Message Oriented ‘Back Door’ Movie Review

Cinimarangam.com
రివ్యూ రేటింగ్ : 3/5
సినిమా : బ్యాక్ డోర్
బ్యానర్: కె.ఆర్.ఫిల్మ్ ఇంటర్నేషనల్,
నిర్మాత: బి.శ్రీనివాస్ రెడ్డి,
రచన-దర్శకత్వం: కర్రి బాలాజీ!!
నటీనటులు : పూర్ణ, తేజ త్రిపురాన తదితరులు
ఎగ్జిక్యూటివ్: ప్రొడ్యూసర్: రేఖ,
కో-ప్రొడ్యూసర్: ఊట శ్రీను,
కో-డైరెక్టర్: భూపతిరాజు రామకృష్ణ-ఖాజావల్లి,
పబ్లిసిటీ డిజైనర్: విక్రమ్ రమేష్,
కొరియోగ్రఫీ: రాజ్ కృష్ణ,
పాటలు: నిర్మల- చాందిని,
సంగీతం: ప్రణవ్,
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: రవిశంకర్,
ఆర్ట్: నాని,
ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్,
కెమెరా: శ్రీకాంత్ నారోజ్,
ప్రొడక్షన్ డిజైనర్: విజయ ఎల్.కోట,

పూర్ణ ప్రధాన పాత్రలో.. తేజ త్రిపురాన హీరోగా ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన క్రేజీ ఎంటర్టైనర్ లో కె.ఆర్.ఫిల్మ్ ఇంటర్నేషనల్ అధినేత కందల కృష్ణారెడ్డి “బ్యాక్ డోర్” చిత్రానికి గల క్రేజ్ కి తగ్గట్టు… భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా  25న థియేటర్లలో విడుదల చేశారు మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం పదండి..

కథ
అంజలి (పూర్ణ) భర్త బిజినెస్ పనుల్లో  తీరికలేకుండా ఉండడంతో ఇంటి బాధ్యతలన్నీ తనే చూసుకుంటూ తనకున్న ఇద్దరు పిల్లలతో హ్యాపీగా జీవిస్తుంటుంది. అయితే అనుకోకుండా అంజలి వెళ్లిన  పెళ్లికే అరుణ్ (తేజ త్రిపురాన) వస్తాడు.ఆ పెళ్లి లో అంజలికి అరుణ్ పరిచయం అవుతాడు. అరుణ్ చెప్పే మాటలు,తన బిహేవియర్ నచ్చడంతో  అరుణ్ ను ఇష్టపడుతుంది.మరో వైపు అంజలిని చూసిన మరుక్షణమే అరుణ్ కూడా తనపై ప్రేమను పెంచుకుంటాడు.ఆ తరువాత ఒకరి,ఫోన్ నంబర్స్ ఒకరు తీసుకొని తరచూ ఫోన్ లో మాట్లాడుతూ ఉంటారు  .అయితే ఒకరోజు ఇంట్లో ఎవరూ లేని టైంలో అంజలి అరుణ్ ను ఇంటికి పిలుస్తుంది. అంజలి పై ఉన్న ప్రేమతో ఇంటికి వచ్చిన అరుణ్ తెలివిగా అంజలిని తన మాటలతో కన్విన్స్ చేస్తూ అంజలిని లోబరుచు కుందామని ప్రయత్నించే  సమయంలో ఏం జరిగింది.. అంజలి అరుణ్ చెప్పే మాటలకు కన్విన్స్ అయ్యిందా.., లేక ఇల్లాలిగా తన కుంటుంబానికి ఉన్న గౌరవాన్ని కాపాడిందా లేదా అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే …

నటీనటుల పనితీరు
పూర్ణ కెరీర్ లో “బ్యాక్ డోర్” ఓ మైల్ స్టోన్ గా నిలిచి పోతుంది, తన కుటుంబాన్ని  చూసుకుంటూ అంజలి పాత్రలో  ఒదిగి పోయి నటిస్తూనే, తన మనసులో వుండే కోరికలను, స్త్రీ తత్వాన్ని ప్రదర్శించింది. అరుణ్ క్యారెక్టర్ లో తేజ  అద్భుతంగా నటించారు. మిడిల్ క్లాస్ వారి పడే ఇబ్బందులను కళ్ళకు కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రతి ఎమోషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇంకా ఈ చిత్రంలో నటించిన వారంతా తమ పరిధి మేర చాలా చక్కగా నటించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు

స్లీప్ సినిమాగా” అన్నట్లుగా సినిమానే సర్వస్వంగా భావించే కర్రి బాలాజీకి “బ్యాక్ డోర్” బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది. మంచి మెసేజ్  ఉన్న సినిమాలు రావాదం చాలా తక్కువ. ఇలాంటి అరుదైన చిత్రాలు వస్తే తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తాయి. కమర్షియల్ గా సినిమా చూపిస్తూ..చివరలో మంచి సందేశాన్ని చెప్పారు దర్శకుడు. చూపు వెళ్లిన ప్రతి చోటికీ మనసు వెళ్ల కూడదు, మనసు వెళ్లిన ప్రతి చోటికీ మనిషి వెళ్లకూడ దంటూ ట్రైలర్ లో చెప్పిన డైలాగ్ లోనే  మొత్తం కథను చెప్పాడు. సినిమాటోగ్రఫర్ శ్రీకాంత్ నారోజ్ వర్క్ అద్భుతంగా ఉంది. ఇందులో ఉన్న  “యుగాల భారత స్త్రీని” పాట , రారా నన్ను పట్టేసుకుని వంటి రొమాంటిక్ సాంగ్ లు ప్రేక్షకులను  ఆకట్టు కుంటాయి.. సినిమాటోగ్రఫీ  సంగీతం వంటి టెక్నికల్ అంశాలు చాలా బలంగా ఉన్నాయి. ఇలాంటి మంచి సినిమా చేసిన నిర్మాత బి శ్రీనివాస రెడ్డికి సినిమాపై ఉన్న ప్రేమ తెలుస్తోంది. అటు యూత్ కు, ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్ కు నచ్చేలా  చక్కటి సినిమాను నిర్మించారు. అంతా కలిసి చూసే లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ “బ్యాక్ డోర్” చిత్రం అందరికీ తప్పక నచ్చుతుంది.

                Cinemarangam.com 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here