Message Oriented ‘Reddy Garintlo Rowdyism’ Review

Cinemarangam.com
Review Rating..3.25/5
స‌మ‌ర్ప‌ణ‌:  కొరివి పిచ్చిరెడ్డి, స‌ర‌స్వ‌తి
బ్యాన‌ర్‌:  సిరి మూవీస్‌
నిర్మాత‌:  కె. శిరీషా ర‌మ‌ణారెడ్డి
రిలీజ్‌:  స్క్రీన్ మ్యాక్స్ పిక్చ‌ర్స్‌
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: ఎం. ర‌మేష్‌, గోపి
నటీనటులు : ర‌మ‌ణ్‌, ప్రియాంక రౌరీ, పావ‌ని, అంకిత‌, వర్ష, వినోద్ కుమార్‌, ర‌చ్చ ర‌వి, మిర్చి మాధ‌వి, జూనియ‌ర్ బాల‌కృష్ణ‌, శంక‌ర్‌, కృష్ణ‌, ప్ర‌కాష్ అడ్డా, వెంక‌ట్‌, సిద్ధు తది తరులు
సంగీతం: మ‌హిత్ నారాయ‌ణ్‌
బ్యాగ్రౌండ్ స్కోర్‌: శ్రీ‌వ‌సంత్‌
సినిమాటోగ్ర‌ఫీ: ఎ.కె. ఆనంద్‌
ఎడిటింగ్‌: శ్రీ‌నివాస్ పి. బాబు, సంజీవ‌రెడ్డి
ఆర్ట్‌: న‌రేష్ సిహెచ్‌.
ఫైట్స్‌: అల్టిమేట్ శివ‌, కుంగ్‌ఫూ చంద్రు
కొరియోగ్ర‌ఫీ:  చందు రామ్‌, రాజ్ పైడి, సాయిశివాజీ
పి.ఆర్.ఓ : చంద్ర వట్టికూటి

ప్రస్తుతం టాలీవుడ్‌లో విభిన్న కథా చిత్రాల జోరు సాగుతుంది. అయినప్పటికీ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్స్ కి బాగా స్కోప్‌ ఉంది.ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్‌ చేసేలా, ఎంగేజ్‌ చేసేలా ఉంటే మంచి ఆదరణ పొందుతూ.. బాక్సాఫీసు వద్ద విజయాలు సాధిస్తున్నాయి. అలాంటి కమర్షియల్‌ అంశాలతో, లవ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, సందేశం మేళవింపుతో వచ్చిన చిత్రం `రెడ్డిగారింట్లో రౌడీయిజం`.సిరి మూవీస్ బ్యాన‌ర్‌పై సీనియ‌ర్ న‌టుడు వినోద్ కుమార్, ర‌మ‌ణ్ ప్రియాంక రౌరీ, పావ‌ని, అంకిత‌, వ‌ర్ష నటీనటులు గా ఎం.ర‌మేష్‌, గోపి ద‌ర్శ‌క‌త్వంలో కె.శిరీషా ర‌మ‌ణా రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌, సాంగ్స్‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భించాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 8న విడుద‌ల అవుతున్న  రెడ్డిగారింట్లో రౌడీయిజం  సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఏంటర్ టైన్ చేసిందో రివ్యూ లో చూద్దాం పదండి.


కథ:
ప్రతాప్ రెడ్డి(వినోద్ కుమార్) గ్రామంలో కులాంతర వివాహాలకు, లవ్‌ మ్యారేజెస్‌లను అక్కడివారంతా వ్యతిరేకిస్తుంటారు.అలా చేసిన వారిని చంపడానికి కూడా వెనుకాడరు.. తన పక్క గ్రామానికి చెందిన శివ(ర‌మ‌ణ్) ఊళ్ళో అల్లరి చిల్లరగా స్నేహితులతో సరదాగా తిరిగే ఓ గ్రామీణ యువకుడు. తండ్రి(జూనియర్ బాలకృష్ణ) ఎంత చెప్పినా డిగ్రీ కంప్లీట్ చేయకుండా అమ్మాయిల చుట్టూ  ప్రేమ పేరుతో తిరుగుతుంటాడు. తన క్లాస్ మేట్ అయిన సంధ్య (ప్రియాంక రౌరీ)ని ప్రేమిస్తాడు శివ. ఈమె ప్రతాప్ రెడ్డి కూతురు. అసలే ప్రేమ పెళ్ళిళ్లకి, కులాంతర వివాహాలంటే రగిలిపోయే ప్రతాప్ రెడ్డి వీరి వివాహానికి ఒప్పుకున్నాడా?అసలు సంధ్య… శివని నిజంగానే ప్రేమించిందా? వీరిద్దరి లవ్‌లో ఉన్న ట్విస్ట్ ఏంటీ? చివరికి వీరి ప్రేమ ఎలాంటి మలుపులు తిరిగిందో తెలుసుకోవాలంటే కచ్చితంగా సినిమా చూడాల్సిందే ..

నటీనటుల పనితీరు 
హీరో ర‌మ‌ణ్‌ కు ఇది మొదటి చిత్రమైనా నటనలో ఎంతో అనుభవమున్న  నటుడిలా పాటల్లో ,ఫైట్స్, డైలాగ్స్ లలో చాలా ఎనర్జిటిక్ గా నటించి ప్రేక్షకులను అలరిస్తూ మెప్పించాడు. హీరోయిన్స్ ప్రియాంక రౌరీ, పావ‌ని, అంకిత‌, వర్ష లు  తమ అంద చందాలతో  ప్రేక్షకులను కట్టిపడేశారు.   సీనియర్ హీరో వినోద్ కుమార్ విలన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించారు. రచ్చ రవి,హీరో తండ్రి గా జూనియర్ బాలకృష్ణ బాగా ఆకట్టుకున్నాడు. కామెడీ తో ప్రేక్షకులకు నవ్వించారు. ఇలా అందరూ కూడా తమకిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు.


సాంకేతిక నిపుణుల పనితీరు
కులం, మతం కంటే… ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే గొప్ప మానవత్వం అనే సందేశంతో తెరకెక్కిన సున్నితమైన కథను వెండితెరపై మలచడానికి ట్విస్టులతో రాసుకున్న స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో కులం పేరుతో ఆటవికంగా మనుషులను చంపడం వంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నిమ్న కులాల వారిని అంటరాని వారిగా చూడటం, వారిపై దాడులు చూస్తేనే ఉన్నాం. ఆలాంటి సున్నితమైన సబ్జెక్టును ఎంచుకుని, దానికి కమర్షియల్ అంశాలను మేళవించి ఈ చిత్రాన్ని సందేశాత్మకంగా మలిచిన దర్శకులు రమేష్‌, గోపీ లిద్దరూ చాలా చక్కగా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారని చెప్పచ్చు.. ఒక కొత్త హీరోని ప్రేక్షకులు మెచ్చేలా వెండితెరపై అన్ని విధాలుగా ఆవిష్కరించారు. సున్నితమైన కథను ఓ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాంగా మలచడానికి ట్విస్టులతో రాసుకున్న స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. ఇలాంటి చిత్రాలు ఇప్పటికే చాలా వచ్చినా ఇది ఎప్పటికీ సెలబుల్‌ కంటెంట్‌గా నిలుస్తుంది. అక్కడక్కడ కాస్త రెగ్యూలర్‌గానే అనిపించినా, కాస్త స్లోగా ఉన్నప్పటికీ మధ్య మధ్యలో వచ్చే ట్విస్ట్ లు, కామెడీ ఆకట్టుకుంటాయి. సినిమా కోసం వారు పడిన కష్టం కనిపిస్తుంది.శ్రీ‌వ‌సంత్‌ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్‌ ఓకే. మ‌హిత్ నారాయ‌ణ్‌ స్వరపరిచిన సంగీతం బాగుంది. ఎ.కె. ఆనంద్‌ సినిమాటోగ్ర‌ఫీ బాగుంది.  శ్రీ‌నివాస్ పి. బాబు, సంజీవ‌రెడ్డి ల ఎడిటింగ్ పరవాలేదు. అల్టిమేట్ శివ‌, కుంగ్‌ఫూ చంద్రు కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్ మాస్ ని మెప్పిస్తాయి. నిర్మాణ విలువలు సినిమాకి హైలైట్‌గా నిలిచాయి. భారీ సినిమాలు, స్టార్ హీరోల సినిమాల స్థాయిలో  నిర్మాత‌ కె.శిరీషా ర‌మ‌ణారెడ్డి ఈ సినిమాను రాజీపడకుండా మంచి క్వాలిటీతోస్ ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించారని చెప్పొచ్చు. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా “రెడ్డిగారింట్లో రౌడీయిజం”. ఈ సినిమా చూసిన వారందరికీ తప్పక నచ్చుతుంది

Cinemarangam.com  Review Rating..3.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here