన్సెప్ట్ కు ఇండియాలో ఎవరూ స్పాన్సర్ చేయడానికి ముందుకు రాకపోవడంతో నష్టం వచ్చి రెండు సార్లు కంపెనీని ఓపెన్ చేసి క్లోజ్ చేస్తాడు.మరోవైపు ఓ రైతు కొడుకు వీరయ్య (శ్రీకాంత్) వ్యవసాయం దండగ అని పట్నం వెళుతుంటే వద్దని తన లాగే రైతును చేయాలని వీరయ్య తండ్రి తాపత్రయ పడుతుంటారు. అయితే విల్లేజ్ లో పంట వేసినా పండించలేక ఫెయిల్ అవుతుంటాడు..ఇటు బిజినెస్ లో విశ్వక్ సక్సెస్ కాలేకపోతాడు. బిజినెస్ లో సక్సెస్ కానందున తన భావాలు,తన ఆలోచనలకు దగ్గరగా ఉన్న అమ్మాయి కూడా తనకు దూర మవుతుంది. అయితే.. ఇలా జరగడానికి అమెరికా వెళ్తున్న ఎన్.ఆర్.ఐ లే .కారణమని తెలుసుకొంటాడు. వారికున్న ట్యాలెంట్ ను ఇండియాలో ఇన్వెస్ట్ చేయకుండా అమెరికాలో ఇన్వెస్ట్ చేయడం వలన ఆదేశం అభివృద్ధి చెంది, మనదేశం వెనుకబడిపోతుంది. అందుకే అమెరికాకు వెళ్లిన వారంతా ఇండియాకు వచ్చి  ఇన్వెస్ట్ చేస్తే మనదేశం డెవలప్ అవుతుందని అంటాడు.చెప్పినా వినకుండా అమెరికాకు వెళ్లే వారిని కిడ్నాప్ చేస్థూ.. విదేశాలకు వెళ్లిన వారంతా తిరిగి రావాలని.. ఎన్నారైలకు సవాల్ విసురుతాడు.అర్బన్ డెవలప్మెంట్ ద్వారా దేశాన్ని అభివృద్ధి చేద్దామని సూచిస్తాడు.విదేశాల్లో ఉన్న వారంతా ఇండియాకు రావాలని ఆగస్ట్ 15  డెడ్ లైన్ విధిస్తాడు.చివరికి విదేశాల్లో ఉన్న వారంతా ఇండియాకు వచ్చి ఆగస్ట్ 15 న జెండా ఎగిరేశారా ?.ఈ క్రమమంలో తను ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.?. అనేది తెలుసు కోవాలంటే ‘విశ్వక్’ సినిమా చూడాల్సిందే..

నటీనటుల పనితీరు
విశ్వక్ (అజయ్ కతుర్వార్), సాధారణమైన మద్య తరగతి యువకుడిగా, చాలా చక్కగా నటించాడు.. హీరోయిన్ డింపుల్ చాలా చక్కగా, నటించింది. విశ్వక్ ఫ్రెండ్స్ అజయ్ ,నిఖిల్ ,లిఖిత్ చాలా బాగా చేశారు  రైతు పాత్రలో  వీరయ్య గా చేసిన శ్రీకాంత్ నటన చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది.హీరో తండ్రి గా అప్పాజీ చక్కని నటనను ప్రదర్శించాడు. ఇంకా మిగిలిన వారంతా  తమకిచ్చిన పాత్రలలో చాలా చక్కగా నటించారు

సాంకేతిక నిపుణుల పనితీరు

అభివృద్ధి చెందిన దేశాలలో భారత్ నెంబర్ 1 గా వుండాలనే కాన్సెప్ట్ అద్భుతంగా ఉంది. దర్శకుడు అందరికీ ఆర్త్బమయ్యేలా చాలా చక్కగా వివరించారు.దర్శకుడు వేణు ముల్కాకా మధ్యతరగతి విలువలను ప్రతిబింబించే ఓ సరికొత్త  కథను ఎంపిక చేసుకుని కథ, కథనాలను చాలా చక్కగా తెరకెక్కించాడు. ఇప్పుడు విద్యార్థులు కాలేజీ డేస్‌ పూర్తి కాకముందే  విదేశాల‌కు వెళ్ళేలా ప్లాన్ చేసుకుంటున్నారు అయితే ఇక్క‌డ‌నుండి వెళ్ళిన‌వారు అక్కడ ఎలా క‌ష్ట‌ప‌డుతున్నారు. తద్వారా ఇక్క‌డ మ‌నం ఏం కోల్పోతున్నామో అనేది అర్థ‌వంతంగా ఈ సినిమాలో దర్శకుడు చాలా చక్కగా చూపించాడు.అలాగే రైతుకు ప్రాబ్లెమ్ వస్తే మీడియా,సోషల్ మీడియా లు అండగా నిలబడి వారికి న్యాయం జరిగేలా చూస్తాయి…అయితే చఫువుకున్న వాడికే కష్టమొస్తే వారికి ఎఫురున్నారు అంటూ.అర్బన్ లో యూత్ ఆత్మహత్య గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. రైతు సమస్యలను చూపిస్తూ విలేజ్ బ్యాక్ డ్రాప్, సిటీ బ్యాక్ డ్రాప్ లలో ఈ సినిమా తీయడం జరిగింది.కానీ యూత్ కి కష్టం వస్తే ఎవరూ రావడం లేదు అనేది దర్శకుడు చాలా చక్కగా వివరించాడు.ఇందులో ఉన్న ఐదుపాట‌లు బాగున్నాయి. గీత ర‌చ‌యిత ఎంతో ప్రాణం పెట్టి రాసిన పాటలు అర్థ‌వంతంగా వుంటూ ఎన్‌.ఆర్‌.ఐ.ల‌ను ఆలోచింప‌జేసేవిగా అనిపిస్తాయి. అలాగే ఇందులో ఉన్న రాప్‌ సాంగ్‌ను గాయ‌కులు చ‌క్క‌గా పాడారు . ప్రదీప్ దేవ్ సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది.కె విశ్వనాథ్ ఎడిటింగ్ గ్రిప్పింగ్ గా ఉంది. ఇవన్నీ కథను మరో స్థాయికి తీసుకెళ్లాయి. గోల్డెన్ డక్ ప్రొడక్షన్స్ పతాకంపై తాటికొండ ఆనందం బాలకృష్ణ. ఎం ఉదయ్ భాస్కర్, రవికాంత్ జలగం లు సంయుక్తంగా నిర్మించిన నిర్మాణ విలువలు క్వాలిటీ గా.. రిచ్ గా ఉన్నాయి. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు.కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఓ మంచి విషయాన్నీ ఇలా మెసేజ్ ఫ్లస్ ఎంటర్ టైన్ మెంట్ కలిసి చూపించే సినిమాలు చాలా తక్కువ. అలాంటి అరుదైన చిత్రాలు వస్తే తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తాయి. అలాంటి కథతో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన “విశ్వక్”  సినిమా చూసిన వారందరికీ కచ్చితంగా నచ్చుతుంది.

         Cinemarangam.com Review Rating..3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here